News
News
వీడియోలు ఆటలు
X

Bigg Boss 5 Telugu: సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్.. హౌస్ లో హాట్ డిస్కషన్.. 

సన్నీ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉందని చాలా మంది హౌస్ మేట్స్ తనకు దగ్గరవడానికి ట్రై చేస్తున్నారని నిన్నటి ఎపిసోడ్ లో మానస్ అన్నాడు.  

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ సీజన్ 5లో ఇటీవల జరిగిన ఫైర్ ఇంజన్ టాస్క్ లో కంటెస్టెంట్ సన్నీ 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' గెలుచుకున్నాడు. నిజానికి దానికి కారణం కాజల్ అనే చెప్పాలి. మానస్ ఎంత చెప్పినా.. వినకుండా సన్నీని గెలిపించాలని భీష్మించుకుని ఫైర్ ఇంజన్ లో కూర్చుంది. ఫైనల్ గా సన్నీకే ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కింది. దీనివలన కాజల్ చాలా మాటలు పడింది. ఈ వారం ఆమెని నామినేట్ చేయడానికి రీజన్ కూడా అదే చెప్పాలి. అయినప్పటికీ కాజల్ కి ఎలాంటి రిగ్రెట్స్ లేవు. తన స్నేహితుడిని గెలిపించుకోవాలనుకుంది.. అదే చేసింది. 

హౌస్ లోకి వచ్చిన సన్నీ మదర్ కళావతితో ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను పంపించాడు బిగ్ బాస్. ఇక సన్నీ ఈ పాస్ ను తనకోసమే వాడుకుంటాడా..? లేక ఇతర హౌస్ మేట్స్ కోసం వాడతాడా..? అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి ఎపిసోడ్ లో కూడా మానస్-కాజల్ ఇదే డిస్కస్ చేసుకున్నారు. సన్నీ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉందని చాలా మంది హౌస్ మేట్స్ దగ్గరవడానికి ట్రై చేస్తున్నారని మానస్ అన్నాడు. ఎప్పుడూ లేనిది రవి కూడా సన్నీతో ప్రేమగా మాట్లాడుతున్నాడని కామెంట్ చేశాడు. 

ఇక ప్రియాంక అయితే కేవలం ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసమే సన్నీతో సన్నిహితంగా ఉంటుందని తన అభిప్రాయాన్ని చెప్పాడు మానస్. సన్నీ అంటే ఆమెకి అసలు పడదని.. బయటకు మాత్రమే 'అన్నయ్య అన్నయ్య' అని అంటుందని మానస్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అయితే ప్రియాంక స్ట్రాటజీ ఈ వారం వర్కవుట్ అయ్యేలానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రియాంక కోసం సన్నీ తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను వాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఈ వారం మానస్ తప్పించి మిగిలిన హౌస్ మేట్స్ అందరూ నామినేషన్ లో ఉన్నారు. వీరిలో సన్నీ, శ్రీరామచంద్ర, రవి, షణ్ముఖ్, కాజల్ సేఫ్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సిరి, ప్రియాంకలకు మాత్రం తక్కువ ఓట్లు పడినట్లు సమాచారం. కాబట్టి ఎలిమినేషన్ ప్రక్రియ సమయంలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాపిక్ కచ్చితంగా వస్తుంది. సన్నీ ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తాడు. గేమ్ లో కూడా తన గేమ్ తను ఆడుకుంటూనే ఫ్రెండ్స్ కి కూడా హెల్ప్ చేస్తుంటాడు. 

బేసిక్ గా తన నేచర్ అలాంటిది. కొన్ని రోజులుగా ప్రియాంక.. సన్నీకి బాగా క్లోజ్ అవుతుంది. ప్రియాంక నిజంగానే నామినేషన్ డేంజర్ లో ఉంటే గనుక కచ్చితంగా సన్నీ హెల్ప్ అడగడం ఖాయం. దానికి సన్నీ కూడా నో చెప్పే అవకాశాలు లేవు. కాబట్టి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను ప్రియాంక కోసమే వాడతాడని అంచనా వేస్తున్నారు నెటిజన్లు. అలా జరిగితే గనుక సిరి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం ఖాయం. ఆదివారం నాటి ఎపిసోడ్ లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.   

Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మ‌ర‌ణించే వ‌ర‌కూ ఆ విష‌యం ఎవ్వ‌రికీ చెప్ప‌లేదు - రాజ‌మౌళి

Also Read: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?

Also Read: త్రివిక్ర‌మ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు

Also Read: కంగనా రనౌత్ పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు... వివాదాస్పద వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని ఆర్డర్

Also Read: హీరోయిన్‌కు ఎదురైన సంఘటనల వల్లే 'అఖండ' ఎంట్రీ... బాలకృష్ణ సెట్‌లోకి నడిచి వస్తుంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 27 Nov 2021 03:25 PM (IST) Tags: priyanka Bigg Boss 5 Telugu Bigg Boss 5 manas Sunny Eviction free pass

సంబంధిత కథనాలు

Karate Kalyani: కరాటే కళ్యాణి 'మా' మెంబర్షిప్ క్యాన్సిల్ - కావాలనే చేశారంటూ నటి ఆగ్రహం

Karate Kalyani: కరాటే కళ్యాణి 'మా' మెంబర్షిప్ క్యాన్సిల్ - కావాలనే చేశారంటూ నటి ఆగ్రహం

Shanmukh Jaswanth New Web Series : 'శివ'గా షణ్ముఖ్ జస్వంత్ - కొత్త సిరీస్ 'స్టూడెంట్' షురూ, లుక్ చూశారా?

Shanmukh Jaswanth New Web Series : 'శివ'గా షణ్ముఖ్ జస్వంత్ - కొత్త సిరీస్ 'స్టూడెంట్' షురూ, లుక్ చూశారా?

ఛీ, యాక్ - నమిలేసిన చూయింగ్ గమ్స్‌తో డ్రెస్, ఫ్యాషన్ ఉసురు తీస్తున్న ఉర్ఫీ!

ఛీ, యాక్ - నమిలేసిన చూయింగ్ గమ్స్‌తో డ్రెస్, ఫ్యాషన్ ఉసురు తీస్తున్న ఉర్ఫీ!

Uorfi Javed: రెస్టారెంట్ లోకి అనుమతించని సిబ్బంది, నేనెవరో తెలుసా అంటూ ఉర్ఫీ జావేద్ రచ్చ

Uorfi Javed: రెస్టారెంట్ లోకి అనుమతించని సిబ్బంది,  నేనెవరో తెలుసా అంటూ ఉర్ఫీ జావేద్ రచ్చ

రణ్‌బీర్ ‘గో టు హెల్’ - ‘బ్యాడ్ టేస్ట్’ కామెంట్స్‌పై ఉర్ఫీ ఫైర్

రణ్‌బీర్ ‘గో టు హెల్’ - ‘బ్యాడ్ టేస్ట్’ కామెంట్స్‌పై ఉర్ఫీ ఫైర్

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !