Bangarraju: గ్యాప్ ఉంటే వచ్చేస్తాం.. 'బంగార్రాజు' విడుదలపై సుప్రియ కామెంట్స్..
ఓ పక్క సంక్రాంతికి మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుంటే.. మధ్యలో 'బంగార్రాజు' కూడా రిలీజ్ కి రెడీ అంటున్నాడు.
2022 సంక్రాంతి హాట్ కేక్ లా మారింది. దర్శకనిర్మాతలందరికీ అదే డేట్ కావాలి. 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్', 'భీమ్లానాయక్' ఈ సినిమాలన్నీ కూడా సంక్రాంతి రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అయితే 'భీమ్లానాయక్' సినిమాను డ్రాప్ అవ్వమని ఇండస్ట్రీ పెద్దలు కోరుతున్నారు. ప్రస్తుతానికైతే.. ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. ఓ పక్క ఈ మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతుంటే.. మధ్యలో 'బంగార్రాజు' కూడా రిలీజ్ కి రెడీ అంటున్నాడు. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బంగార్రాజు'.
Also Read: 'దీప్తిని మిస్ అవుతుంటే.. వెళ్లిపో..' షణ్ముఖ్ కి షాకిచ్చిన నాగ్..
ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని మొదటినుంచి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఇన్ని పెద్ద సినిమాను సంక్రాంతికి వస్తుండడంతో నాగ్ అండ్ కో ఆలోచనలో పడింది. కానీ తమ టార్గెట్ సంక్రాంతికే అని మాత్రం బయటకు చెబుతున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మేనకోడలు, నిర్మాత సుప్రియ 'బంగార్రాజు' రిలీజ్ డేట్ గురించి మాట్లాడారు. అన్నీ కుదిరితే సంక్రాంతికి రావడం పక్కా అని చెప్పారు సుప్రియ. కానీ ఏదొక సినిమా వెనక్కి తగ్గాలని అంటున్నారు.
ప్రస్తుతానికి మూడు సినిమాలు సంక్రాంతికి వస్తామని ప్రకటించాయని.. ఆ మూడూ వస్తే గనుక 'బంగార్రాజు' రాకపోవచ్చని అన్నారు. అందులో ఒక సినిమా అయినా.. డ్రాప్ అయితే 'బంగార్రాజు'ని రిలీజ్ చేస్తామని అన్నారు. నాలుగు సినిమాలకు సంక్రాంతి బరిలో చోటు లేదని.. రెండు సినిమాలకైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. రెండు సినిమాలే రిలీజైతే మాత్రం తమకు కావాల్సినన్ని థియేటర్లు దొరుకుతాయని.. అప్పుడు 'బంగార్రాజు'ని రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి తమ టార్గెట్ మాత్రం సంక్రాంతి అని స్పష్టం చేశారు. మరి ఏ సినిమా డ్రాప్ అవుతుందో చూడాలి..!
Also Read: 'నా జీవితానికి ఇదే గ్రీన్ సిగ్నల్..' చైతు పోస్ట్ వైరల్..
Also Read: హౌస్ మేట్స్ కి షాక్ ఇవ్వనున్న బిగ్ బాస్.. డబుల్ ఎలిమినేషన్ తప్పదా..?
Also Read: హాస్పిటల్ లో సీనియర్ నటుడు.. పరిస్థితి విషమం..
Also Read: సల్మాన్‌తో రాజమౌళి మీటింగ్... సినిమా చేస్తున్నారా? 'ఆర్ఆర్ఆర్'కి ఇన్వైట్ చేశారా?
Also Read: బాలీవుడ్‌కు నాగచైతన్య పరిచయమయ్యేది ఆ రోజే... లాల్ సింగ్ చద్దా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి