RRR: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... గెస్ట్ కూడా! ఎప్పుడు? ఎక్కడ? అంటే...
డిసెంబర్ తొలి వారంలో 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ విడుదల చేయనున్నట్టు 'జనని...' సాంగ్ విడుదల చేసినప్పుడు రాజమౌళి వెల్లడించారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. గెస్ట్‌ను కూడా! పూర్తి వివరాలు ఇవిగో!
యుంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' ట్రైలర్ విడుదల తేదీ ఖరారు అయ్యింది. డిసెంబర్ తొలి వారంలో ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు 'జనని...' సాంగ్ విడుదల చేసినప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి వెల్లడించారు. ఇప్పుడు ట్రైలర్ విడుదల తేదీ, వెన్యూను ఫిక్స్ చేశారు.
డిసెంబర్ 3న 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ విడుదల కానుంది. థియేటర్లలో విడుదల అయ్యే కొత్త సినిమాల మధ్య ట్రైలర్ ప్రదర్శించనున్నారు. ముంబైలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా చేయనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఆ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన రావడం 99 శాతం ఖాయమే. ఇటీవల సల్మాన్‌ను రాజమౌళి కలవడం వెనుక కారణం అదే. ఎన్టీఆర్, రామ్ చరణ్... ఇద్దరూ సల్మాన్‌కు ఇష్టమే. 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు సల్మాన్ రావడానికి రాజమౌళితో పాటు వాళ్లూ ఓ కారణం.
'ఆర్ఆర్ఆర్'లో 'జనని...' పాటను అందరి కంటే ముందుగా తెలుగు మీడియాకు రాజమౌళి చూపించారు. ఆ తర్వాత రోజు అన్ని భాషల్లో సాంగ్ విడుదల చేశారు. అదే విధంగా ట్రైలర్‌ను అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని, అలీసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
DECEMBER 3rd… RRR Trailer Day… #RRRTrailer #RRRTraileronDec3rd #RRRMovie pic.twitter.com/qAqk7Pi0Ra
— rajamouli ss (@ssrajamouli) November 29, 2021
Brace yourself for a massive blast... #RRRMovie trailer out on December 3rd.#RRRTrailerOnDec3rd #RRRTrailer@SSRajamouli @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @mmkeeravaani @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/1gOOhWTAPc
— Jr NTR (@tarak9999) November 29, 2021
Get ready to witness the magnificence of #RRRMovie.
— Ram Charan (@AlwaysRamCharan) November 29, 2021
Trailer out on December 3rd…#RRRTrailerOnDec3rd #RRRTrailer@SSRajamouli @tarak9999 @ajaydevgn @aliaa08 @mmkeeravaani @oliviamorris891 @RRRMovie @DVVMovies @LahariMusic @TSeries pic.twitter.com/a1SJGK5rIo
Also Read: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?
Also Read: అవకాశాలు రాక... నృత్య ప్రదర్శనలకు డబ్బుల్లేక... సినిమాల్లోకి! ఇదీ శివ శంకర్ మాస్టర్ జర్నీ!
Also Read: సైలెంట్‌గా ఫ్యాన్స్‌కు క్లాస్ పీకుతున్న సల్మాన్ ఖాన్... మిగతా స్టార్స్ ఏం చేస్తారో?
Also Read: బాల్ తగిలితే... ఆ దెబ్బకు పాతిక కుట్లు పడ్డాయి. నార్మల్ అవ్వడానికి మూడు నెలలు పట్టింది!
Also Read: ఆపవేరా? ఆదుకోరా? లోకమే ఏకం చేసి శిక్ష వేస్తావా? - దేవుడికి ప్రశ్నలు సంధించిన పాట
Also Read: బాలకృష్ణ అభిమానులకు బంపర్ న్యూస్... బెనిఫిట్ షోస్‌కు అంతా రెడీ!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి