Special Trains: రైలు ప్రయాణికులకు శుభవార్త, హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణానికి 8 స్పెషల్ ట్రైన్స్
SCR to run special trains from AP to Hyderabad

SCR to run special trains from AP to Hyderabad | హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ముగిశాయి. ఇప్పటికే పండగకు సొంతూళ్లకు వెళ్లిన కొందరు తిరిగి హైదరాబాద్ (Hyderabad)కు చేరుకున్నారు. అయితే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీ నుంచి హైదరాబాద్ తిరిగొస్తున్న వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగకు సొంతూరు వెళ్లేందుకు ప్రత్యే్క రైళ్లు (Special Trains) నడిపిన ద.మ.రైల్వే తిరుగు ప్రయాణాలకు మరో 8 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది.
జనవరి 18 నుంచి 20 తేదీలలో ఈ ప్రత్యేక రైళ్లు సేవలు అందించనున్నాయి. దాంతో సామాన్యుడికి ప్రయాణ ఖర్చులు తగ్గనున్నాయి. జనవరి 18న కాకినాడ నుంచి చర్లపల్లికి ఒక రైలు, విశాఖపట్నం నుంచి 2 ప్రత్యేక రైళ్లు చర్లపల్లికి స్టార్ట్ అవుతాయని తెలిపారు. అదే విధంగా జనవరి 19న విశాఖపట్నం, నరసాపురం నుంచి మరో 2 రైళ్లు చర్లపల్లి బయలుదేరతాయి. అదేరోజు చర్లపల్లి నుంచి భువనేశ్వర్‌కు ఒకటి, విశాఖపట్నానికి ఒకటి చొప్పున 2 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి జనవరి 20వ తేదీన మరో ప్రత్యేక రైలు ఉందని సీపీఆర్వో సీహెచ్ శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

