అన్వేషించండి
Advertisement
Suresh Babu: కావాలనే మమ్మల్ని పక్కన పెడుతున్నారా..? టికెట్ రేట్ ఇష్యూపై సురేష్ బాబు ఆవేదన..
టికెట్ రేట్ ఇష్యూకి సంబంధించి ఏపీ ప్రభుత్వ తీరుపై ఇండస్ట్రీ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా సురేష్ బాబు కూడా ఈ ఇష్యూపై మాట్లాడారు.
కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లకు సంబంధించిన ఇష్యూ నడుస్తూనే ఉంది. హైదరాబాద్ నుంచి ఇండస్ట్రీ పెద్దలు ఏపీకి వెళ్లి అక్కడ మంత్రులను రిక్వెస్ట్ చేసుకోవడం, వాళ్లేమో సానుకూలంగా స్పందిస్తూనే ఇండస్ట్రీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేశారు. ఫైనల్ గా ఇప్పుడు టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసేసుకుంది. ప్రభుత్వం డిసైడ్ చేసే రేట్లకే టికెట్లను అమ్మాలని.. అది కూడా ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థలోనే టికెట్స్ బుక్ చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.
ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై ఇండస్ట్రీ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంలో పునరాలోచన చేయమంటూ రిక్వెస్ట్ చేసుకున్నారు. తాజాగా సురేష్ బాబు కూడా ఈ ఇష్యూపై మాట్లాడారు. ఒక వస్తువుని తయారు చేసేవాడికే దాని రేటు ఫిక్స్ చేసే హక్కు ఉంటుందని.. మార్కెట్ లో ఒక్కో వస్తువుకి ఒక్కో రేటు ఉంటుందని.. అన్ని వస్తువులను ఒకే రేటుకి అమ్మాలంటే ఎలా..? అలానే సినిమా కూడా అని అని అన్నారు. చిన్న సినిమాల బడ్జెట్ వేరు.. పెద్ద సినిమాల బడ్జెట్ వేరని.. రెండింటికీ ఒకటే రేట్ ఫిక్స్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు.
ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లకు టికెట్స్ ను అమ్మి థియేటర్లను నడిపించడం కష్టమని.. కరెంట్ బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి వస్తుందని.. ఇదే కొనసాగితే థియేటర్లను మూసుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా దెబ్బ తిన్న థియేటర్ వ్యవస్థను ఆదుకోవడానికి కరెంట్ బిల్ మాఫీ చేస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఆ పని చేయలేదని విమర్శించారు సురేష్ బాబు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తున్నాయని అన్నారు. మేం వాళ్లతో సరిగ్గా కమ్యూనికేట్ అవ్వడం లేదంటే.. వారే మమ్మల్ని కావాలని పక్కన పెడుతున్నారా..? అనే విషయం అర్ధం కావడం లేదని సురేష్ బాబు అన్నారు.
Also Read:సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్.. హౌస్ లో హాట్ డిస్కషన్..
Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మరణించే వరకూ ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు - రాజమౌళి
Also Read: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?
Also Read: త్రివిక్రమ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఐపీఎల్
ఓటీటీ-వెబ్‌సిరీస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement