Pragya Jaiswal: హీరోయిన్‌కు ఎదురైన సంఘటనల వల్లే 'అఖండ' ఎంట్రీ... బాలకృష్ణ సెట్‌లోకి నడిచి వస్తుంటే?
నందమూరి బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటించిన సినిమా 'అఖండ'. డిసెంబర్ 2న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రగ్యా జైస్వాల్ మీడియాతో ముచ్చటించారు.
![Pragya Jaiswal: హీరోయిన్‌కు ఎదురైన సంఘటనల వల్లే 'అఖండ' ఎంట్రీ... బాలకృష్ణ సెట్‌లోకి నడిచి వస్తుంటే? Pragya Jaiswal reveals the reason behind Balakrishna's Akhanda role entry in the movie Pragya Jaiswal: హీరోయిన్‌కు ఎదురైన సంఘటనల వల్లే 'అఖండ' ఎంట్రీ... బాలకృష్ణ సెట్‌లోకి నడిచి వస్తుంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/26/701abe12afedb9a126533cc1e4d22500_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
"బాలకృష్ణ గారు అలా నడిచి వస్తుంటే... సెట్ అంతా సైలెంట్ అవుతుంది. ఆయన అంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు. క్రమశిక్షణలో ఆయన గ్రేట్. టైమ్ మేనేజ్‌మెంట్‌లో కూడా! ఆయన నుంచి నేనెంతో నేర్చుకున్నాను" అని హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అన్నారు. నట సింహం నందమూరి బాలకృష్ణకు జోడీగా ఆమె నటించిన సినిమా 'అఖండ'. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రగ్యా జైస్వాల్ మీడియాతో ముచ్చటించారు.
బాలకృష్ణ అంత పాజిటివ్ పర్సన్‌ను నేను ఇంత వరకూ చూడలేదని ప్రగ్యా జైస్వాల్ చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ "బాలకృష్ణగారు పెద్ద హీరో. గతంలో ఆయన్ను రెండు మూడుసార్లు కలిశా. కానీ, ఎప్పుడూ కలిసి నటించలేదు. ఆయనతో ఇదే నా తొలి సినిమా. అందువల్ల, ఎంతో నెర్వస్‌గా ఫీలయ్యా. కానీ, కలిసిన ఐదు నిమిషాల్లోనే ఎంతో కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చేశారు. ఆయన ఉదయాన్నే మూడు గంటలకు నిద్ర లేస్తారు. ఆరు గంటలకు సెట్‌కు వస్తారు. రోజంతా షూటింగ్ చేస్తారు. అలసట అనేది కనిపించదు. ఆయన్ను 'మీరు మనిషేనా?' అని అడిగేశా. బాలకృష్ణగారు అంత పవర్ ఫుల్ వ్యక్తి కావడంతోనే... బోయపాటి 'అఖండ' లాంటి క్యారెక్టర్ రాశారేమో?!" అని తెలిపారు. అఖండ లాంటి కథ, అటువంటి క్యారెక్టర్ తాను ఇంతవరకూ చూడలేదని ప్రగ్యా జైస్వాల్ చెప్పారు. ఇతర భాషల్లోనూ అటువంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్స్ రాలేదని, బాలకృష్ణగారు డిఫరెంట్‌గా కనిపిస్తారని ఆమె తెలిపారు.
Also Read: బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ రోల్ అదే... ప్రిపేర్ అయ్యే టైమ్ కూడా లేదట!
'అఖండ'లో ప్రగ్యా జైస్వాల్ ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తన పాత్ర పేరు శ్రావణ్య అని చెప్పారు. ఇంతకు ముందు కనిపించిన ప్రగ్యా వద్దని బోయపాటిగారు చెప్పడంతో పాత్ర కోసం చాలా కష్టపడ్డానని తెలిపారు. ప్రగ్యా జైస్వాన్ మాట్లాడుతూ "నాకు బోయపాటిగారి మీద చాలా నమ్మకం ఉంది. ఆయక ఒక క్యారెక్టర్ కోసం ఒకర్ని అనుకున్నారంటే... కచ్చితంగా పర్‌ఫెక్ట్ చాయిస్‌లా ఉంటుంది. ఎంతో ఆలోచించి గానీ ఆర్టిస్ట్‌ను సెలెక్ట్ చేయరు. ఎలాంటి వారు కావాలనేది ఆయనకు బాగా తెలుసు. అందుకని, నన్ను సంప్రదించగానే మొత్తం కథ వినకుండానే ఓకే చెప్పాను. నా క్యారెక్టర్ చుట్టూ కథ నడుస్తుంది. నా పాత్రకు (హీరోయిన్‌కు) ఎదురైన సంఘటనల వల్లే బాలకృష్ణ గారి రెండో పాత్ర 'అఖండ' ఎంట్రీ ఉంటుంది" అని అన్నారు.
ద్వారక క్రియేషన్స్‌లో తనకు ఇది రెండో సినిమా (ఇంతకు ముందు 'జయ జానకి నాయక' చేశారు) అని, సినిమాలంటే ఎంతో ప్యాషన్ ఉన్న నిర్మాత రవీందర్ రెడ్డితో పని చేయడం ఆనందంగా ఉందని ప్రగ్యా జైస్వాల్ అన్నారు. తమన్ సంగీతం గురించి ఆమె మాట్లాడుతూ "కమర్షియల్ సినిమాల తరహాలో ఇందులో పాటలు ఉండవు. 'అడిగా అడిగా....' అనే మెలోడి పాట ఆల్రెడీ విడుదలైంది. ఇంకో పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విడుదల చేస్తున్నాం. అది మాస్ బీట్. అందులో నాకు అవకాశం వచ్చింది" అని అన్నారు.
Also Read: ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే సాయి ధరమ్ తేజ్ ఫొటోలు వచ్చాయి! సక్సెస్ సెలబ్రేషన్స్‌లో...
Also Read: శివ శంకర్ మాస్టర్‌కు చిరంజీవి సాయం! మాస్టర్ కుమారుడిని ఇంటికి పిలిపించుకుని...
Also Read: రౌద్రం రణం రుధిరం మాత్రమే కాదు... రాజమౌళి చెప్పాలనుకున్నది అంతకు మించి!
Also Read: ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ సినిమా.. ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్..
Also Read: 'దృశ్యం 2' రివ్యూ: క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది... అలాగే, వెంకటేష్ యాక్టింగ్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)