Mike Tyson: ‘లైగర్’ స్టార్ మైక్ టైసన్‌కు గంజాయిని ప్రోత్సహించే బాధ్యతలు.. ప్రభుత్వం విజ్ఞప్తి
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్’ చిత్రంలో నటిస్తున్న మైక్ టైసన్‌కు ప్రభుత్వం.. ‘గంజాయి’కి ప్రచారకర్తగా ఉండాలంటూ అరుదైన ప్రతిపాదన చేసింది.
మైక్ టైసన్.. ఈ బాక్సింగ్ ఛాంపియన్ గురించి తెలియనివారు ఎవరూ ఉండరు. తాజాగా మన దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’లో మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనతో షూటింగ్ కోసం పూరీ టీమ్ ఇటీవల లాస్ వెగాస్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మైక్ టైసన్‌పై అక్కడ కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
‘లైగర్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న మైక్ టైసన్‌కు ఆఫ్రికాలోని మాలావీ దేశం నుంచి ఓ చిత్రమైన అభ్యర్థన వచ్చింది. ఆ దేశ జాతీయ పంటగా గుర్తింపు పొందిన గంజాయికి అంబాసిడర్‌గా ఉండాలని అక్కడి ప్రభుత్వం కోరింది. ఈ సందర్భంగా ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి లోబిన్ లో.. టైసన్‌కు లేఖ రాశారు. గంజాయికి చట్టబద్దత తీసుకురావడం ద్వారా కొత్త అవకాశాలను సృష్టించడం సాధ్యమవుతుందని, ఇందుకు మీ మద్దతు కావాలని టైసన్‌ను మంత్రి కోరారు.
టైసన్ ప్రస్తుతం అమెరికాలోని నేషనల్ కన్నబీస్ ఇండస్ట్రీ అసోసియేషన్ సభ్యుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో గంజాయి సాగుబడికి అవసరమైన సలహాలు, సూచనలను టైసన్ ద్వారా పొందవచ్చని మాలావీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనపై టైసన్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఔషధ, పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఇతర ఆఫ్రికన్ దేశాలు గంజాయి పెంపకాన్ని నేరంగా పరిగణించడం లేదు. దీంతో మాలావీ కూడా ఇతర దేశాల బాటే పట్టాలని నిర్ణయించుకుంది. గంజాయి మీద ఉన్న నిషేదాన్ని ఎత్తివేసి సాగును చట్టబద్దం చేసింది.
Also Read: సముద్రం అడుగున హోటల్ గదిలో పూజా హెగ్డే.. ఆ అందాలను చూస్తే మతి పోతుంది!
గంజాయిపై నిషేదాన్ని ఎత్తివేసినా.. వాటిని సాగు చేయడానికి, కొనుగోలు చేయడానికి అవసరమైన పెట్టుబడిదారులు, కొనుగోలుదారుల కొరత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టైసన్ పెట్టుబడిదారులను ఆకర్షించగలరని భావిస్తున్నారు. అయితే, గంజాయి సాగు మన దేశంలో నేరమనే సంగతి తెలిసిందే. ఇండియాలో నిషేదిత మాదక ద్రవ్యాల్లో గంజాయి కూడా ఒకటి. ఇటీవల టాలీవుడ్, బాలీవుడ్‌లను మాదక ద్రవ్యాల కేసులు ముప్పు తిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. చిత్రం ఏమిటంటే.. ‘లైగర్’ సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీలు టాలీవుడ్‌లో డ్రగ్స్ విచారణను ఎదుర్కొన్నారు. అలాగే ‘లైగర్’ చిత్రం హీరోయిన్, షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ఫ్రెండ్ అనన్య పాండే కూడా బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంది. వీరంతా ఇప్పుడు ‘లైగర్’ షూటింగ్ కోసం లాస్ వెగాస్‌లో మైక్ టైసన్‌తోనే ఉన్నారు.
Also Read: ‘దృశ్యం 2’ రివ్యూ: క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది... అలాగే, వెంకటేష్ యాక్టింగ్!
Also Read: పబ్ లో టేబుల్ పైకెక్కి డాన్స్ లు.. 'ఆర్మీ ఆఫీసర్ అనే విషయం మర్చిపోయిందా..?'
Also Read: స్కైలాబ్ పోస్టర్‌తో ఫోటో దిగి పంపిస్తే... బిగ్ సర్ప్రైజ్ ఇస్తానంటున్న నిత్యా మీనన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి