News
News
X

Bigg Boss 5 Telugu: రవిపై దారుణమైన ట్రోలింగ్.. ఫ్యామిలీను కూడా లాగుతూ.. 

సోషల్ మీడియాలో రవిని సపోర్ట్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అలానే ఆయన్ని తిట్టేవాళ్లు కూడా ఉన్నారు.

FOLLOW US: 

బిగ్ బాస్ సీజన్ 5 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు యాంకర్ రవి. టాప్ 5లో ఆయన కచ్చితంగా ఉంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మొదటి నుంచి కూడా రవికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హౌస్ లోకి వెళ్లాక ఆయన ఆటతీరుతో మరింతమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. నిజానికి హౌస్ లో పేరున్న సెలబ్రిటీల్లో రవి బాగా పాపులర్ ఫేస్ అనే చెప్పాలి. ప్రతీవారం ఆయన ఎలిమినేషన్ లో ఉంటున్నాడు. నామినేషన్ ప్రెజర్ ని పక్కన పెట్టి తన గేమ్ ఆడుతున్నాడు. దీంతో అతడికి ఓట్లు కూడా బాగానే పడుతున్నాయి. 

Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్

అందుకే ఇన్ని సార్లు నామినేషన్ లో ఉన్నా.. సేవ్ అవుతూ వచ్చాడు. సోషల్ మీడియాలో రవిని సపోర్ట్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అలానే ఆయన్ని తిట్టేవాళ్లు కూడా ఉన్నారు. బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్ పై ట్రోలింగ్ అనేది కామన్. నెటిజన్లు తమకు నచ్చిన కంటెస్టెంట్స్ ను పొగుడుతూ.. నచ్చనివాళ్లను తిడుతూ ఉంటారు. సందర్భం ఉంటేనే తప్ప అకారణంగా ట్రోల్ చేయరు. కానీ యాంకర్ రవి విషయంలో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతోంది. 

కొంతమంది కావాలని రవిని టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో కొంతమంది ఫేక్ అకౌంట్స్ ను సృష్టించి.. రవిని, వాళ్ల కుటుంబ సభ్యులను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంలో రవి భార్య బాగా హర్ట్ అవుతున్నారట. రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా ఉన్నాడు కాబట్టి రవిని టార్గెట్ చేశారని అనుకోవచ్చు కానీ ఆయన ఫ్యామిలీని కూడా విమర్శించడం దారుణమనే చెప్పాలి. 

కావాలనే కొంతమంది తన పేరుని. తన కూతురు పేరుని ఈ ట్రోల్స్ లోకి లాగుతున్నారని రవి భార్య నిత్య తన సన్నితుల వద్ద వాపోయిందట. ఇది గేమ్ స్పిరిట్ కాదని.. ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారో అర్ధం కావడం లేదని నిత్య ఫీల్ అవుతుందట. బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే కంటెస్టెంట్స్ తమ కోసం స్పెషల్ గా సోషల్ మీడియా టీమ్ ను నియమించుకుంటుంది. ఇందులో భాగంగా వారు.. తన కంటెస్టెంట్స్ ను పొగుడుతూ ప్రచారం చేస్తుంటారు. కానీ కొన్ని పీఆర్ టీమ్ లు తమ కంటెస్టెంట్స్ ను హైలైట్ చేయడం కోసం వేరే వాళ్లను ట్రోల్ చేస్తున్నారు. 

Also Read: 'అఖండ' సినిమా సెన్సార్ పూర్తి... బాలకృష్ణ సినిమాకు ఏం సర్టిఫికెట్ వచ్చిందంటే?

Also Read: వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్‌గా అల్లు అర్హ... రాయ్ చెస్ అకాడమీలో నోబెల్ వరల్డ్ రికార్డ్

Also Read: కైకాలను ఫోనులో పలకరించాను... కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగింది - చిరంజీవి

Also Read: ఓ ఇంటివాడైన యువ హీరో కార్తికేయ... పెళ్లికి హాజరైన మెగాస్టార్

Also Read: సోనుసూద్ సింప్లిసిటీ.. చిన్నారికి జడలు వేస్తూ.. రోటీలు చేస్తూ.. బిజీబిజీ

Also Read: ‘మానస్ నుంచి ఏం కోరుకుంటున్నావ్.. ఆనీ నీకు బుర్ర లేదా?’ ఇంటి నుంచి ఔట్!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 21 Nov 2021 03:26 PM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 anchor ravi Bigg Boss 5 Ravi Ravi Family

సంబంధిత కథనాలు

Bigg Boss Sunny Biography : యముడికి హాయ్ చెప్పి వచ్చినోడు - 'బిగ్ బాస్' కప్ కొట్టినోడు

Bigg Boss Sunny Biography : యముడికి హాయ్ చెప్పి వచ్చినోడు - 'బిగ్ బాస్' కప్ కొట్టినోడు

Big Boss Fame Samrat: ‘బిగ్ బాస్’ ఫేమ్ సామ్రాట్‌ ఇంట్లో సంబరాలు - కూతురి ఫస్ట్ ఫొటో షేర్ చేసిన నటుడు

Big Boss Fame Samrat: ‘బిగ్ బాస్’ ఫేమ్ సామ్రాట్‌ ఇంట్లో సంబరాలు - కూతురి ఫస్ట్ ఫొటో షేర్ చేసిన నటుడు

Urfi Javed: ఉర్ఫీ జావెద్‌కు లైంగిక వేధింపులు - అతడి ఫొటో, వాట్సాప్ చాట్ బయటపెట్టిన బ్యూటీ

Urfi Javed: ఉర్ఫీ జావెద్‌కు లైంగిక వేధింపులు - అతడి ఫొటో, వాట్సాప్ చాట్ బయటపెట్టిన బ్యూటీ

Sravanthi Instagram Hacked: ‘బిగ్ బాస్’ బ్యూటీ స్రవంతికి హ్యాకర్స్ షాక్, అవన్నీ డిలీట్ - ఇవి మాత్రమే మిగిలాయ్!

Sravanthi Instagram Hacked: ‘బిగ్ బాస్’ బ్యూటీ స్రవంతికి హ్యాకర్స్ షాక్, అవన్నీ డిలీట్ - ఇవి మాత్రమే మిగిలాయ్!

Bigg Boss: ‘బిగ్ బాస్ సీజన్ 6’ అడ్డా ఫిక్స్ - అదిరిపోయే ప్రోమో రిలీజ్

Bigg Boss: ‘బిగ్ బాస్ సీజన్ 6’ అడ్డా ఫిక్స్ - అదిరిపోయే ప్రోమో రిలీజ్

టాప్ స్టోరీస్

Thunderstorm: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం - పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం

Thunderstorm: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం - పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం

Desam Aduguthondhi: అమృతోత్సవ వేళ - రాజకీయాలేల ! నేతలు ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు !

Desam Aduguthondhi: అమృతోత్సవ వేళ - రాజకీయాలేల ! నేతలు ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు !

V Srinivas Goud: తెలంగాణ మంత్రిపై NHRC లో ఫిర్యాదు, కఠిన చర్యలకు డిమాండ్

V Srinivas Goud: తెలంగాణ మంత్రిపై NHRC లో ఫిర్యాదు, కఠిన చర్యలకు డిమాండ్

TS LAWCET Results: నేడు తెలంగాణ లాసెట్ ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!

TS LAWCET Results: నేడు తెలంగాణ లాసెట్ ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!