Radhe Shyam: ప్రభాస్ కొడితే 100మంది పడటం చూశాం! ప్రేమిస్తే ఎంత మంది పడతారో చూద్దాం!
'రాధే శ్యామ్' సినిమాలో రెండో సాంగ్ టీజర్ సోమవారం విడుదల కానుంది. ప్రభాస్, పూజా హెగ్డే పోస్టర్ పాట మీద ఆసక్తి పెంచేలా ఉంది.
'హృదయం ఒక్కటే... హృదయ స్పందనలు రెండు' (One Heart... Two Heart Beats) అంటున్నారు విక్రమాదిత్య, ప్రేరణ. వాళ్లిద్దరి హృదయ స్పందనలు రెండు అయినా... హృదయం ఒక్కటే అంటున్నారు. మరి, వాళ్ల హృదయం ఏంటనేది త్వరలో తెలుస్తుంది. సోమవారం టీజర్ విడుదల చేస్తున్నారు.
విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్(Prabhas), ప్రేరణగా పూజా హెగ్డే (Pooja Hegde) నటిస్తున్న సినిమా 'రాధే శ్యామ్'(Radhe Shyam). 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు, ఈ సినిమాలోని లవ్ యాంథమ్ టీజర్ సోమవారం విడుదల చేయనున్నట్టు ప్రభాస్ తెలిపారు. ఈ సాంగ్ హిందీ వెర్షన్ టీజర్ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు... తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సాంగ్ టీజర్‌ను రాత్రి ఏడు గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ ఓ పోస్టర్ విడుదల చేశారు. అందులో ఆయన, పూజా హెగ్డే ఉన్నారు. వాళ్లిద్దరి పోస్టర్ పాట మీద ఆసక్తి పెంచేలా ఉంది.
View this post on Instagram
"అన్న (ప్రభాస్) కొడితే వంద మంది పడటం చూశాం, ప్రేమిస్తే ఎంత మంది పడతారో చూద్దాం" అని దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ట్వీట్ చేశారు.
Anna kodithe vanda mandi padatam choosam!!! Premisthe entha mandi padathaaro chudaam #RadheShyam pic.twitter.com/LHFfe095yl
— Radha Krishna Kumar (@director_radhaa) November 28, 2021
'రాధే శ్యామ్' సినిమా నుంచి రీసెంట్‌గా 'ఈ రాతలే' సాంగ్ విడుదలైంది. జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించిన ఈ పాటను మరో సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, హరిణి ఆలపించారు. ఇప్పుడీ లవ్ యాంథమ్‌ను ఎవరు పాడారో సోమవారం తెలుస్తుంది. ఈ సినిమా హిందీ వెర్షన్ సాంగ్స్‌కు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: అనసూయ అడగాలే కానీ... లిప్ లాక్‌కు కూడా 'హైపర్' ఆది రెడీ!?
Also Read: బాలకృష్ణకు గాయం అవ్వడానికి కారణం ఏంటో చెప్పిన బోయపాటి శ్రీను! 'జై బాలయ్య' సాంగ్ తీసేటప్పుడు...
Also Read: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!
Also Read: టాలీవుడ్‌లో విషాదం... ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లకు పితృవియోగం
Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మరణించే వరకూ ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు - రాజమౌళి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి