By: ABP Desam | Updated at : 27 Nov 2021 09:55 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
అఖండ రెండో ట్రైలర్ విడుదల అయింది.
అఖండ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సినిమా రెండో ట్రైలర్‌ను విడుదల చేశారు. పూర్తిగా మాస్ సన్నివేశాలతో ఈ ట్రైలర్‌ను నింపేశారు. బోయపాటి మాత్రమే తీయగలిగిన మాస్ యాక్షన్ సన్నివేశాలను ఈ ట్రైలర్‌లో చూడవచ్చు. ‘మేం ఎక్కడికైనా వస్తే తల దించుకోం.. తల తెంచుకుని వెళ్లిపోతాం..’, ‘దేవుడిని కరుణించమని అడుగు.. కనిపించమని కాదు..’ వంటి మాస్ డైలాగులు బాలయ్య నోటి వెంట వినవచ్చు.
ట్రైలర్‌లో బాలకృష్ణ చక్రాన్ని లాక్కువచ్చే సీన్ అయితే హైలెట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరుగుతోంది.
ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. డిసెంబర్ 2వ తేదీ నుంచి పెద్ద సినిమాలు వరుసగా విడుదల అవుతున్నాయన్నారు. అఖండ సినిమాని మొదటి రోజు థియేటర్లోనే చూస్తానని తెలిపారు. ప్రగ్నా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్, జగపతిబాబు కూడా నటించారు. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం అందించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా విడుదలై విజయం సాధిస్తే.. తర్వాత వచ్చే పెద్ద సినిమాలు భయం లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది.
కరోనావైరస్ సెకండ్ వేవ్ తర్వాత విడుదల అవుతున్న మొదటి పెద్ద సినిమా కావడంతో దీనికోసం అభిమానులు, ప్రేక్షకులతో పాటు సినిమా పరిశ్రమ కూడా ఎదురుచూస్తుంది. అఖండ్ సెన్సార్ కూడా ఇప్పటికే పూర్తయింది. యూ/ఏ సర్టిఫికెట్‌ను ఈ సినిమా పొందింది. సినిమా రన్ టైం 2 గంటల 47 నిమిషాలుగా ఉండనుందని తెలుస్తోంది. రెండో ట్రైలర్‌ను కింద చూడవచ్చు.
Also Read:బిగ్ బాస్ ట్విస్ట్.. ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్
Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మరణించే వరకూ ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు - రాజమౌళి
Also Read: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?
Aishwarya Rai: ఓ మై గాడ్ - ఐశ్వర్యరాయ్ కూతురి స్కూల్ ఫీజ్ తెలిస్తే షాకే, బచ్చన్ ఫ్యామిలీకి అది జుజుబీ!
మామా అల్లుళ్ళ రివేంజ్ డ్రామా - ట్రిపుల్ రోల్స్‌లో అదరగొట్టిన సుధీర్ బాబు, 'మామా మశ్చీంద్ర' ట్రైలర్ చూశారా?
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్ సింగ్'లో విలన్‌గా కోలీవుడ్ యాక్టర్?
Ravi Teja Eagle Release Date : సంక్రాంతి బరిలో రవితేజ 'ఈగల్' - పండక్కి మొండోడు వస్తున్నాడు
Tiger Nageswararao: టైగర్ నాగేశ్వరరావు స్టువర్టుపురం సెట్ చూశారా?
Minister RK Roja: 'తప్పు చేసిన తండ్రి కోసం రాష్ట్రపతిని కలిశారు, రాష్ట్రం కోసం ఎప్పుడైనా కలిశారా?'
Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'
Supreme Court: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో మరో బెంచ్‌కు
Salman Khan Tiger 3 : 'టైగర్ 3'తో సల్మాన్ 1000 కోట్లు కొడతాడా? - ఇండియాలో వెయ్యి కోట్ల హీరోలు ఎవరో తెలుసా?
/body>