Pooja Hegde: సముద్రం అడుగున హోటల్ గదిలో పూజా హెగ్డే.. ఆ అందాలను చూస్తే మతి పోతుంది!
మన బుట్ట బొమ్మ.. ఇప్పుడు జలకన్యాలా మారిపోయింది. మాల్దీవుల్లో సముద్ర అందాలను ఆస్వాదిస్తూ.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటోంది.
టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో బిజీగా మారిపోయిన పూజా హెగ్డే.. ఇప్పుడు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం మాల్దీవుల్లో షికారు చేస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పటికే బికినీ ఫొటోలతో అభిమానుల గుండెల్లో సెగలు పుట్టించింది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. తన అందాలనే కాదు.. ప్రకృతి సౌందర్యాన్ని సైతం కూడా చూపిస్తూ పూజా హెగ్డే నెటిజనుల మతి పోగొడుతోంది.
ఇటీవల విడుదలైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ సినిమాలో బోల్డ్ పాత్రతో ఆకట్టుకున్న పూజా హెగ్డే.. రీల్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ అలాగే ఉంటాను అన్నట్లుగా ఆమె బోల్డ్‌గా కనిపిస్తోంది. పూజా త్వరలోనే మరికొన్ని పెద్ద చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ చిత్రాలు ఇప్పుడు క్యూలో ఉన్నాయి. ఇవి కాకుండా తమిళంలో ‘బీస్ట్’ చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ షూటింగ్‌ల నుంచి పూజాకు బ్రేక్ దొరకడంతో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది.
పూజా గురువారం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో పూజా ఈ సారి తన అందాలనే కాకుండా మాల్దీవుల్లో పర్యాటకులను ఆకట్టుకొనే ప్రాంతాలను కూడా చూపించింది. సముద్ర తీరంలోని హట్స్ నుంచి.. సముద్రం అడుగున ఉండే హోటల్ గది వరకు ప్రతి ఒక్కటీ తన సెల్ఫీ వీడియోల్లో చూపించింది. ముఖ్యంగా సముద్రం నీటి అడుగున ఉన్న హోటల్ గదిలోని అద్భుతమైన వ్యూ చూస్తే తప్పకుండా మీరు ఔరా అంటారు. ఏది ఏమైనా పూజా తన హాలీడేస్‌ను ఎంజాయ్ చేయడమే కాకుండా తన అభిమానులను సైతం అలరిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం పూజా పెట్టిన ఆ వీడియో కూడా చూసేయండి.
View this post on Instagram
Also Read: ‘దృశ్యం 2’ రివ్యూ: క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది... అలాగే, వెంకటేష్ యాక్టింగ్!
Also Read: పబ్ లో టేబుల్ పైకెక్కి డాన్స్ లు.. 'ఆర్మీ ఆఫీసర్ అనే విషయం మర్చిపోయిందా..?'
Also Read: స్కైలాబ్ పోస్టర్‌తో ఫోటో దిగి పంపిస్తే... బిగ్ సర్ప్రైజ్ ఇస్తానంటున్న నిత్యా మీనన్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి