Salamn Khan: సైలెంట్‌గా ఫ్యాన్స్‌కు క్లాస్ పీకుతున్న సల్మాన్ ఖాన్... మిగతా స్టార్స్ ఏం చేస్తారో?
అభిమానులకు అటువంటి పనులు చేయవద్దని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్ట్రయిట్‌గానే చెబుతున్నారు. ఫ్యాన్స్‌కు సైలెంట్‌గానే క్లాస్ పీకుతున్నారు. మరి, ఇక్కడ స్టార్స్ ఏం చేస్తారో?
స్టార్ హీరో సినిమా విడుదల అయితే... థియేటర్ల దగ్గర హీరోల కటౌట్‌లకు పాలాభిషేకాలు, కొబ్బరికాయలు కొట్టడాలు, క్రాకర్స్ కాల్చడాలు కామన్. ఫ్యాన్స్ చేసే ఇటువంటి చర్యలు కొంత మంది హీరోలకు ఆనందాన్ని ఇస్తాయి. కొందరు హీరోలకు నచ్చవు. అయితే... అభిమానులకు నేరుగా చెప్పలేక పరోక్షంగా చెబుతూ ఉంటారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మాత్రం స్ట్రయిట్‌గానే ఫ్యాన్స్‌కు చెబుతున్నారు. అటువంటి పనులు చేయవద్దని సైలెంట్‌గా క్లాస్ పీకారు.
సల్మాన్ ఖాన్, అతని బావ ఆయుష్ శర్మ నటించిన 'అంతిమ్: ద ఫైనల్ ట్రూత్' సినిమా ఈ నెల 26న విడుదల అయ్యింది. ఓ థియేటర్ దగ్గర సల్మాన్ కటౌట్‌కు అభిమానులు పాలాభిషేకం చేశారు. "కొంత మందికి నీళ్లు కూడా సరిగా దొరకవు. మీరు పాలను ఈ విధంగా వృథా చేస్తున్నారు. అభిమానులకు నా రిక్వెస్ట్ ఏంటంటే... మీరు పాలను ఇవ్వాలని అనుకుంటే, పాలు తాగాలని అనుకున్నా తాగలేని పేద పిల్లలకు ఇవ్వండి" అని సల్మాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కొంతమంది థియేటర్‌లో క్రాకర్స్ కాల్చిన వీడియో పోస్ట్ చేసి ఆ విధంగా చేయవద్దని సల్మాన్ రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: అభిమానులూ... అలా చెయ్యొద్దు! - సల్మాన్ రిక్వెస్ట్
టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో కూడా స్టార్ హీరోల కటౌట్స్‌కు ఫ్యాన్స్ పాలాభిషేకాలు చేసే కల్చర్ ఉంది. మరి, ఇక్కడి స్టార్ హీరోలు ఏం చేస్తారో? అభిమానులకు ఏం చెబుతారో? చూడాలి. కొవిడ్ తర్వాత చాలా మంది ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలాభిషేకాలతో డబ్బులు వృథా చేసే బదులు అటువంటి పేదలకు సహాయం చేస్తే బావుంటుందనేది కొంత మంది నెటిజన్స్ అభిప్రాయం. సల్మాన్ అభిమానులకు రిక్వెస్ట్ చేయడాన్ని పలువురు అభినందిస్తున్నారు.
View this post on Instagram
Also Read: బాల్ తగిలితే... ఆ దెబ్బకు పాతిక కుట్లు పడ్డాయి. నార్మల్ అవ్వడానికి మూడు నెలలు పట్టింది!
Also Read: ఆపవేరా? ఆదుకోరా? లోకమే ఏకం చేసి శిక్ష వేస్తావా? - దేవుడికి ప్రశ్నలు సంధించిన పాట
Also Read: ప్రభాస్ కొడితే 100మంది పడటం చూశాం! ప్రేమిస్తే ఎంత మంది పడతారో చూద్దాం!
Also Read: అనసూయ అడగాలే కానీ... లిప్ లాక్‌కు కూడా 'హైపర్' ఆది రెడీ!?
Also Read: బాలకృష్ణకు గాయం అవ్వడానికి కారణం ఏంటో చెప్పిన బోయపాటి శ్రీను! 'జై బాలయ్య' సాంగ్ తీసేటప్పుడు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి