Pushpa New Song: ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ సాంగ్.. ఎవడ్రా.. ఎవడ్రా నువ్వు.. అస్సలు తగ్గని బన్నీ
‘పుష్ప’ నుంచి మారో సాంగ్ వచ్చేసింది. ఈ సారి బన్నీ.. తన స్టెప్పులతో దుమ్ము దులిపేశారు. మీరూ ఓ లుక్ వేసేయండి మరి.
అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప: ద రైజ్’ నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని మూడు పాటలు యూట్యూబ్‌లో రికార్డుల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు (నవంబరు 19న) చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదలైన నాలుగో పాట ‘‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’’ పాట కూడా అదే స్థాయిలో దూసుకుపోతుందని బన్నీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ పాట ప్రోమోకు కూడా యూట్యూబ్‌లో మంచి వ్యూసే వచ్చాయి. ఇక ఈ ఫుల్ సాంగ్ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకాలు పక్కా.
దేవిశ్రీప్రసాద్ ఈ పాటకు అందించిన మాస్ బీట్ ఓ రేంజ్‌లో ఉంది. ‘పుష్ప’ తొలి భాగం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. రెండో భాగంగా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చినట్లు సమాచారం. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్‌గా బన్నీ కనిపించనున్నాడు. ఈ చిత్రంలో రొమాలు నిక్కబొడిచే యాక్షన్ సన్నివేశాలే కాదు.. శ్రీవల్లి పాత్ర పోషిస్తున్న రష్మిక మందానతో లవ్, రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయని చిత్రయూనిట్ చెబుతోంది. ఇందుకు మీరు డిసెంబర్ 17 వరకు వేచి చూడాల్సిందే.
Also Read: సంపూ అరుపు.. నవ్విస్తున్న విషాద గీతం.. ‘పగిలిందా నీ తాళం.. పోయిందా నీ శీలం..’
ఈ చిత్రాన్ని తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. అల్లు అర్జున్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇదే. అయితే, అల్లు అర్జున్ బాలీవుడ్, ఇతర భాషస్తులకు కొత్త కాదు. ఇప్పటికే బన్నీ నటించిన పలు సినిమాలు హిందీ, మలయాళం బాషలోకి డబ్ అయ్యాయి. అన్నట్లు ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫాహాద్, కమెడియన్ సునీల్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. అనసూయ దాక్షాయణిగా నటిస్తోంది.
Also Read: నాగ్ పంచ్‌కు చైతూ కౌంటర్.. ‘లేడిస్ ఫస్ట్’ అంటూ కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!
Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి