Kamal Haasan: స్టార్ హీరోకి కరోనా పాజిటివ్.. జాగ్రత్తగా ఉండమంటూ అభిమానులకు రిక్వెస్ట్..
తాజాగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

కరోనా వైరస్ ప్రజలను ఎంతగా ఇబ్బంది పెడుతుందో తెలిసిందే. సామాన్యులతో పాటు.. రాజకీయనాయకులు, సినీ తారలు అందరూ దీని బారిన పడ్డారు. ఈ వైరస్ కారణంగా ఎందరో లెజండ్స్ ని మనం కోల్పోయాం. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతున్నాయనుకుంటుంటే.. మళ్లీ ఈ వైరస్ విజృభిస్తుంది. తాజాగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇటీవలే కమల్ హాసన్ అమెరికాకు వెళ్లొచ్చారు.
Also Read: ప్రేమ విషయాన్ని బయటపెట్టింది.. కానీ పెళ్లి మాత్రం..
అక్కడే వైరస్ సోకినట్లుగా ఉంది. అమెరికా ట్రిప్ నుంచి వచ్చిన తరువాత కమల్ హాసన్ దగ్గుతో బాధ పడ్డారట. దీంతో వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించగా.. అందులో పాజిటివ్ అని తేలింది. హాస్పిటల్ లోనే ఐసోలేషన్ లో ఉంటున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. పాండమిక్ ఇంకా పూర్తవ్వలేదని.. అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ రిక్వెస్ట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలంటూ మెసేజ్ లు పెడుతున్నారు.
ఈ నెల ఆరంభంలో కమల్ హాసన్ తన 67వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఆ సందర్భంగా.. ఆయన నటిస్తోన్న 'విక్రమ్' సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు దర్సకుడు లోకేష్ కనగరాజ్. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
அமெரிக்கப் பயணம் முடிந்து திரும்பிய பின் லேசான இருமல் இருந்தது. பரிசோதனை செய்ததில் கோவிட் தொற்று உறுதியானது. மருத்துவமனையில் தனிமைப்படுத்திக் கொண்டுள்ளேன். இன்னமும் நோய்ப்பரவல் நீங்கவில்லையென்பதை உணர்ந்து அனைவரும் பாதுகாப்பாக இருங்கள்.
— Kamal Haasan (@ikamalhaasan) November 22, 2021
Also Read:'శ్యామ్ సింగ రాయ్' హిందీ రైట్స్ అమ్మేశారు! ఎంత వచ్చిందో తెలుసా?
Also Read: సందీప్ కిషన్ - విజయ్ సేతుపతి పాన్ ఇండియా సినిమాలో విలన్గా ఫేమస్ తమిళ దర్శకుడు
Also Read: కైకాల ఆరోగ్య పరిస్థితి.. ఇప్పటికీ విషమంగానే..
Also Read: ఫైనల్ వర్క్స్లో బాలకృష్ణ 'అఖండ'... ఫినిషింగ్ టచ్ ఇస్తున్న తమన్!
Also Read:రవిపై దారుణమైన ట్రోలింగ్.. ఫ్యామిలీను కూడా లాగుతూ..
Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

