అన్వేషించండి

కియారాకు పొగరు, జాన్వీ చాలా స్వీట్ - సోషల్ మీడియా అంతా ఇదే టాక్, ఎందుకంటే?

బాలీవుడ్ స్టార్స్ జాన్వీ కపూర్, కియారా అద్వానీ గురించి ఓ ఎయిర్ హోస్టెస్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. విమాన ప్రయాణంలో వారి వ్యవహార శైలి గురించి ఆమె కీలక విషయాలు వెల్లడించింది.

సినిమా హీరోయిన్లు వెండి తెరపై చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తారు. సినిమాల్లో వారి వ్యవహార శైలి అందరినీ ఆకట్టుకుంటుంది. కానీ, నిజ జీవితంలో వాళ్లు ఎలా ఉంటారు? ఎలా ప్రవర్తిస్తారు? అనేది తెలియదు. అయితే, వారి గురించి ఎంతో కొంత తెలిసిన వాళ్లలో ఎయిర్ హోస్టెస్ కూడా ఉంటారు. ఎందుకంటే, సినీ తారలు నిత్యం షూటింగుల కోసం విమాన ప్రయాణాలు చేస్తుంటారు. ఈ సమయంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో విమాన సిబ్బందికి కాస్త అవగాహన ఉంటుంది. తాజాగా ఓ విమానయాన సంస్థకు చెందిన ఎయిర్ హోస్టెస్ ఇద్దరు బాలీవుడ్ భామల గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరి గురించి ఏం చెప్పిందో తెలుసుకుందాం..

కియారా అద్వానీకి ఆటిట్యూడ్ చాలా ఎక్కువ!

సదరు ఎయిర్ హోస్టెస్ బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ, జాన్వీ కపూర్ గురించి కీలక విషయాలు చెప్పింది. ఈ ఇద్దరు నటీమణులు విమాన సిబ్బందితో ఎలా వ్యవహరిస్తారో వివరించింది. కియారా అద్వానీకి ఆటిట్యూడ్ చాలా ఎక్కువ అని, పొగరుగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఓ యూట్యూబ్ చానెల్ తో మాట్లాడిన ఆమె, ఫ్లైట్ జర్నీలో భాగంగా తాము బాదం, జీడిపప్పు లాంటి డ్రైప్రూట్స్ అందించేందుకు వెళ్తే నేరుగా తీసుకోదని చెప్పింది. తన అసిస్టెంట్ కు చెప్పి చెక్ చేయాలంటుందని వివరించింది. అంతేకాదు, ఎక్కువ ఆటిట్యూడ్ కూడా ప్రదర్శిస్తుందని చెప్పింది. అయితే, తాను ఎప్పుడూ కియారాతో నేరుగా మాట్లాడలేదని.. తన కొలిగ్స్ చెప్పిన విషయాలను కోట్ చేస్తున్నట్లు వెల్లడించింది. కనీసం విమాన సిబ్బంది విషయంలో కృతజ్ఞతా భావాన్ని కూడా ప్రదర్శించదని చెప్పుకొచ్చింది.

జాన్వీ కపూర్ స్వీట్ హార్ట్

అదే సమయంలో మరో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పై ఎయిర్ హోస్టెస్ ప్రశంసల జల్లు కురిపించింది. జాన్వీ స్వీట్ హార్ట్ అంటూ సర్టిఫికేట్ ఇచ్చింది. ఆమె విమాన సిబ్బందితో చాలా గౌరవంగా వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చింది. జాన్వీ కపూర్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీటులో నిద్రపోతున్నప్పటికీ,  ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కు సంబంధించిన ఇన్ స్ట్రక్షన్స్ ను శ్రద్ధగా వింటుందని చెప్పింది. ఎయిర్ హోస్టెస్ ఆమెకు తిను బండారాలు అందించినా, చక్కగా రిసీవ్ చేసుకుంటుందని వెల్లడించింది. అందరితోనూ ఆమె ఇట్టే కలిసిపోతుందని వివరించింది.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Its controversial baby 😮‍💨 (@missdhinchaak)

నెట్టింట వైరల్ అవుతున్న ఎయిర్ హోస్టెస్ వీడియో

ఎయిర్ హోస్టెస్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతంది. కొంత మంది నిజంగానే కియారాకు ఆటిట్యూడ్ ఎక్కువ అని సపోర్టు చేస్తుంటే, మరికొందరు ఒకరి క్యారెక్టర్ ను కించపరిచేలా కామెంట్స్ చేయడం మంచిది కాదంటున్నారు. కొద్ది గంటల ప్రయాణంలో ఒక వ్యక్తిని పూర్తిగా ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

Read Also: కోట్ల విలువైన బంగళా, విలాసవంతమైన కార్లు- ‘యానిమల్’ బ్యూటీ నికర ఆస్తుల విలువెంతో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు
ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు
Puspha Collections: పుష్పను తమ ఖాతాలో వేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తారా ? మౌనం వహిస్తారా ?
పుష్పను తమ ఖాతాలో వేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తారా ? మౌనం వహిస్తారా ?
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు
ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు
Puspha Collections: పుష్పను తమ ఖాతాలో వేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తారా ? మౌనం వహిస్తారా ?
పుష్పను తమ ఖాతాలో వేసుకున్న వైఎస్ఆర్‌సీపీ - అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తారా ? మౌనం వహిస్తారా ?
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Youtube Income: యూట్యూబ్ నుంచి సంపాదించాలంటే ఇన్ని మార్గాలు ఉన్నాయా? - మీరు కూడా చూసేయండి!
యూట్యూబ్ నుంచి సంపాదించాలంటే ఇన్ని మార్గాలు ఉన్నాయా? - మీరు కూడా చూసేయండి!
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
Sukumar: 'ఆర్య' నుంచి 'పుష్ప 2' వరకూ... సుకుమార్ హీరోలలో ఈ లోపాలు గమనించారా?
'ఆర్య' నుంచి 'పుష్ప 2' వరకూ... సుకుమార్ హీరోలలో ఈ లోపాలు గమనించారా?
Embed widget