IPL, 2022 | Match 66 | Dr. DY Patil Sports Academy, Navi Mumbai - 18 May, 07:30 pm IST
(Match Yet To Begin)
KKR
KKR
VS
LSG
LSG
IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT

'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' రివ్యూ: పప్పుచారు అంత టేస్టీగా... నవ్విస్తుంది!

Oka Chinna Family Story Web Series Review: నిహారికా కొణిదెల నిర్మించిన వెబ్ సిరీస్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' రివ్యూ. 'జీ 5' ఓటీటీలో విడుదలైంది. ఇది ఎలా ఉంది?

FOLLOW US: 

రివ్యూ: ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ
రేటింగ్: 3.5/5
ప్రధాన తారాగణం: సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ, తులసి, వీకే నరేష్, ప్రమీలా రాణి, గెటప్ శ్రీను, రాజీవ్ కనకాల తదితరులు
ఎడిటర్: ప్రవీణ్ పూడి 
కెమెరా: ఇ. రాజు
సాహిత్యం: శ్రీమణి
షో క్రియేటర్ & రైటర్: మానసా శర్మ, మహేష్ ఉప్పాల 
సంగీతం: పీకే దండి
నిర్మాత: నిహారికా కొణిదెల
దర్శకత్వం: మహేష్ ఉప్పాల  
విడుదల: 19-11-2021
ఓటీటీ వేదిక: జీ 5

వెబ్ సిరీస్ అంటే అడల్ట్ కంటెంట్, గ్లామర్ షో అనే ముద్ర పడింది. కొన్ని వెబ్ సిరీస్‌లు క్లీన్ కంటెంట్‌తో వస్తున్నాయి. అందులో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' కూడా ఉంటుంది. కంటెంట్ క్లీన్‌గా ఉంటే సరిపోతుందా? ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలి కదా! 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'లో అలా ఆకట్టుకునే అంశాలు ఏమున్నాయి?

కథ: హరిదాస్ (వీకే నరేష్), రుక్మిణి (తులసి) దంపతులకు ఓ కుమారుడు. అతడి పేరు మహేష్ (సంగీత్ శోభన్). ఏ పని చేయడు. కీర్తి (సిమ్రాన్ శర్మ)కు లైన్ వేస్తుంటాడు. లేదంటే ఇంట్లో కూర్చుంటాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని, వాళ్లింట్లో వాళ్లతో మాట్లాడమని డైరెక్టుగా తండ్రితో చెబుతాడు. స‌డ‌న్‌గా హరిదాస్ మరణిస్తాడు. ఆ తర్వాత నెల నెలా ఇల్లు గడవడం కోసం ఏదో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మహేష్, రుక్మిణిలకు మైండ్ బ్లాక్ అయ్యే విషయం తెలుస్తుంది. లోకల్ బ్యాంక్ నుంచి హరిదాస్ పాతిక లక్షలు లోన్ తీసుకున్నాడని! ప్రతి నెల 30 వేలు ఈఎంఐ కట్టడం కోసం తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మహేష్ ఏం చేశాడు? ఏ ఉద్యోగంలో చేరాడు? కీర్తి అతడి ప్రేమలో పడిందా? లేదా? చివరకు ఏమైంది? అనేది వెబ్ సిరీస్‌లో చూడాలి.

విశ్లేషణ: 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' ట్రైలర్ చూస్తే... మహేష్ క్యారెక్టర్ మీద ఒక ఐడియా వస్తుంది. డిగ్రీ, బీటెక్ కంప్లీట్ చేసి ఎటువంటి పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చుంటూ... ఉద్యోగం చేయడం లేదని తండ్రి చేత తిట్లు తినే కుర్రాళ్లు మన కాలనీ, సోసిటీలో ఎవరో ఒకరు కనిపిస్తారు. సినిమాల్లోనూ కనిపించారు. మరి... ఆ సినిమాల్లో హీరోకు, 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'లో హీరోకు తేడా ఏంటి? ఆ సినిమాలకు, ఈ వెబ్ సిరీస్‌కు వ్యత్యాసం ఏంటి? అంటే... అమాయకత్వం. అలాగే, తల్లి పాత్ర.
'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'లో తులసి పోషించిన తల్లి పాత్రలో, హీరో సంగీత్ శోభన్ పాత్రలో ఓ అమాయకత్వం ఉంటుంది. కథ ప్రారంభం నుంచి పతాక సన్నివేశాల ముందు వరకూ... ఐదు ఎపిసోడ్స్‌లో నాలుగు ఎపిసోడ్స్‌లో ఆ అమాయకత్వం కనిపించింది. దానికి తోడు సందర్భానుసారంగా వచ్చే సన్నివేశాలు... నవ్విస్తాయి. మంచి డైలాగులు పడ్డాయి. మెలోడ్రామా పండింది. ఊళ్లో ఓ వార్త ఎలా స్ప్రెడ్ అవుతుంది? అనేదాన్ని బాగా ఉపయోగించుకున్నారు. కథ, స్క్రీన్ ప్లే కమర్షియల్ లెక్కలకు అనుగుణంగా సాగినా... కామెడీ డోస్ ఫుల్లుగా ఉండటంతో కామన్ స్టోరీ అనేది తెలియకుండా నాలుగు ఎపిసోడ్స్ సాగాయి. ఇంటి ఖర్చులకు ఎంత కావాలని తల్లీకొడుకులు లెక్కలు వేయడం దగ్గర నుంచి పాతిక లక్షల కోసం ఓ స్కామ్ చేయడానికి వెళ్లిన చోట ప్రవర్తించిన విధానం వరకూ... ప్రతి సన్నివేశంలో అమాయకత్వం ఉంది. అది చాలా మందిని నవ్విస్తుంది. ఇక చివరి ఎపిసోడ్‌లో ఫాదర్ సెంటిమెంట్ రొటీన్ అయినా... కథకు బాగానే కుదిరింది. ఆ కథకు చక్కటి ముగింపు అది. మానసా శర్మ, మహేష్ ఉప్పాల రైటింగ్... మిగతా టెక్నికల్ టీమ్ వర్క్ బావున్నాయి. 
'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'కి మెయిన్ హీరో తులసి. ఓవర్ ద బోర్డ్ వెళ్లకుండా... తల్లిగా అమాయకపు పాత్రలో అదరగొట్టారు. తులసి తర్వాత సంగీత్ శోభన్ చక్కగా నటించాడు. అతడి డైలాగ్ డెలివరి, యాక్టింగ్ ఆకట్టుకుంటాయి. తులసి, సంగీత్ మధ్య సీన్స్ బావుంటాయి. సీనియ‌ర్ న‌రేష్‌కు ఇటువంటి క్యారెక్టర్లలో నటించడం కేక్ వాక్. ఆయన జీవించారు. కథలో, తెరపై సిమ్రాన్ శర్మ పాత్ర ప్రాముఖ్యం తక్కువే. ఉన్నంతలో ఆమె బాగా చేశారు. ప్రేమ్ సాగర్, గెటప్ శ్రీను, టెంపర్ వంశీ తదితరులు పాత్రలు తగ్గట్టు నటించారు. బామ్మ పాత్రలో నటించిన ప్రమీలా రాణి, ఆవిడ ఫోన్ చేసే సీన్లు కొన్నాళ్లు గుర్తుంటాయి.
ఇంట్లో అమ్మ చేసే పప్పుచారు అంత టేస్టీగా ఉంటుందీ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'. నో మసాలా ఐటమ్స్. క్లీన్ కంటెంట్ ఉంది. మధ్యలో హీరో నోటి వెంట బూతులు వస్తున్నాయని అనుకునేలోపు... డైలాగ్ కట్ చేసి, వేరే పదం చెప్పించారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అందరూ కలిసి చూసే చక్కటి వెబ్ సిరీస్. అందర్నీ నవ్విస్తుంది. చివర్లో చిన్న సందేశం ఇస్తుంది.

Published at : 19 Nov 2021 09:40 AM (IST) Tags: Niharika Konidela VK Naresh Sangeeth Shobhan Tulasi Oka Chinna Family Story Review Oka Chinna Family Story Web Series Review OCFS Review Prameela Rani Mahesh Uppala Manasa Sharma ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రివ్యూ

సంబంధిత కథనాలు

F3 Movie Ticket Prices: టికెట్ రేట్లు పెంచే ప్రసక్తే లేదు - క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

F3 Movie Ticket Prices: టికెట్ రేట్లు పెంచే ప్రసక్తే లేదు - క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?

NBK 107 Movie: ఐటెం సాంగ్ తో బాలయ్య బిజీ - మాసివ్ పిక్ షేర్ చేసిన టీమ్

NBK 107 Movie: ఐటెం సాంగ్ తో బాలయ్య బిజీ - మాసివ్ పిక్ షేర్ చేసిన టీమ్

Son Of India in OTT: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!

Son Of India in OTT: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!

Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !

Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు- 31 ఏళ్ల తర్వాత పెరరివలన్ రిలీజ్

Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు- 31 ఏళ్ల తర్వాత పెరరివలన్ రిలీజ్

AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత

AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం,  ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత

ఊరేగింపులో వరుడు, అతడు వచ్చేసరికి వేరే వ్యక్తిని పెళ్లాడిన వధువు

ఊరేగింపులో వరుడు, అతడు వచ్చేసరికి వేరే వ్యక్తిని పెళ్లాడిన వధువు

Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు అప్‌డేట్- ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్

Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు అప్‌డేట్- ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్