Triptii Dimri: కోట్ల విలువైన బంగళా, విలాసవంతమైన కార్లు- ‘యానిమల్’ బ్యూటీ నికర ఆస్తుల విలువెంతో తెలుసా?
‘యానిమల్’ మూవీతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్న అందాల తార త్రిప్తి దిమ్రి.. రీసెంట్ గా ముంబైలో విలాసవంతమైన బంగళాను కొనుకోలు చేసింది. దీని విలువ రూ. 14 కోట్లు.
Triptii Dimri’s Rs 14 Crore Luxurious House in Mumbai: గత కొద్దికాలంగా వరుస సినిమాలతో బాలీవుడ్ లో సత్తా చాటుతోంది గ్లామరస్ బ్యూటీ త్రిప్తి దిమ్రి. అందం, అభినయంతో అభిమానులను బాగా అలరిస్తోంది. రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ‘యానిమల్’ సినిమాతో త్రిప్తి మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం త్రిప్తి మోస్ట్ వాంటెడ్ యాక్టర్ల లిస్టులో చేరిపోయింది.
రూ. 14 కోట్లతో ముంబైలో బంగళా కొనుగోలు
తాజాగా త్రిప్తి దిమ్రి ముంబైలో విలాసవంతమైన బంగళాను కొనుగోలు చేసింది. బాలీవుడ్ ప్రముఖులు నివాసం ఉండే బాంద్రా సబర్బ్ లో ఆమె ఈ భవంతిని తీసుకుంది. ఈ ఇల్లు రణబీర్ కపూర్, ఆలియా భట్ నివాసానికి సమీపంలోనే ఉంది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రేఖ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు త్రిప్తి ఇంటి దగ్గరి నుంచే వెళ్తుంటారు. ఈ భవంతి 2,226 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ తో కలిసి మూడు అంతస్తులను కలిగి ఉంది. జూన్ 3న త్రిప్తి ఈ ఇంటిని కొనుగోలు చేసింది. ఇందుకు గాను రూ.70 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించింది.
త్రిప్తి సినీ కెరీర్
త్రిప్తి దిమ్రి ఫిబ్రవరి 23, 1994లో ఉత్తరాఖండ్ లోని గర్వాల్ లో జన్మించింది. ‘కాలా’, ‘బుల్ బుల్’, ‘లైలా మజ్ను’, ‘యానిమల్’ లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 'యానిమల్' మూవీతో 'నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా'గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
త్రిప్తి ఏం చదివిందంటే?
త్రిప్తి దిమ్రి ఫిరోజాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంది. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన అరబిందో కాలేజీలో సైకాలజీలో గ్రాడ్యుయేట్ డిగ్రీని అందుకుంది. ఆ తర్వాత పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో యాక్టింగ్ కోర్సు పూర్తి చేసింది.
త్రిప్తి దిమ్రి కారు కలెక్షన్
త్రిప్తి దిమ్రి గ్యారేజీలో పలు కార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె దగ్గర పోర్స్చే కయెన్నే SUV ఉంది. తెలుపు రంగులో ఉన్న ఆ కారును ఆమె ఆలివ్ గ్రీన్ ర్యాప్ తో కస్టమైజ్ చేయించింది. దాంతో పాటు రెనాల్ట్ డస్టర్‌ని కలిగి ఉంది.
త్రిప్తి దిమ్రి బ్రాండ్ ఎండార్స్ మెంట్లు, నికర ఆస్తుల విలువ
త్రిప్తి దిమ్రి One GOAకి చెందిన HoABL బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియా ద్వారా కూడా ఆమె బాగానే డబ్బు సంపాదిస్తోంది. ఒక్కో పోస్టు లేదంటే రీల్ కు రూ. 60 వేలు నుంచి రూ. 90 వేల వరకు ఛార్జ్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె నికర ఆస్తుల విలువ రూ. 20 కోట్ల నుంచి 30 కోట్లు ఉంటుందని అంచనా. ఆమెకు వరుస అవకాశాలు వస్తున్న నేపథ్యంలో ఈ విలువ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ ముద్దుగుమ్మ రాజ్ కుమార్ రావుతో కలిసి ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’లో నటిస్తోంది. కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్‌లతో కలిసి ‘భూల్ భూలయ్యా 3’లో కనిపించనుంది. అటు విక్కీ కౌశల్, అమ్మీ విర్క్ తో కలిసి ‘బ్యాడ్ న్యూజ్’లో చేస్తోంది. సిద్ధాంత్ చతుర్వేదితో ‘ధడక్ 2’ ప్రాజెక్టులో నటిస్తోంది.
Read Also: సోనాక్షి పెళ్లిపై శత్రుఘ్న సిన్హా మనస్తాపం- పెళ్లికొడుకు తండ్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!