Ram Charan: ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ సినిమా.. ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్..
రామ్ చరణ్ హీరోగా ప్రశాంత్ నీల్ ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రశాంత్ నీల్ చెప్పిన రెండు స్టోరీ లైన్స్ కూడా చరణ్ కు నచ్చాయట. అందులో ఒక సినిమాను ఫ్రాంచైజీగా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
'కేజీఎఫ్' సినిమాతో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సౌత్ ఇండియాలో స్టార్ డైరెక్టర్లో ఒకరిగా మారిపోయారు. అతడితో కలిసి సినిమాలు చేయడానికి దక్షిణాది నుంచి చాలా మంది అగ్ర హీరోలు ముందుకొస్తున్నారు. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం టాలీవుడ్ హీరోలతోనే వరుస సినిమాలను కమిట్ అవుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ తో 'సలార్' సినిమా చేస్తోన్న ప్రశాంత్ నీల్.. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నారు.
వీరితో పాటు అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో చర్చలు జరుపుతున్నారు ప్రశాంత్ నీల్. ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లను కలిశారు ప్రశాంత్ నీల్. ఈ సందర్భంగా తీసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రామ్ చరణ్ తో ఈ పాపులర్ డైరెక్టర్ సినిమా తీయడం ఖాయమని తెలుస్తోంది. ఇద్దరి మధ్య కథా చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య కొంతకాలంగా కథకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతుండగా.. ప్రశాంత్ నీల్ చెప్పిన రెండు స్టోరీ లైన్స్ కూడా చరణ్ కు నచ్చాయట.
అందులో ఒక సినిమాను ఫ్రాంచైజీగా చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో చరణ్ ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్' లాంటి యాక్షన్ ఎంటర్టైనర్ తో భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. సినిమాలో హీరోని ప్రెజంట్ చేసిన విధానం, అతడికిచ్చే ఎలివేషన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి యాక్షన్ సినిమా అని టాక్ రావడం, పైగా అది ఫ్రాంచైజీ అని మాటలు వినిపిస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
టాలీవుడ్ లో తిరుగులేని మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రామ్ చరణ్ ని ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ లో చూపిస్తాడా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే 'కేజీఎఫ్ చాఫ్టర్ 2'కు వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: 'ఆర్ఆర్ఆర్'కు ఆత్మ లాంటి పాట... 'జనని' వచ్చేసింది! చూశారా?
Also Read: 'అనుభవించు రాజా' రివ్యూ: సోసోగా ఉంది రాజుగారూ!
Also Read: 'దృశ్యం 2' రివ్యూ: క్లైమాక్స్ ట్విస్ట్ అదిరింది... అలాగే, వెంకటేష్ యాక్టింగ్!
Also Read: ‘స్క్విడ్ గేమ్’ సీరిస్ స్మగ్లింగ్.. విద్యార్థికి ‘మరణ’ శిక్ష.. ఉత్తర కొరియా అరాచకం
Also Read: ‘లైగర్’ స్టార్ మైక్ టైసన్‌కు గంజాయిని ప్రోత్సహించే బాధ్యతలు.. ప్రభుత్వం విజ్ఞప్తి
Also Read: చీరకట్టులో కాదు… మోడ్రన్ డ్రెస్సుల్లో గృహలక్ష్మిని చూశారా.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి