అన్వేషించండి

Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?

Arjun Issue: సంధ్యా ధియేటర్ తొక్కిసలాట ఘటనలో మూడున్నర గంటల పాటు పోలీసులు అర్జున్ ను ప్రశ్నించారు. కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది.

Allu Arjun: సంధ్యా ధియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. తమదైన శైలిలో కీలక ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా మూడు గంటల పాటు వివిద అంశాలపై ప్రశ్నించారు.  పుష్ప ప్రీమియర్స్ సందర్భంగా డిసెంబర్ 4 రాత్రి ఏం జరిగిందన్న విషయంపైనే పోలీసులు అల్లు అర్జున్ ను సమాధానాలు రాబట్టారు.  చిక్కడల్లి సీఐ రాజు నాయక్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది.  ఏసీపీ, డీసీపీలు కూడా విచారణ బృందంలో ఉన్నారు. అల్లు అర్జున్ చెప్పే  ప్రతి మాటలను రికార్డు చేశారు.  అల్లు అర్జున్ కు ప్రధానంగా మూడు  ప్రశ్నలు సంధించారు.. వాటికి అనుబంధంగా ఇతర విషయాలను కూడా తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది.

పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదని తెలియదా ? 

పోలీసులు సంధ్యా ధియేటర్ కు హీరో, హీరోయిన్ రాకూడదని పక్కాగా సమాచారం ఇచ్చినప్పుడు...సంధ్యా థియేటర్ నిర్వాహకులు అదే సమాచారాన్ని చిత్రబృందానికి అందించినప్పుడు...పర్మిషన్ లేదనే విషయం తెలిసి కూడా ఎందుకు థియేటర్ కు వచ్చారు అనే సూటి ప్రశ్నను పోలీసులు సంధించారు. పైగా రోడ్ షో ఎందుకు చేశారనే ప్రశ్న ఎదురైంది. దీనికి అల్లు అర్జున్ తనకు అనుమతి లేదన్న విషయం తెలియదని చెప్పినట్లుగా తెలుస్తోంది. పోలీసులే రూట్ క్లియర్ చేయడంతో అనుమతి ఉందనుకున్నానని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. 

రేవతి చనిపోయిందని తర్వాత రోజు తెలిసింది !

రేవతి చనిపోయిందన్న విషయం పై రెండో ప్రశ్నను పోలీసులు అడిగినట్లుగా తెలుస్ోందది. మీకు రేవతి తొక్కిసలాటలో మృతి చెందిందన్న విషయం తెలుసా అని అడిగితే అల్లు అర్జున్ తెలుసు..కానీ తర్వాతి రోజు నాకు తెలిసింది అని చెప్పినట్లు సమాచారం తెలుస్తోంది.

ధియేటర్ లో పోలీసులు కలవలేదన్న మాటకు కట్టుబడిన అర్జున్

 రేవతి చనిపోయిందని...ఆమె బాబు చావు బతుకుల్లో ఉన్నాడని..మీరు వెంటనే థియేటర్ నుంచి వెళ్లిపోవాలని ఏసీపీ, డీసీపీ మీ వద్దకు చెప్పారా అనే ప్రశ్న అల్లు అర్జున్ ను అడిగారు పోలీసులు. దీనికి సమాధానంగా తన వద్దకు ఏ పోలీసులు రాలేదని...తనకేం చెప్పలేదని...మీడియాకు పోలీసులు తప్పుడు  సమాచారం ఇచ్చారని తాను ప్రెస్ మీట్ లో చెప్పిన విషయానికే అర్జున్ కట్టుబడి ఉన్నట్లుగా చెబుతున్నారు. 

అర్జున్ ను ఓ వైపు ప్రశ్నిస్తున్న సమయంలో ఆయన బౌన్సర్ల టీం లీడర్ అయిన ఆంటోనిని పోలీసులు అరెస్టు చేశారు. సంధ్యా ధియేటర్ లో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. 

అర్జున్ తరపు లాయర్ల బృందం కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అయితే ఒక్క లాయర్ ను మాత్రం అర్జున్ ను ప్రశ్నిస్తున్న రూంకు దూరంగా ఉండి చూసేందుకు అనుమతి ఇచ్చారు. కేవలం అబ్జర్వేషన్ కు మాత్రమే అనుమతి ఇచ్చారు. పోలీసులు అడిగిన ప్రశ్నలు..దానికి అర్జున్ ఇచ్చిన సమాధానాలపై ఆయన లీగల్ టీం రివ్యూ చేసి పోలీసులు ఏమైనా కొత్త అభియోగాలు మోపేందుకు అవకాశం ఇచ్చమా అన్న అంశంపై పరిశీలన చేసి తదుపరి వ్యూహం ఖరారు చేసుకునే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు దిగువకోర్టులో బెయిల్ కోసం అల్లు అర్జున్ పిటిషన్ వేసుకోవాల్సి ఉంది. వారం అయిపోయినా ఇకా పిటిషన్ దాఖలు చేయలేదు. 

టాప్ హెడ్ లైన్స్

Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Ravi Teja Thulabharam : ఇరుముడి తర్వాత రవితేజ 'తులాభారం' - ఈ జానర్ ఎవరూ ఊహించలేరు... మోత మోగిపోద్దంతే!
ఇరుముడి తర్వాత రవితేజ 'తులాభారం' - ఈ జానర్ ఎవరూ ఊహించలేరు... మోత మోగిపోద్దంతే!
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
This Week Theatrical Releases : ఈ దసరాకు మస్త్ ఎంటర్టైన్మెంట్ - ఒకే రోజు థియేటర్లలో మూడు సినిమాలు... మరి మీ ఛాయిస్ ఏంటి?
ఈ దసరాకు మస్త్ ఎంటర్టైన్మెంట్ - ఒకే రోజు థియేటర్లలో మూడు సినిమాలు... మరి మీ ఛాయిస్ ఏంటి?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget