X

Shiva Shankar Master: శివ శంకర్ మాస్టర్‌కు చిరంజీవి సాయం! మాస్టర్ కుమారుడిని ఇంటికి పిలిపించుకుని...

నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి మూడు లక్షల రూపాయలు సాయంగా అందించారు. 

FOLLOW US: 

కరోనా సోకడంతో నృత్య దర్శకుడు శివ శంకర్ మాస్టర్ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన చికిత్సకు రోజుకు లక్ష రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని, తమ దగ్గర అంత డబ్బు లేదని, ఆర్ధిక సాయం చేసే దాతల కోసం ఎదురు చూస్తున్నామని ఆయన ఫ్యామిలీ తెలిపిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి మూడు లక్షల రూపాయలు సాయంగా అందించారు.
శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజ‌య్‌కు ఫోన్ చేసిన చిరంజీవి, ఆయన్ను ఇంటికి పిలిపించుకున్నారు. తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ పరిస్థితి ఎలా ఉన్నదీ, చికిత్స ఎలా అందుతున్నదీ... తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. 'మేమంతా ఉన్నాం'  అజ‌య్‌కు అభయం ఇచ్చారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ "చిరంజీవి గారు అంటే నాన్నగారికి ఎంతో అభిమానం. వాళ్లిద్దరూ కొన్ని సినిమాలకు కలిసి పని చేశారు. ఇటీవల 'ఆచార్య' షూటింగులోనూ చిరంజీవిగారిని నాన్న కలిశారు. ప్రస్తుతం మేం ఉన్న పరిస్థితిల్లో మాకు ప్రతి రూపాయి చాలా అవసరం. ఇప్పుడు చిరంజీవి గారు చేసిన సాయం ఎన్నటికీ మరువలేం. ఆయనకు ఎన్నటికీ రుణపడి ఉంటాను" అని అన్నారు.
ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఎ.ఐ.జి ఆస్పత్రిలోని క్రిటికల్ కేర్‌లో వెంటిలేటర్ మీద శివ శంకర్ మాస్టర్ చికిత్స పొందుతున్నారు. ఆయన భార్య క్వారంటైన్‌లో ఉన్నారు. పెద్ద కుమారుడు సైతం వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. ఆల్రెడీ శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి హెల్ప్ చేస్తానని నటుడు సోనూ సూద్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మరికొంత మంది ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. ఆయనకు ఆర్ధిక సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు. ఆల్రెడీ తమిళ హీరో ధనుష్ కూడా కొంత మొత్తం సాయం అందించినట్టు సమాచారం. 

Also Read: రౌద్రం రణం రుధిరం మాత్రమే కాదు... రాజమౌళి చెప్పాలనుకున్నది అంతకు మించి!
Also Read: ఆమె తరఫున నన్ను క్షమించండి.. సిరి బాయ్ ఫ్రెండ్ రియాక్షన్..
Also Read: ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ సినిమా.. ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్..
Also Read: 'ఆర్ఆర్ఆర్'కు ఆత్మ లాంటి పాట... 'జనని' వచ్చేసింది! చూశారా?
Also Read: 'అనుభవించు రాజా' రివ్యూ: సోసోగా ఉంది రాజుగారూ!
Also Read: 'దృశ్యం 2' రివ్యూ: క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది... అలాగే, వెంకటేష్ యాక్టింగ్!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: chiranjeevi Shiva Shankar Master Shiva Shankar Master Hospitalized Shiva Shankar Master Health Update

సంబంధిత కథనాలు

Mouni Roy-Suraj Nambiar Wedding: ఓ ఇంటి కోడలైన 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్... పెళ్లి ఎలా జరిగిందో చూడండి

Mouni Roy-Suraj Nambiar Wedding: ఓ ఇంటి కోడలైన 'నాగిని' ఫేమ్ మౌనీ రాయ్... పెళ్లి ఎలా జరిగిందో చూడండి

Dil Raju & Harish Shankar - ATM: హరీష్ శంకర్... 'దిల్' రాజు... ఎటిఎం దోపిడీ పక్కా!

Dil Raju & Harish Shankar - ATM: హరీష్ శంకర్... 'దిల్' రాజు... ఎటిఎం దోపిడీ పక్కా!

Radhe Shyam New Release date: 'రాధే శ్యామ్' రిలీజ్ ఎప్పుడు? 'ఆర్ఆర్ఆర్' కంటే ముందేనా?

Radhe Shyam New Release date: 'రాధే శ్యామ్' రిలీజ్ ఎప్పుడు? 'ఆర్ఆర్ఆర్' కంటే ముందేనా?

Guppedantha Manasu జనవరి 27 ఎపిసోడ్: ఇకపై దేవయాని Vs జగతి-వసు… ఇప్పటి వరకూ ఓ లెక్క ఇకపై మరో లెక్క .. గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్

Guppedantha Manasu జనవరి 27 ఎపిసోడ్:  ఇకపై దేవయాని Vs జగతి-వసు… ఇప్పటి వరకూ ఓ లెక్క ఇకపై మరో లెక్క .. గుప్పెడంతమనసు గురువారం ఎపిసోడ్

Sirivennela - Amma Song: 'ఆకలైందంటే నువ్వే తినిపించాలి... ప్రతీ మెతుకూ నా బతుకనిపించేలా' - సిరివెన్నెల కలంలో అమ్మ గొప్పదనం

Sirivennela - Amma Song: 'ఆకలైందంటే నువ్వే తినిపించాలి... ప్రతీ మెతుకూ నా బతుకనిపించేలా' - సిరివెన్నెల కలంలో అమ్మ గొప్పదనం
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Plastic Surgery Tragedy : 75 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ సర్జరీ.. బ్రాట్ పిట్ అవుతాడనుకుంటే "ఐ"లో విక్రమ్ అయ్యాడు ! ఇప్పుడు దారేంటి ?

Plastic Surgery Tragedy :  75 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ సర్జరీ..  బ్రాట్ పిట్ అవుతాడనుకుంటే

Hyderabad: విడాకులిచ్చినా వదలని మాజీ భర్త.. దగ్గరి బంధువుతో అఫైర్.. కొడుకును తీసుకెళ్లడంతో..

Hyderabad: విడాకులిచ్చినా వదలని మాజీ భర్త.. దగ్గరి బంధువుతో అఫైర్.. కొడుకును తీసుకెళ్లడంతో..

Shraddha Kapoor: సాహో బ్యూటీ మేకప్ లేకుండా ఎలా ఉంటుందంటే... ఇదిగో ఇలా ఉంటుంది

Shraddha Kapoor: సాహో బ్యూటీ మేకప్ లేకుండా ఎలా ఉంటుందంటే... ఇదిగో ఇలా ఉంటుంది

AP PRC Issue: పీఆర్సీపై మళ్లీ చర్చలకు పిలిచిన ప్రభుత్వం.. ఆ కండీషన్‌కి ఒప్పుకుంటేనే వస్తామన్న ఉద్యోగ సంఘాలు

AP PRC Issue: పీఆర్సీపై మళ్లీ చర్చలకు పిలిచిన ప్రభుత్వం.. ఆ కండీషన్‌కి ఒప్పుకుంటేనే వస్తామన్న ఉద్యోగ సంఘాలు