Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Ram Charan : పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ శంకర్ సినిమాతో పాటు రామ్ చరణ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Director Shankar interesting comments on Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, విజనరీ డైరెక్టరీ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్'. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. భారీఅంచనాలు నెలకొన్న ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా వైడ్ గా జనవరి 10న రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషనల్ ఈవెంట్లలో బిజీబిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ శంకర్ 'గేమ్ ఛేంజర్' సినిమాతో పాటు రామ్ చరణ్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
'గేమ్ ఛేంజర్'లో రామ్ చరణ్ ఎందుకు ?
దర్శకుడు శంకర్ మాట్లాడుతూ "ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ముందే ఈ మూవీని చేయాలని రామ్ చరణ్ డిసైడ్ అయ్యారు. నేను, దిల్ రాజు కూడా రామ్ చరణ్ ఈ మూవీకి పర్ఫెక్ట్ ఛాయిస్ అనుకున్నాము. నా స్టోరీలో యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది కాబట్టి, ఓ పెద్ద హీరో అయితే బాగుంటుందన్న ఆలోచనతో రామ్ చరణ్ తో ఈ గేమ్ ఛేంజర్ ప్రయాణాన్ని మొదలు పెట్టాము" అంటూ ఈ మూవీకి రామ్ చరణ్ ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో వెల్లడించారు.
A visionary master at the helm with Global Star's firepower 🤙🏼
— Sri Venkateswara Creations (@SVC_official) December 19, 2024
Electrifying music that sparks magic 😉
Heart-pounding emotions that hit deep 🙌🏼
And action sequences that will leave you breathless 💥
Get ready for the #GameChanger festival from January 10th! pic.twitter.com/ooVt4FlUgR
రామ్ చరణ్లో ఏదో తెలియని శక్తి
రామ్ చరణ్ గురించి డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ "రామ్ చరణ్ ను చూస్తే ఆయన ఏదో తెలియని శక్తిని లోలోపల కంట్రోల్ చేసి పెట్టినట్టుగా అనిపిస్తుంది. టైం వచ్చినప్పుడు ఆ శక్తి బ్లాస్ట్ అవుతుందా అన్నట్టుగా ఉంటుంది. రామ్ చరణ్ మంచి స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న నటుడు మాత్రమే కాదు... ఆయన ఎలాంటి సీన్స్ అయినా అద్భుతంగా హ్యాండిల్ చేయగలరు" అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్ చరణ్ అవినీతి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ లో రాజకీయ అంశాలతో ముడిపడి ఉన్న హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చూపించి ఆసక్తిని పెంచేశారు. 'గేమ్ ఛేంజర్' మూవీలో రామ్ చరణ్, కియారా అద్వానీలతో పాటు అంజలి, ఎస్జే సూర్య, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే ఈ సినిమాలోని 'జరగండి', 'రా మచ్చా', 'నానా హైరానా' వంటి పాటలను రిలీజ్ చేయగా, అవి ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి నాలుగో పాట 'డోప్'ను రిలీజ్ చేయబోతున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 'గేమ్ ఛేంజర్' మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

