News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Sampoornesh Babu: సంపూ అరుపు.. నవ్విస్తున్న విషాద గీతం.. ‘పగిలిందా నీ తాళం.. పోయిందా నీ శీలం..’

‘కాలిఫ్లవర్’ టీజర్‌తో నవ్వించిన సంపూర్ణేష్ బాబు.. ఇప్పుడు విషాద గీతంతో మరోసారి పగలబడి నవ్వేలా చేస్తున్నాడు. అదేంటీ విషాద గీతంలో కూడా కామెడీయా అనేగా మీ డౌట్.. అయితే, ఈ సాంగ్ చూసేయండి.

FOLLOW US: 
Share:

సంపూర్ణేష్ బాబు.. ఈ పేరు వింటే చాలు కితకితలు పెట్టకుండానే నవ్వు వచ్చేస్తుంది. అతడు డైలాగులు చెబుతుంటే.. మనకు ఆయాసం వస్తుంది. ఇక సంపూ సినిమా వస్తుందంటే.. ఎప్పుడూ లేనంత ఆసక్తి కలుగుతుంది. ఈసారి ఏ తుంటరి కాన్సెప్ట్‌తో వచ్చి.. నవ్విస్తాడో చూడాలనిపిస్తుంది. అందుకే.. ఈ సారి సంపూ ‘కాలిఫ్లవర్’ సినిమాతో వచ్చేస్తున్నాడు. టైటిల్ వినగానే.. కాలిఫ్లవరా? అని ఆశ్చర్యపోయారు. టీజర్ చూసిన తర్వాత అందరికీ అర్థమైంది ఏంటంటే.. సాధారణ పువ్వులు మహిళలకు ప్రతీకలైతే.. కోసి వంట చేసుకునే పువ్వు మగాళ్లకు సింబల్ అని సంపూ తేల్చేశాడు. అంతేకాదు.. కాలిఫ్లవర్ శీల రక్షణకు.. అదేనండి, మగాళ్ల శీలాన్ని కాపాడేందుకు కంకణం కట్టుకుని నవంబరు 26న మన ముందుకు వచ్చేస్తున్నాడు. 

ఈ సినిమాలో మన బర్నింగ్ స్టార్ నెత్తిమీద పిలకతో కాలీఫ్లవర్ లానే కనిపిస్తున్నాడు. మగాడి శీల రక్షణే తన ధ్యేయమని, మగాళ్ల శీల రక్షణ కోసం చట్టం రావాలన్నదే తన పోరాటమంటూ నవ్వించే డైలాగులతో కితకితలు పెడుతున్నాడు. ‘ఎనీ టైమ్ శీలాన్నే కాపాడే సింబలేరా ఈ కాలీ ఫ్లవర్’ డైలాగులేసిన సంపూ.. ఓ యువతి చేతిలో శీలాన్ని కోల్పోతాడని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. తాజాగా విడుదలైన పాటలో కూడా సంపూ.. తన బాధను వ్యక్తం చేసుకున్నాడు. ఈ పాటలోని లిరిక్స్ చూస్తే మీకు కూడా నవ్వెచ్చేస్తుంది. 

‘‘అయ్యో పగిలిందా నీ తాళం.. 
పోయిందా నీ శీలం..
నీ కొప్పునే వాళ్లు విప్పారా.. 
నిన్న తోడున్న నీ పంచ..
అంచుతో సహా చిరిగేనా..ఆ ఆ ఆ..
నీ వాపుల బాధలు తీరవులే..
నీ షేపులు మారినా.. తెలియదులే.. 
విచ్చుకోని నీ మొగ్గ చిరిగి చిద్రమయేనా..
భద్రంగా దాచావు.. శుభ్రంగా దోచారు..
అందంగా పుట్టడమే నీకు శాపమాయేనా..
మంచి చెప్పినా నిన్ను.. 
దంచి మరీ వెల్లెనా.. దంచి మరీ వెల్లేనా..’’ అంటూ సాగే ఈ పాటలో సంపూ జీవించేశాడు. ఇంకెందుకు ఆలస్యం ఆ పాటపై మీరూ ఓ లుక్కేయండి. 

ఇదే ‘సంపు అరుపు’ పాట: 

Also Read: నాగ్ పంచ్‌కు చైతూ కౌంటర్.. ‘లేడిస్ ఫస్ట్’ అంటూ కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!

ఈ సినిమాను ఆర్కే మలినేని తెరకెక్కించారు. ఆశా జ్యోతి గోగినేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వాసంతి హీరోయిన్ గా నటిస్తోంది.  పోసాని కృష్ణమురళి, పృథ్వీ కీలక పాత్రల్లో  నటిస్తున్నారు. ఈ   సినిమాని ఈనెల 26న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను నవ్విస్తుందని చెబుతున్నారు మూవీ మేకర్స్.

Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Nov 2021 05:21 PM (IST) Tags: Sampoornesh Babu Sampoornesh Babu new movie సంపూర్ణేష్ బాబు Cauliflower song

ఇవి కూడా చూడండి

మరో బాలీవుడ్ ఆఫర్ అందుకున్న పూజా హెగ్డే - మొదటిసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్?

మరో బాలీవుడ్ ఆఫర్ అందుకున్న పూజా హెగ్డే - మొదటిసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్?

షారుక్, సల్మాన్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్ పోతినేని!

షారుక్, సల్మాన్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్ పోతినేని!

నవంబర్ నుంచి మార్చ్ కి షిఫ్ట్ అయిన 'సలార్' రిలీజ్?

నవంబర్ నుంచి మార్చ్ కి షిఫ్ట్ అయిన 'సలార్' రిలీజ్?

కేరళలో 'లియో' మూవీని బ్యాన్ చేస్తున్నారా? - ట్రెండింగ్ లో #Kerala Boycott Leo?

కేరళలో 'లియో' మూవీని బ్యాన్ చేస్తున్నారా? - ట్రెండింగ్ లో #Kerala Boycott Leo?

రామచందర్ తో పరిచయం ఉన్న మాట వాస్తవమే - కానీ నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు : నవదీప్

రామచందర్ తో పరిచయం ఉన్న మాట వాస్తవమే - కానీ నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు : నవదీప్

టాప్ స్టోరీస్

ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు

ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు

BRS Candidates : సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్‌లో సందడేది ?

BRS Candidates :  సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్‌లో సందడేది ?

Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత

Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత

Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు

Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు