Ashok Selvan Marriage : రియల్ లైఫ్‌లో హీరో హీరోయిన్‌కు పెళ్లైంది - అశోక్ సెల్వన్ భార్య ఎవరో తెలుసా?
అనువాద సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో అశోక్ సెల్వన్ ఈ రోజు ఉదయం ఓ ఇంటివాడు అయ్యారు.

తమిళ కథానాయకుడు అశోక్ సెల్వన్ (Ashok Selvan) గుర్తు ఉన్నారా? ప్రముఖ తెలుగు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన 'నిన్నిలా నిన్నిలా'లో హీరో. ఆ సినిమాలో ఆయన సరసన నిత్యా మీనన్, రీతూ వర్మ నటించారు. ఇంకా బాగా చెప్పాలంటే... విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా ఉందిగా! అందులో హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ పెళ్ళికి ముందు వేరే అబ్బాయితో వెళ్ళిపోతుంది కదా! ఆ అబ్బాయి ఈయనే!
ఓ తెలుగు సినిమాలో హీరోగా నటించడం, మరో తెలుగు సినిమాలో అతిథి పాత్ర చేయడంతో పాటు అనువాద సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు అశోక్ సెల్వన్ దగ్గర అయ్యారు. ఇప్పుడు ఆయన ఓ ఇంటివాడు అయ్యారు.
అశోక్ సెల్వన్ పెళ్లైంది...
అమ్మాయి ఎవరో తెలుసా?
తమిళ కథానాయకుడు అశోక్ సెల్వన్ (Ashok Selvan Marriage) ఈ రోజు ఉదయం ఏడు అడుగులు వేశారు. కీర్తీ పాండియన్ మెడలో ఆయన మూడు ముడులు వేశారు. తమిళనాడులోని తిరుణవేలిలో జరిగిన ఈ వివాహానికి నూతన వధూవరుల కుటుంబ సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరు అయ్యారు.
ఇంతకీ, అశోక్ సెల్వన్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా? తమిళ టీవీ వీక్షకులకు, వెండితెర ప్రేక్షకులకు తెలిసిన నటి రమ్యా పాండియన్ కజిన్. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయే. ఇంకా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటంటే... కీర్తీ పాండియన్ తమిళ హీరోయిన్. తమిళ నటుడు, రాజకీయ నాయకుడు అరుణ్ పాండియన్ కుమార్తె.
'బ్లూ స్టార్' సినిమా టు మ్యారేజ్!
అశోక్ సెల్వన్, కీర్తీ పాండియన్ కలిసి ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నారు. తమిళ సినిమా 'బ్లూ స్టార్'లో జంటగా నటిస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణలో మొదలైన పరిచయం, ఆ తర్వాత ప్రేమగా మారిందని చెన్నై సినిమా వర్గాల ఖబర్. అయితే, తమ ప్రేమ విషయాన్ని వీళ్ళిద్దరూ తొలుత రహస్యంగా ఉంచారు. కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. రమ్యా పాండియన్ చేసిన ట్వీట్ కారణంగా వాళ్ళ విషయం బయటకు వచ్చింది. ఇవాళ పెళ్లి ఫోటోలను అశోక్ సెల్వన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Also Read : దయచేసి అర్థం చేసుకోండి - అఫీషియల్‌గా ఆ మాట చెప్పిన 'సలార్' టీమ్!
“செம்புலப் பெயல் நீர் போல
— Ashok Selvan (@AshokSelvan) September 13, 2023
அன்புடை நெஞ்சம் தாம் கலந்தனவே.”#Grateful#AshoKee🔥 @iKeerthiPandian pic.twitter.com/TyQwuO7oGK
'బిగ్ బాస్' తమిళ్ సీజన్ 1లో రమ్యా పాండియన్ పార్టిసిపేట్ చేశారు. గత ఏడాది 'బిగ్ బాస్ అల్టిమేట్'లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఓటీటీలో (రెండు వెబ్ సిరీస్) కూడా సందడి చేశారు. అరడజను సినిమాలు చేశారు. ఆమె ద్వారా అశోక్ సెల్వన్, కీర్తీ పాండియన్ ఒకరికొకరు పరిచయం అయ్యారని కోలీవుడ్ టాక్.
Also Read : విశాల్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు - 'మార్క్ ఆంటోని' విడుదలకు లైన్ క్లియర్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

