RRR Soul Anthem: 'ఆర్ఆర్ఆర్'కు ఆత్మ లాంటి పాట... 'జనని' వచ్చేసింది! చూశారా?
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'లో 'జనని...' పాటను ఈ రోజు విడుదల చేశారు. చూడండి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. స్వాతంత్య్రం కోసం ఇద్దరు యోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిసి పోరాడితే? కలిస్తే? ఎలా ఉంటుందనే ఊహాజనిత కథతో రూపొందిస్తున్న చిత్రమిది. కథలో ఆత్మను ఆవిష్కరించేలా 'జనని...' పాటను రూపొందించారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఆ పాటను నేడు విడుదల చేశారు.
The unrivaled, unmatched and unparalleled emotional extravaganza, #Janani/#Uyire out now!❤️#RRRSoulAnthem...
— RRR Movie (@RRRMovie) November 26, 2021
Telugu: https://t.co/AbDnephlt5
Hindi: https://t.co/4IcB4Oy4XZ
Tamil: https://t.co/BFBqvI0VPU
Kannada: https://t.co/6bk8Q0B54Q
Malayalam: https://t.co/kfeylXeAS9 pic.twitter.com/P8ym7icsmq
దర్శక ధీరుడు రాజమౌళి విజన్‌ను ఫర్‌ఫెక్ట్‌గా అర్థం చేసుకునే వ్యక్తుల్లో... ఆయన పెద్దన్న, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఒకరు. 'ఆర్ఆర్ఆర్'నూ ఆయన బాగా అర్థం చేసుకున్నారు. అంతే కాదు... సన్నివేశాలు చూసి నేపథ్య సంగీతం కోసం 'జనని...' గీతాన్ని రూపొందించారు. తొలుత ఈ పాటను అనుకోలేదని, నేపథ్య సంగీతంలో భాగంగా వచ్చిందని రాజమౌళి తెలిపారు. ఈ పాటను కీరవాణి రాశారు. ఆయనే పాడారు.
స్వరాజ్యం కోసం పోరాటం చేస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, అజయ్ దేవగణ్... అజయ్ భార్యగా శ్రియ ఈ పాటలో కనిపిస్తారు. పాట నిడివి తక్కువే... కానీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకూ ఎమోషనల్‌గా సాగింది. నటన పరంగా ఎన్టీఆర్, రామ్ చరణ్... ఇద్దరూ ఇరగదీశారు. రామ్ చరణ్ నుదుట ఆలియా భట్ తిలకం దిద్దే దృశ్యం, నెత్తిన ఎన్టీఆర్ ముస్లిం టోపీ తీయడంతో పాటు ఆయన భావోద్వేగానికి గురయ్యే సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను తాకడం ఖాయం. శ్రియతో అజయ్ దేవగణ్ సంభాషణ సైతం ఆకట్టుకుంటుంది. 'నేను నా పోరాటం... అందులో నువ్వు సగం' అని అజయ్ దేవగణ్ చెప్పారు. ఇక, కీరవాణి 'జనని...' అని పాడుతున్న సమయంలో అజయ్ దేవగణ్ రొమ్ము విరిచి నిలబడే దృశ్యం అయితే పీక్స్ అని చెప్పాలి. జనవరి 7న సినిమా విడుదల కానుంది. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు.
జనని సాంగ్:
Also Read: 'అనుభవించు రాజా' రివ్యూ: సోసోగా ఉంది రాజుగారూ!
Also Read: 'దృశ్యం 2' రివ్యూ: క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది... అలాగే, వెంకటేష్ యాక్టింగ్!
Also Read: ‘స్క్విడ్ గేమ్’ సీరిస్ స్మగ్లింగ్.. విద్యార్థికి ‘మరణ’ శిక్ష.. ఉత్తర కొరియా అరాచకం
Also Read: ‘లైగర్’ స్టార్ మైక్ టైసన్‌కు గంజాయిని ప్రోత్సహించే బాధ్యతలు.. ప్రభుత్వం విజ్ఞప్తి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి