FarmLawas: రాజును మోకాళ్ల మీద కూర్చోబెట్టారన్న ప్రకాష్ రాజ్... మోడీకి సోనూ సూద్ థాంక్స్
నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్, సోనూ సూద్, తాప్సీ పన్ను, రిచా చద్దా తదితర సినీ ప్రముఖులు స్పందించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి గతంలో ప్రియాంకా చోప్రా నుంచి పంజాబీ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ వరకూ పలువురు సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. దక్షిణాదిలో రైతులు మద్దతుగా ప్రకాష్ రాజ్ గతంలో మాట్లాడారు. ఆయన ఎప్పుడూ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇప్పుడు నరేంద్ర మోడీ కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. అలాగే, బాలీవుడ్ స్టార్స్ సోనూ సూద్, తాప్సీ పన్ను, రిచా చద్దా తదితర సినీ ప్రముఖులు స్పందించారు. "నా దేశం... నా గళం" అంటూ అనితా నాయర్ రాసిన ఓ కవితకు ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. దానిని ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్ "నా దేశంలోని రైతుల అవిశ్రాంత పోరాటం రాజును మోకాళ్ల మీద కూర్చోబెట్టింది. జై కిసాన్" అని పేర్కొన్నారు.
The relentless fighting farmers of my country have brought the KING on his knees … sharing @anitanairauthor poem narrated by me in support of #FarmersProtest against 3 #farmlaws.. #JaiKisan #justasking pic.twitter.com/9c3AF1x3AC
— Prakash Raj (@prakashraaj) November 19, 2021
సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నందుకు నరేంద్ర మోడీకి సోనూ సూద్ థాంక్స్ చెప్పారు. ఇదొక అద్భుతమైన వార్త అని ఆయన పేర్కొన్నారు. అలాగే, శాంతియుత నిరసన పద్ధతుల్లో తమ డిమాండ్స్ నెరవేర్చుకున్న రైతులకు కూడా ఆయన థాంక్స్ చెప్పారు. సంతోషంగా రైతులు కుటుంబాల చెంతకు చేరుకుంటారని ఆశిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. గురు పౌర్ణమి రోజున ఈ వార్త వచ్చిన తాప్సి అన్నారు.
This is a wonderful news!
— sonu sood (@SonuSood) November 19, 2021
Thank you,@narendramodi ji, @PMOIndia, for taking back the farm laws. Thank you, farmers, for raising just demands through peaceful protests. Hope you will happily return to be with your families on the Parkash Purab of Sri Guru Nanak Dev Ji today.
"మీ (రైతుల) విజయంలో అందరి విజయం ఉంది" అని రిచా చద్దా ట్వీట్ చేశారు. రైతులకు మద్దతుగా పలు ట్వీట్లను ఆమె రీట్వీట్ చేశారు. మరోవైపు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని తీసుకున్న నిర్ణయం పట్ల కంగనా రనౌత్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
जीत गए आप! 🙏🏽 आप की जीत में सब की जीत है 🙏🏽 https://t.co/r9jwMuXvL8
— RichaChadha (@RichaChadha) November 19, 2021
Also Read: చట్టాలు రోడ్లపైకొచ్చిన జనం రూపొందిస్తుంటే.. మనది కూడా జిహాదీ దేశమే, కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు
Also Read: 'జై విఠలాచార్య'... జానపద బ్రహ్మపై పుస్తకం ఫస్ట్ లుక్ విడుదల చేసిన కృష్ణ
Also Read: వారి ఇబ్బందులు నా మనసును కలచివేస్తున్నాయి.. చిరంజీవి ట్వీట్
Also Read: 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' రివ్యూ: పప్పుచారు అంత టేస్టీగా... నవ్విస్తుంది!
Also Read: ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ సాంగ్.. ఎవడ్రా.. ఎవడ్రా నువ్వు.. అస్సలు తగ్గని బన్నీ
Also Read: ఆహా... బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్'కు గెస్ట్‌గా ఆ స్టార్ హీరో!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి