![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Prabhas Spirit Update : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'స్పిరిట్' షూటింగ్ స్టార్ట్ చేసేది ఎప్పుడో చెప్పిన ప్రొడ్యూసర్!
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న సినిమా 'స్పిరిట్'. షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసేది ప్రొడ్యూసర్ చెప్పారు.
![Prabhas Spirit Update : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'స్పిరిట్' షూటింగ్ స్టార్ట్ చేసేది ఎప్పుడో చెప్పిన ప్రొడ్యూసర్! Prabhas Sandeep Reddy Vanga's Spirit movie regular shoot starts from June 2024 latest Telugu news Prabhas Spirit Update : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'స్పిరిట్' షూటింగ్ స్టార్ట్ చేసేది ఎప్పుడో చెప్పిన ప్రొడ్యూసర్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/12/2fd5d25d402cd763bfd0ef0087a071791694509276097313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా కల్ట్ క్లాసిక్ హిట్ 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈ సంగతి ప్రేక్షకులకు తెలుసు. ఆల్రెడీ ఎప్పుడో సినిమాను అనౌన్స్ చేశారు. మరి, సెట్స్ మీదకు ఎప్పుడు తీసుకు వెళతారు? రెబల్ స్టార్ అభిమానుల మదిలో ఎన్నో సందేహాలు ఉన్నాయి. వాటన్నిటికీ నిర్మాత భూషణ్ కుమార్ చెక్ పెట్టారు. ఆయన 'స్పిరిట్' గురించి ఓ అప్డేట్ ఇచ్చారు.
జూన్ నుంచి సెట్స్ మీదకు 'స్పిరిట్'
'అర్జున్ రెడ్డి'తో తెలుగులో భారీ విజయం అందుకోవడమే కాదు... ఉత్తరాది ప్రేక్షక లోకాన్ని, నిర్మాతలను కూడా సందీప్ రెడ్డి వంగా ఆకర్షించారు. ఆ సినిమాపై కొంత మంది విమర్శలు కూడా చేశారు. అయితే... 'అర్జున్ రెడ్డి' కథతో హిందీలో షాహిద్ కపూర్ హీరోగా 'కబీర్ సింగ్' తీసి మరో భారీ విజయం అందుకున్నారు దర్శకుడు. ఆ తర్వాత రణబీర్ కపూర్ హీరోగా 'యానిమల్' తీశారు. ఆ చిత్రాన్ని టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రభాస్, సందీప్ రెడ్డ్ వంగా 'స్పిరిట్' చిత్రానికి కూడా ఆయనే నిర్మాత.
రణబీర్ కపూర్ సరసన రష్మికా మందన్నా కథానాయికగా నటించిన 'యానిమల్'ను డిసెంబర్ 1న విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఐదారు నెలలకు 'స్పిరిట్'ను సెట్స్ మీదకు తీసుకు వెళతామని బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భూషణ్ కుమార్ వెల్లడించారు. అదీ సంగతి!
'స్పిరిట్' కంటే ముందు 'కల్కి'
'స్పిరిట్'ను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి ముందు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ ఫిల్మ్ 'కల్కి'ని ప్రభాస్ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత ఓ నాలుగు నెలలు విశ్రాంతి తీసుకుని 'స్పిరిట్' చిత్రీకరణ ప్రారంభిస్తారట.
Also Read : కళ్యాణ్ రామ్ 'డెవిల్'తో దర్శకుడిగా మారిన నిర్మాత - తెర వెనుక ఏం జరిగింది?
'స్పిరిట్' ప్రభాస్ 25వ సినిమా. పైగా, 'అర్జున్ రెడ్డి' దర్శకుడు ఆయనను ఏ విధంగా చూపిస్తారోనని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నట్లు గతంలోనే నిర్మాత అనౌన్స్ చేశారు. (Bhushan Kumar On Spirit Movie) ''స్పిరిట్' చాలా యూనిక్ సినిమా. ఇదొక కాప్ డ్రామా. ప్రభాస్ పోలీస్ రోల్ చేస్తున్నారు. అయితే, సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు స్పెషల్ స్టైల్ తీసుకు వచ్చారు. ఇంతకు ముందు ఎప్పుడూ అటువంటి సినిమా చూసి ఉండరు'' అని భూషణ్ కుమార్ పేర్కొన్నారు.
'సలార్' విడుదల తేదీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!
'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటించిన సినిమా 'సలార్'. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ఒక్కటి కాదు... రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలుత 'సలార్ 1'ను సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేశారు. అయితే... సీజీ వర్క్ ఆలస్యం కారణంగా విడుదల వాయిదా పడింది. ఎప్పుడు విడుదల చేస్తారు? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
Also Read : ఎన్టీఆర్ బావమరిది సినిమా వాయిదా - ఆ రోజు 'మ్యాడ్' రావడం లేదు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)