Allu Arha: వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా అల్లు అర్హ... రాయ్ చెస్ అకాడమీలో నోబెల్ వరల్డ్ రికార్డ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అర్హ వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా రికార్డు సృష్టించిందని అర్జున్ సతీమణి స్నేహారెడ్డి తెలిపారు. చిన్నారి పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం వెల్లడించారు.
అల్లు వారి అమ్మాయి అర్హ ఆటల్లో దూసుకు వెళుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా రికార్డు సృష్టించింది. రాయ్ చెస్ అకాడమీ నుంచి నోబెల్ వరల్డ్ రికార్డ్ అందుకుంది. ఐదేళ్ల అర్హ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొంటోందని, 50 మంది ఒకేసారి 30 పజిల్స్ సాల్వ్ చేసిందని రాయ్ చెస్ అకాడమీ పేర్కొంది. ఈ రోజు (ఆదివారం, నవంబర్ 21) అర్హ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిన్నారి సాధించిన రికార్డును తల్లి స్నేహారెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
View this post on Instagram
"హ్యాపీ బర్త్ డే మై లిటిల్ ప్రిన్సెస్. నా చిన్న బేబీ... ఐ లవ్ యూ సో మచ్. ఈ ఏడాది అంతా కలరింగ్, డ్రాయింగ్, ట్రావెలింగ్ తో నిండిపోవాలి" అని కుమార్తె అర్హతో దిగిన ఫొటోను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ రోజు అల్లు అర్హ ఐదో పుట్టినరోజు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Happy Birthday My Lil Princes. I love sooo muchhh na chinna baby 💖. May this year be filled with lots n lots of Colouring , Drawing & Travelling 😘 #AlluArha pic.twitter.com/VywsciwA8k
— Allu Arjun (@alluarjun) November 21, 2021
బాలనటిగా వచ్చే ఏడాది అల్లు అర్హ తెరంగేట్రం చేయనున్నారు. సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న 'శాకుంతలం' సినిమాలో ఆమె ప్రిన్స్ భరత పాత్రలో నటించారు. ఆల్రెడీ చిత్రీకరణ పూర్తి చేశారు.-
Here’s wishing our Little Star #AlluArha a very Happy Birthday ❤️
— Gunaa Teamworks (@GunaaTeamworks) November 21, 2021
Have a great day! Lots of love to our Prince “Bharata” from Team #Shaakuntalam 🤍✨
Special B'day Video: https://t.co/fDLJrUIUt5#HBDAlluArha @alluarjun@Gunasekhar1 @GunaaTeamworks @neelima_guna pic.twitter.com/GIwjUGDVs3
Also Read: కైకాలను ఫోనులో పలకరించాను... కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగింది - చిరంజీవి
Also Read: ఓ ఇంటివాడైన యువ హీరో కార్తికేయ... పెళ్లికి హాజరైన మెగాస్టార్
Also Read: సోనుసూద్ సింప్లిసిటీ.. చిన్నారికి జడలు వేస్తూ.. రోటీలు చేస్తూ.. బిజీబిజీ
Also Read: ‘మానస్ నుంచి ఏం కోరుకుంటున్నావ్.. ఆనీ నీకు బుర్ర లేదా?’ ఇంటి నుంచి ఔట్!
Also Read: షణ్నుతో ఆ ఫీలింగ్ తప్పని తెలిసినా చేస్తున్నా.. ప్రియాంక వీడియో చూపించి మానస్‌కు షాకిచ్చిన నాగ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి