By: ABP Desam | Updated at : 20 Nov 2021 03:46 PM (IST)
హౌస్ మేట్స్ కి షాక్ ఇవ్వనున్న బిగ్ బాస్..
బిగ్ బాస్ సీజన్ 5 మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలైంది. ఇప్పటివరకు మొత్తం పది మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లో ప్రస్తుతం తొమ్మిది మంది మిగలగా.. వారిలో రవి తప్ప మిగిలినవాళ్లంతా కూడా నామినేషన్ లో ఉన్నారు. అయితే ఈ వారం కాజల్ కానీ యానీ మాస్టర్ కానీ ఎలిమినేట్ అవుతుందనే వార్తలు వినిపించాయి. వీరిద్దరికీ ఓట్లు తక్కువ వచ్చాయని టాక్. ఇదిలా ఉండగా.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి షాకివ్వబోతున్నారని సమాచారం.
Also Read: హాస్పిటల్ లో సీనియర్ నటుడు.. పరిస్థితి విషమం..
ఈ వారంలో హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వబోతున్నారట. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని పక్కాగా చెబుతున్నారు. ఈ డబుల్ ఎలిమినేషన్ లో సిరి, కాజల్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. నిజానికి కాజల్ లాస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ కావాల్సింది కానీ జెస్సీ అనారోగ్యంగా కారణంగా హౌస్ నుంచి వెళ్లాల్సి రావడంతో కాజల్ సేవ్ అయింది. ఇక ఈ వారం ఆమె ఎలిమినేట్ కాక తప్పేలా లేదు.
అయితే కాజల్ తో పాటు సిరి కూడా ఎలిమినేట్ అవుతుందని టాక్. నిజానికి మొదటినుంచి సిరి తన గేమ్ చాలా బాగా ఆడుతుంది. షణ్ముఖ్-సిరి-జెస్సీల ఫ్రెండ్షిప్ బాండ్ కి మంచి క్రేజ్ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో సిరి-షణ్ముఖ్ ల బిహేవియర్ ప్రేక్షకులకు నచ్చడం లేదు. సిరి అలగడం, షణ్ముఖ్ సారీ చెప్పడం.. షణ్ముఖ్ కోప్పడ్డాడని సిరి బాత్రూంలోకి వెళ్లి గోడకి తలబాదుకోవడం ఇలా చాలానే జరిగాయి.
ఇవి కాకుండా.. ఇద్దరూ ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయామని చెబుతూ నెగెటివ్ ఇంప్రెషన్ కలిగేలా మాట్లాడుతున్నారు. షణ్ముఖ్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉండడంతో అతడికి ఓట్లు బాగానే పడుతున్నాయి. సిరి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ.. ఆమె ప్రవర్తన కారణంగా ఓటింగ్ రేట్ తగ్గినట్లు సమాచారం. దీంతో బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నారట. మరి సిరి వెళ్లిపోతే షణ్ముఖ్ ఏమైపోతాడో..!
Also Read: సల్మాన్‌తో రాజమౌళి మీటింగ్... సినిమా చేస్తున్నారా? 'ఆర్ఆర్ఆర్'కి ఇన్వైట్ చేశారా?
Also Read: బాలీవుడ్‌కు నాగచైతన్య పరిచయమయ్యేది ఆ రోజే... లాల్ సింగ్ చద్దా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది!
Also Read: రాజును మోకాళ్ల మీద కూర్చోబెట్టారన్న ప్రకాష్ రాజ్... మోడీకి సోనూ సూద్ థాంక్స్
Also Read: ఈటెల రాజేందర్‌ది ధర్మ పోరాటం అంటున్న పూనమ్ కౌర్... ఆయన్ను కలిసి!
Also Read: ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో రౌడీ హీరో.. హిట్ అందుకుంటాడా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి
Bigg Boss OTT Finale: గోల్డెన్ సూట్ కేస్ రిజెక్ట్ చేసిన ఫైనలిస్ట్స్ - విన్నర్ గా నిలిచిన బిందు మాధవి!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి
PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video
TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే
In Pics: లండన్ నుంచి దావోస్‌కు మంత్రి కేటీఆర్ - దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీలు
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు