Hyderabad Metro: 13 నిమిషాల్లోనే హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు, గ్రీన్ ఛానల్ నిలిపిన ఓ ప్రాణం
Heart transportation13 Kilometers Covered in 13 Minutes | హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించి అవసరమైన పేషెంట్‌కు డాక్టర్లు సర్జరీ చేసి గుండెను అమర్చారు.

Hyderabad Metro Green corridor | హైదరాబాద్: నగరంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు ఓ గుండెను సాధ్యమైనంత వేగంగా తరలించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. డాక్టర్లు హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించి అవసరమైన పేషెంట్ కు సకాలంలో ఆపరేషన్ చేశారు. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్డీకపూల్ గ్లోబల్ ఆసుపత్రి (Global Hospital)కి మెట్రో రైల్లో శుక్రవారం రాత్రి 9.30 గంటలకు డాక్టర్ల టీమ్ గుండెను తరలించింది. ఇందుకోసం హైదరాబాద్ మెట్రో అధికారులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి పెద్ద మనసు చాటుకున్నారు.
గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్‌లో అది కూడా 13 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 13 నిమిషాల్లో గుండెను తరలించారు. సకాలంలో గ్లోబల్ హాస్పిటల్‌కు గుండె చేరడంతో అవసరమైన పేషెంట్‌కు డాక్టర్లు సర్జరీ చేసి గుండెను అమర్చారు. గతంలోనూ ఇలా గుండె, కిడ్నీ లాంటి ముఖ్యమైన అవయవాలు రోడ్డు మార్గం ద్వారా, మెట్రో రైలు ద్వారా తరలించడంతో ఎందరో ప్రాణాలు నిలిచాయి.
#WATCH | Hyderabad, Telangana: Hyderabad Metro facilitated a green corridor for heart transportation on 17th January 2025 at 9:30 PM. The corridor facilitated the swift and seamless transportation of a donor heart from LB Nagar’s Kamineni Hospitals to Gleneagles Global Hospital,… pic.twitter.com/wFWMZ0A3ZT
— ANI (@ANI) January 17, 2025
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

