అన్వేషించండి

Pawan Kalyan - Harish Shankar : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డౌట్స్ తీర్చిన హరీష్ శంకర్

ఏపీలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల షూటింగులకు బ్రేక్స్ పడతాయా? అని అభిమానుల్లో కూడా సందేహాలు నెలకొన్నాయి. వాటికి దర్శకుడు హరీష్ శంకర్ బ్రేక్స్ వేశారు.

ఏపీలో తాజా రాజకీయ పరిస్థితుల (AP Politics Latest Updates) గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu Arrest) అరెస్ట్, తర్వాత జరుగుతున్న పరిణామాలను ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు అరెస్టుపై జనసేనాని, తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించిన విషయం కూడా తెలుసు. 

రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం గురించి కూడా ప్రజలకు, ప్రేక్షకులకు తెలుసు. రాజకీయాల్లో పవన్ బిజీ బిజీ అవుతుంటే? ఆయన హీరోగా నటిస్తున్న సినిమాల సంగతి ఏమిటి? ఆయా షూటింగులకు బ్రేకులు తప్పవా? అభిమానుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ చెక్ పెట్టారు. ఫోటోలతో సమాధానాలు ఇచ్చారు. 

'ఉస్తాద్' షూటింగ్ ఆగడం లేదు
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఆయన వీరాభిమానులలో ఒకరైన హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఇటీవల హైదరాబాద్ సిటీలో లేటెస్ట్ షెడ్యూల్ మొదలైంది. ఆ తర్వాత ఏపీలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. జనసేన పార్టీ సమావేశాలకు హాజరు కావడానికి పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరి వెళ్లడంతో షూటింగుకు బ్రేకులు పడ్డాయని చాలా మంది భావించారు. అయితే... హరీష్ శంకర్ పక్కాగా షెడ్యూల్స్ ప్లాన్ చేయడంతో బ్రేక్స్ పడటం లేదని తెలుస్తోంది. 

పవన్ పొలిటికల్ షెడ్యూల్స్, షూటింగ్ షెడ్యూల్ క్లాష్ కాకుండా హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ చేస్తున్నారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. పవన్ లేనప్పుడు... ఆయన అవసరం లేని సన్నివేశాలను పూర్తి చేస్తున్నారట. పవన్ అందుబాటులోకి వచ్చినప్పుడు... ఆయనతో పాటు ఇతర తారాగణం మీద సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. బుధవారం పవన్, ఇతర ఆర్టిస్టుల మీద సీన్స్ తీశారు. ఆ స్టిల్స్ విడుదల చేశారు. అభిమాన కథానాయకుడితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన హరీష్ శంకర్ 'వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ తో అన్ కండిషనల్ బాండ్ ఉన్నప్పుడు ఇంతకంటే ఏం అడగగలను' అని పేర్కొన్నారు. ఇప్పటివరకు 40 శాతం చిత్రీకరణ చేశారట.

Also Read విజయ్ 'లియో'కి ఆ దేశంలో నో కట్స్ - మరి, మన దేశంలో?  

'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల ఓ కథానాయికగా నటిస్తున్నారు. మరో కథానాయికగా అఖిల్ అక్కినేని 'ఏజెంట్', వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' సినిమాల ఫేమ్ సాక్షి వైద్య నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్. 

Also Read రియల్ లైఫ్‌లో హీరో హీరోయిన్‌కు పెళ్లైంది - అశోక్ సెల్వన్ భార్య ఎవరో తెలుసా?

'ఉస్తాద్ భగత్ సింగ్' కాకుండా సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ', క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి నిర్మించే సినిమా కూడా చేయాల్సి ఉంది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana VRO System: తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు ప్రభుత్వం నిర్ణయం, ఉత్తర్వులు జారీ
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Embed widget