LEO Movie - No Cuts : విజయ్ 'లియో'కి ఆ దేశంలో నో కట్స్ - మరి, మన దేశంలో?
తమిళ స్టార్ విజయ్ హీరోగా నటించిన 'లియో' సినిమాను ఓ దేశంలో ఎటువంటి కట్స్ లేకుండా విడుదల చేయాలని ప్లాన్ చేశారు.
తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు, దళపతి విజయ్ నటించిన సినిమా లియో (Leo Vijay Movie). 'విక్రమ్' విజయం తర్వాత లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇంతకు ముందు విజయ్, లోకేష్ కనగరాజ్ కలయికలో 'మాస్టర్' వచ్చింది. ఆ సినిమాకు కమర్షియల్ విజయం అయితే లభించింది కానీ ఆశించిన పేరు రాలేదు. అయితే, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (Lokesh Cinematic Universe)లో 'లియో' భాగం కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి.
యూకేలో 'లియో' సినిమాకు 'నో' కట్స్!
'లియో' అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న యూకే వాసులకు అహింస ఎంటర్‌టైన్‌మెంట్ సూపర్ న్యూస్ చెప్పింది. యూకేలో 'లియో'కు ఎటువంటి కట్స్ లేకుండా విడుదల చేస్తామని ట్వీట్ చేసింది. అంటే... దర్శకుడు లోకేష్ కనగరాజ్ తీసింది తీసినట్టు విడుదల చేస్తారన్నమాట. ఆయన ఏది అయితే రిలీజ్ చేయాలనుకున్నారో? ఆ సినిమా రిలీజ్ చేస్తారు. 12ఏ సెన్సార్ సర్టిఫికెట్ తో! అదీ సంగతి!
Also Read : రియల్ లైఫ్‌లో హీరో హీరోయిన్‌కు పెళ్లైంది - అశోక్ సెల్వన్ భార్య ఎవరో తెలుసా?
Out of respect for Lokesh Kanagaraj's vision, we're committing to NO CUTS for #LEO's UK release. Every frame is essential, and audiences deserve to experience it in its raw form. Once we feel the film has reached a wide audience, we'll switch to a 12A friendly version 🙌 pic.twitter.com/TJemUXVTwr
— Ahimsa Entertainment (@ahimsafilms) September 13, 2023
మన దేశంలో సెన్సార్ ఏం చేస్తుందో?
యూకే రిలీజ్ గురించి తెలిసిన తర్వాత మన దేశంలో 'లియో' చిత్రానికి సెన్సార్ బోర్డు ఎన్ని కట్స్ చెబుతుందో? అని విజయ్ అభిమానులు చర్చించుకోవడం మొదలు పెట్టారు. ఆల్రెడీ 'లియో' ఫస్ట్ లుక్ పోస్టర్లు చూస్తే రక్తం చిందుతూ కనిపించింది. యాక్షన్ సన్నివేశాల్లో ఇంకే స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. అంత రక్తపాతానికి సెన్సార్ బోర్డు ఓకే చెబుతుందా? లేదంటే కట్స్ చెబుతుందా? అనేది వెయిట్ చేయాలి.
Also Read : దయచేసి అర్థం చేసుకోండి - అఫీషియల్‌గా ఆ మాట చెప్పిన 'సలార్' టీమ్!
'లియో' సినిమాకు ఓ ప్రత్యేకత ఏమిటంటే... విజయ్, హీరోయిన్ త్రిష 14 ఏళ్ళ విరామం తర్వాత నటిస్తున్న చిత్రమిది. 'విక్రమ్'లో ఏజెంట్ టీనా రోల్ చేసిన వాసంతి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక... 'ఖైదీ', 'విక్రమ్' సినిమాలతో 'లియో'ను ఎలా కనెక్ట్ చేస్తారు? అనేది చూడాలి. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన 'నా రెడీ దా' పాటకు స్పందన బావుంది.
'లియో' చిత్రాన్ని సెవెన్ స్కీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి నిర్మిస్తున్నారు. ఇందులో త్రిషతో పాటు తెలుగులో 'లీడర్' సహా కొన్ని సినిమాలు చేసిన హీరోయిన్ ప్రియా ఆనంద్ కీలక పాత్ర చేశారు. ఇంకా బాలీవుడ్ స్టార్, 'కెజియఫ్'తో ప్రతినాయకుడిగా దక్షిణాది ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న హిందీ హీరో సంజయ్ దత్ ఓ పాత్రలో నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ తదితరులు ఉన్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రహణం : మనోజ్ పరమహంస, కూర్పు : ఫిలోమిన్ రాజ్, కళ : ఎన్. సతీష్ కుమార, యాక్షన్ : అన్బరివ్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial