Salaar Postponed : దయచేసి అర్థం చేసుకోండి - అఫీషియల్‌గా ఆ మాట చెప్పిన 'సలార్' టీమ్!
Salaar Coming Soon : రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు, ప్రేక్షకులకు తెలిసిన మాటే. కాకపోతే... ఈ రోజు అఫీషియల్ గా ప్రొడక్షన్ హౌస్ నుంచి బయటకు వచ్చింది.
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు తెలిసిన విషయమే. వాళ్ళతో పాటు 'సలార్' విడుదల కోసం ఎదురు చూస్తున్న జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులకూ ఆ విషయం తెలుసు. కాకపోతే... ఇవాళ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ఆ మాటను అధికారికంగా వెల్లడించింది. 'సలార్'ను ఈ నెల 28న విడుదల చేయడం కుదరడం లేదని పేర్కొంది. అయితే... అభిమానులు దేని కోసం అయితే ఎదురు చూస్తున్నారో... ఆ అసలు విషయాన్ని మాత్రం చెప్పలేదు.
దయచేసి అర్థం చేసుకోండి!
''సలార్' సినిమాకు ప్రేక్షకులు ఎంతగానో మద్దతు అందిస్తున్నారు. అందుకు గాను వాళ్ళకు థాంక్స్. అయితే... అనివార్య కారణాల వల్ల ముందుగా అనుకున్న విడుదల తేదీ సెప్టెంబర్ 28న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేక పోతున్నాం. విడుదల ఆలస్యం అవుతుంది. థియేటర్లలో ప్రేక్షకులకు అసాధారణ, అత్యున్నత సినిమాటిక్ అనుభూతి ఇవ్వడానికి మేం తీవ్రంగా శ్రమిస్తున్నాం. అందుకే, ఈ నిర్ణయం తీసుకున్నాం. దయచేసి అర్థం చేసుకోండి! ప్రస్తుతం 'సలార్ 1'కు తుది మెరుగులు దిద్దుతున్నాం. ఈ అద్భుతమైన ప్రయాణంలో మాకు తోడుగా ఉన్నందుకు థాంక్స్. త్వరలో కొత్త విడుదల తేదీ అనౌన్స్ చేస్తాం'' అని హోంబలే ఫిల్మ్స్ సంస్థ సోషల్ మీడియాలో పేర్కొంది.
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'స్పిరిట్' షూటింగ్ స్టార్ట్ చేసేది ఎప్పుడో చెప్పిన ప్రొడ్యూసర్!
View this post on Instagram
విడుదల తేదీ కోసం ప్రేక్షకులు ఎదురు చూపులు!
ఆల్రెడీ ప్రభాస్ అభిమానులకు సెప్టెంబర్ 28 నుంచి సినిమా విడుదల వాయిదా పడిందని తెలుసు. అందుకని, వాళ్ళకు ఈ ప్రకటన కొత్తగా ఏమీ అనిపించలేదు. అసలు, ఇప్పుడు వాళ్ళు ఎదురు చూస్తున్నది కొత్త విడుదల తేదీ కోసం! సెప్టెంబర్ 28న కాకపోతే ఎప్పుడు విడుదల చేస్తారు? అనేది తెలుసుకోవడం కోసం! వాయిదా పడిన తర్వాత ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేయవచ్చని వార్తలు వచ్చాయి. తర్వాత దీపావళి సందర్భంగా నవంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం వచ్చింది.
Also Read : విశాల్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు - 'మార్క్ ఆంటోని' విడుదలకు లైన్ క్లియర్!
'కెజియఫ్ 2' తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సలార్'. దీనిని కూడా 'కెజియఫ్' తరహాలో రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'కెజియఫ్', 'కెజియఫ్ 2' నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాను కూడా నిర్మిస్తోంది. విజయ్ కిరగందూర్ నిర్మాత. ఇందులో ప్రభాస్ జోడీగా శృతి హాసన్ నటిస్తున్నారు. జర్నలిస్ట్ ఆద్య పాత్రను ఆమె పోషిస్తున్నారు. ప్రభాస్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు నటిస్తున్నారు.
వరదరాజ మన్నార్ పాత్రలో మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ మన్నార్ పాత్రలో సీనియర్ తెలుగు నటుడు జగపతి బాబు, ఇతర పాత్రల్లో 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial