Akhanda Movie: బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ రోల్ అదే... ప్రిపేర్ అయ్యే టైమ్ కూడా లేదట!
నందమూరి బాలకృష్ణకు జోడీగా 'అఖండ'లో ప్రగ్యా జైస్వాల్ నటించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఆమె పాత్ర ఏమిటో తెలుసా?
'అఖండ' సినిమాలో నట సింహం నందమూరి బాలకృష్ణకు జోడీగా నటించే అవకాశం ప్రగ్యా జైస్వాల్‌కు దక్కింది. తొలుత ఈ సినిమాలో కథానాయికగా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ, చిత్రీకరణకు ముందు సాయేషా సైగల్‌ను ఎంపిక చేశారు. అయితే, చిత్రీకరణ మొదలయ్యే సమయానికి ఆమె బదులు ప్రగ్యా జైస్వాల్‌ను తీసుకున్నారు. షెడ్యూల్ మొదలయ్యే సమయానికి సాయేషా సైగల్‌కు కరోనా రావడంతో ఆమె బదులు ప్రగ్యాను తీసుకున్నట్టు టాక్. అది పక్కన పెడితే... అప్పటికి ప్రగ్యాకు కరోనా వచ్చి తగ్గడంతో హ్యాపీగా షూటింగుకు వచ్చింది. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆమెకు మరోసారి కరోనా వచ్చింది. దాంతో షూటింగ్ డిస్టర్బ్ కాలేదు. అది తనకు ఆనందం అంటోంది.
'అఖండ'లో ఐఏఎస్ అధికారి పాత్రలో ప్రగ్యా జైస్వాల్ కనిపించనున్నారు. ఆమె సివిల్ సర్వెంట్ క్యారెక్టర్ చేయడం ఇదే తొలిసారి. షూటింగ్ స్టార్ట్ కావడానికి కొన్ని రోజుల ముందు సినిమా ఓకే కావడంతో దర్శకుడు బోయపాటి శ్రీను కథ క్లుప్తంగా వివరించినా ప్రిపేర్ అయ్యే టైమ్ లేదని ఆమె వివరించారు. తామిద్దరికీ ఒకరిపై మరొకరికి గౌరవం ఉందని, అందువల్ల సినిమా అంగీకరించానని చెప్పారు.
బాలకృష్ణ చాలా పెద్ద స్టార్ అని సెట్స్‌లో అడుగుపెట్టే ముందు తనకు తెలుసు అని, అందువల్ల కొంచెం నెర్వస్ ఫీల్ అయ్యానని, కానీ ఒక్కసారి ఆయన్ను కలిసిన తర్వాత చాలా కంఫర్టబుల్‌గా అనిపించిందని ప్రగ్యా జైస్వాల్ పేర్కొన్నారు. బాలకృష్ణ చాలా మంచి మనిషి అని, ఇతరులకు ఎంతో గౌరవం ఇస్తారని, డౌన్ టు ఎర్త్ ఉంటారని ఆమె వివరించారు.
View this post on Instagram
Also Read: హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన బిగ్‌బాస్ బ్యూటీ... తెలుగులో ఓ సినిమా, మాతృభాషలో మరో రెండు!
Also Read: నోరు జారిన కమెడియన్ సుదర్శన్.. ఏకిపారేస్తున్న సన్నీ ఫ్యాన్స్..
Also Read: స్టార్ హీరోకి కరోనా పాజిటివ్.. జాగ్రత్తగా ఉండమంటూ అభిమానులకు రిక్వెస్ట్..
Also Read: మార్వెల్ స్టూడియోస్... మీకు తెలియదు! మా 'హల్క్'ను మేమే క్రియేట్ చేసుకున్నాం! - జాన్ అబ్రహం
Also Read: ఆర్టీసీపై పాట.. భీమ్లా నాయక్ స్టైల్‌లో.. కిన్నెర మొగులయ్య పాడితే.. రీ ట్వీట్ చేసిన సజ్జనార్
Also Read: సందీప్ కిషన్ - విజయ్ సేతుపతి పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా ఫేమస్ తమిళ దర్శకుడు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి