IPL, 2022 | Match 70 | Wankhede Stadium, Mumbai - 22 May, 07:30 pm IST
(Match Yet To Begin)
SRH
SRH
VS
PBKS
PBKS
IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR

Munawar Faruqui: అమిత్ షా మీద జోక్ వేశాడని... ఎక్కడా ఏ జోక్ వేయడానికి వీలు లేకుండా!

'విద్వేషమే విజయం సాధించింది. కళాకారుడు ఓడిపోయాడు' అని హిందీ స్టాండప్ కమెడియన్ మునవార్ ఫరూఖీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసలు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే... 

FOLLOW US: 

"విద్వేషమే విజయం సాధించింది. కళాకారుడు ఓడిపోయాడు. ఇక, నేను అలసిపోయా. గుడ్ బై" అని కమెడియన్ మునావర్ ఫరూఖీ ఆదివారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. బెంగళూరులో ఆదివారం అతను ఓ షో చేయాల్సి ఉంది. చివరి నిమిషంలో అది క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత అతను ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే... దీని వెనుక ఓ కథ ఉంది. ఒక్క రోజులో జరిగినది కాదు!

హిందూ దేవుళ్లను అవమానించాడని, హిందువుల మనోభావాలను గాయపరిచాడని ఈ ఏడాది జనవరి 1న మునావర్ ఫరూఖీని ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ నెల రోజులు అతను జైల్లో ఉన్నారు. ఇండోర్ సిటీలో ఓ కేఫ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీద కూడా మునావర్ ఫరూఖీ నోరు పారేసుకున్నాడని  బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ఒకరు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అతణ్ణి అరెస్ట్ చేశారు. అయితే, ఫరూఖీ ఇండోర్ షోలో తాను ఆ జోక్ వేయలేదని పేర్కొన్నారు. గతంలో చేసిన షోస్ లో అతను ఆ జోక్స్ వేసినట్టు టాక్. దాంతో అతడి మీద శ్రీరామ్ సేన, హిందూ జన జాగృతి సమితి ఆగ్రహంగా వ్యక్తం చేశాయి. హిందూ దేవుళ్ల మీద, అమిత్ షా మీద జోక్స్ వేసిన కారణంగా మునావర్ ఫరూఖీ షోస్ మీద చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దాంతో గత రెండు నెలల్లో అతడు చేయాల్సిన పన్నెండు షోస్ క్యాన్సిల్ అయ్యాయి. శ్రీరామ్ సేన, హిందూ జన జాగృతి సమితి  ఫిర్యాదులు చేయడంతో తాజా బెంగళూరు షో క్యాన్సిల్ అయ్యింది.

బెంగళూరు షో క్యాన్సిల్ అయిన తర్వాత "ఈ రోజు బెంగళూరు షో కూడా క్యాన్సిల్ అయ్యింది. బెదిరింపులు రావడంతో ఆరు వందల టికెట్స్ అమ్మినా షో క్యాన్సిల్ చేశారు. దివంగత పునీత్ రాజ్ కుమార్ ఆర్గనైజేషన్‌కు ఓ నెల క్రితం మేం కాల్ చేశాం. బెంగళూరు షో ద్వారా వచ్చిన డబ్బును ఛారిటీకి ఇవ్వాలని అనుకున్నాం. ఆర్గనైజేషన్ వాళ్లు కోరడంతో మేం ఛారిటీ అని చెప్పి టికెట్స్ అమ్మలేదు" అని ఫరూఖీ తెలిపారు. "నేను వేయని జోక్ కు జైల్లో పెట్టడం నుంచి నా షోస్ క్యాన్సిల్ చేయడం వరకూ... ఇది అన్యాయం. మా షోకు సెన్సార్ సర్టిఫికెట్ ఉంది. షోలో సమస్య ఏమీ లేదు. మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ఈ షోకు ప్రజల నుంచి ఆదరణ లభించింది. అయితే...  ప్రేక్షకులకు, థియేటర్లకు బెదిరింపులు రావడంతో లాస్ట్ రెండు నెలల్లో 12 షోస్ క్యాన్సిల్ చేశాం. నా దృష్టిలో... ఇది ముగింపు. నా పేరు మునావర్ ఫరూఖీ, ఇది నా రాత. గుడ్ బై" అని మునావర్ ఫరూఖీ పేర్కొన్నారు.

View this post on Instagram
 
A post shared by Munawar Faruqui (@munawar.faruqui)

Also Read: పుష్ప సెట్‌కు వ‌చ్చిన స‌మంత‌... అల్లు అర్జున్‌తో స్పెష‌ల్ సాంగ్ షురూ!
Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... గెస్ట్ కూడా! ఎప్పుడు? ఎక్కడ? అంటే...
Also Read: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?
Also Read: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక...  సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!
Also Read: బాలకృష్ణ అభిమానులకు బంపర్ న్యూస్... బెనిఫిట్ షోస్‌కు అంతా రెడీ!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 29 Nov 2021 01:30 PM (IST) Tags: Amit Shah Munawar Faruqui Comedy Shows Hurting Hindu sentiments

సంబంధిత కథనాలు

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?

Balakrishna: బాలయ్య కథను లీక్ చేసిన దర్శకుడు - ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే

Balakrishna: బాలయ్య కథను లీక్ చేసిన దర్శకుడు - ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే

Dhanush: తన తల్లిదండ్రులుగా చెప్పుకుంటున్న వృద్ధ దంపతులకు నోటీసులు పంపిన ధనుష్

Dhanush: తన తల్లిదండ్రులుగా చెప్పుకుంటున్న వృద్ధ దంపతులకు నోటీసులు పంపిన ధనుష్

Keerthi Suresh: మహేష్ బాబుని బూతు తిట్టడానికి కీర్తి పడ్డ కష్టాలు!

Keerthi Suresh: మహేష్ బాబుని బూతు తిట్టడానికి కీర్తి పడ్డ కష్టాలు!

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

PM Modi Japan visit: జపాన్‌లో మోదీ సుడిగాలి పర్యటన- 40 గంటల్లో 23 సమావేశాలు

PM Modi Japan visit: జపాన్‌లో మోదీ సుడిగాలి పర్యటన- 40 గంటల్లో 23 సమావేశాలు

Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు ఘోర ప్రమాదాలు - నేడు 11 మంది అక్కడికక్కడే దుర్మరణం

Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు ఘోర ప్రమాదాలు - నేడు 11 మంది అక్కడికక్కడే దుర్మరణం

CM KCR: నేడు చండీగఢ్‌కు సీఎం కేసీఆర్, వెంట ఢిల్లీ సీఎం కూడా - పర్యటన పూర్తి వివరాలివీ

CM KCR: నేడు చండీగఢ్‌కు సీఎం కేసీఆర్, వెంట ఢిల్లీ సీఎం కూడా - పర్యటన పూర్తి వివరాలివీ

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం