Kartikeya: ఓ ఇంటివాడైన యువ హీరో కార్తికేయ... పెళ్లికి హాజరైన మెగాస్టార్
'ఆర్ఎక్స్ 100', 'రాజా విక్రమార్క' సినిమాలతో హీరోగా... 'నానీస్ గ్యాంగ్ లీడర్'లో విలన్‌గా ప్రేక్షకులను అలరించిన యువ హీరో కార్తికేయ ఓ ఇంటివాడు అయ్యారు.
![Kartikeya: ఓ ఇంటివాడైన యువ హీరో కార్తికేయ... పెళ్లికి హాజరైన మెగాస్టార్ Kartikeya Gummakonda and Lohitha Reddy are officially Mr and Mrs. They are married today morning Kartikeya: ఓ ఇంటివాడైన యువ హీరో కార్తికేయ... పెళ్లికి హాజరైన మెగాస్టార్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/21/ee6565145b898b4fb773e53c817978a8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యువ హీరో కార్తికేయ గుమ్మకొండ బ్యాచిలర్ జీవితానికి బై బై చెప్పేశారు. ఈ రోజు ఉదయం వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. కార్తికేయ, లోహితా రెడ్డి ఆదివారం ఉదయం వైవాహిక బంధంతో ఒక్కటి అయ్యారు.
హైదరాబాద్‌లో జరిగిన ఈ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. చిరంజీవికి కార్తికేయ వీరాభిమాని. ఇటీవల విడుదలైన తన సినిమాకు చిరంజీవి సినిమా టైటిళ్లలో ఒకటైన 'రాజా విక్రమార్క'ను పెట్టుకున్నారు కార్తికేయ. అభిమాని అనే అర్హతతో పెట్టుకున్నానని చెప్పారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నటులు తనికెళ్ల భరణి, సాయి కుమార్, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, దర్శకుడు అజయ్ భూపతితో పాటు కొంతమంది సినిమా ప్రముఖులు, యువ హీరోలు సైతం కార్తికేయ పెళ్లికి అటెండ్ అయ్యారు.
View this post on Instagram
'రాజా విక్రమార్క' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లోహితా రెడ్డిని కార్తికేయ ప్రేక్షకులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. వరంగల్‌లో బీటెక్ చేసినప్పుడు ఇద్దరికీ పరిచయం అయ్యింది. అది ప్రేమగా మారింది. లోహితా రెడ్డి దగ్గర పెళ్లి ప్రస్తావన తానే తీసుకొచ్చానని కార్తికేయ వివరించారు. అయితే... ఎప్పుడూ సరిగా ప్రపోజ్ చేయలేదని, అందుకే 'రాజా విక్రమార్క' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మోకాళ్ల మీద కూర్చుని ప్రపోజ్ చేశానని అన్నారు. హీరోగా కార్తికేయకు భారీ విజయం అందించిన 'ఆర్ఎక్స్ 100' సినిమాను లోహితా రెడ్డి చూడకపోవడం విశేషం. ఆ సినిమా విడుదల సమయంలో ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు అవ్వడంతో మాట్లాడుకోలేదట. అయితే... హీరో కావడానికి ముందే లోహితాతో 'నేను హీరో అయిన తర్వాత మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను' అని చెప్పానని చెప్పుకొచ్చారు.
సినిమాలకు వస్తే... సంక్రాంతికి విడుదల కానున్న తమిళ సినిమా 'వలిమై'లో కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా నటించారు. అందులో అజిత్ హీరో. తెలుగులో హీరోగా రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
Also Read:గ్యాప్ ఉంటే వచ్చేస్తాం.. 'బంగార్రాజు' విడుదలపై సుప్రియ కామెంట్స్..
Also Read: 'నా జీవితానికి ఇదే గ్రీన్ సిగ్నల్..' చైతు పోస్ట్ వైరల్..
Also Read: సల్మాన్‌తో రాజమౌళి మీటింగ్... సినిమా చేస్తున్నారా? 'ఆర్ఆర్ఆర్'కి ఇన్వైట్ చేశారా?
Also Read: బాలీవుడ్‌కు నాగచైతన్య పరిచయమయ్యేది ఆ రోజే... లాల్ సింగ్ చద్దా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)