Salman & Rajamouli : సల్మాన్‌తో రాజమౌళి మీటింగ్... సినిమా చేస్తున్నారా? 'ఆర్ఆర్ఆర్'కి ఇన్వైట్ చేశారా?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను రాజమౌళి కలిశారు. ఎందుకు? అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను దర్శక ధీరుడు రాజమౌళి కలిశారు. ఆయన వెంట కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ కూడా ఉన్నారు. సల్మాన్, రాజమౌళి మధ్య మీటింగ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇద్దరూ ఎందుకు కలిశారు? కలిసి ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? లేదంటే త్వరలో 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' విడుదల కానుంది కాబట్టి ఆ సినిమా ప్రచార కార్యక్రమాలకు సల్మాన్ ఖాన్‌ను రాజమౌళి ఇన్వైట్ చేశారా? అనే చర్చ నడుస్తోంది.
సల్మాన్ ఖాన్‌తో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ సినిమా చేశారు. ఇప్పుడు మరో సినిమా ప్లాన్ చేస్తున్నారా? సల్మాన్ హీరోగా నటించిన 'భజరంగీ భాయిజాన్'కు విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఆయన కథల గురించి కండల వీరుడికి తెలుసు. రాజమౌళి దర్శకత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విజయేంద్ర ప్రసాద్ కథతో, రాజమౌళి దర్శకత్వంలో సల్మాన్ ఓ సినిమా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే... గతంలో ఆమిర్ ఖాన్‌ను కూడా రాజమౌళి ఇదే విధంగా కలిశారు. వాళ్లిద్దరి కాంబినేషన్ సినిమా ఇంకా కలగానే ఉంది. సల్మాన్‌తో సినిమా ఖరారు అవుతుందో? లేదో? చూడాలి.
ప్రస్తుతం సల్మాన్ 'టైగర్ 3' సినిమా చేస్తున్నారు. దాని తర్వాత రాజమౌళి సినిమా ఓకే అయితే బావుంటుంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా అనేది చెప్పలేదు. కానీ, మహేష్ బాబుతో ఓ సినిమా చేయాల్సి ఉంది. 'బాహుబలి' తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా జనవరి 7న విడుదల కానున్న సంగతి తెలిసిందే. హిందీ ప్రేక్షకుల్లోనూ ఆ సినిమాపై అంచనాలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్ హీరో సినిమా గురించి మాట్లాడితే ఇంకా బావుంటుంది. సినిమా హైప్ పెరుగుతుంది.
Also Read: అనాగరికం... సాటి మనుషులపై క్రూరత్వం... నీచ సంస్కృతికి దిగజారకండి - వైసీపీ తీరుపై నాగబాబు హాట్ కామెంట్స్
Also Read: రాజును మోకాళ్ల మీద కూర్చోబెట్టారన్న ప్రకాష్ రాజ్... మోడీకి సోనూ సూద్ థాంక్స్
Also Read: చంద్రబాబు కన్నీళ్లు.. ఆర్జీవీ ఇలా వాడేసుకున్నాడు..
Also Read: ఈటెల రాజేందర్‌ది ధర్మ పోరాటం అంటున్న పూనమ్ కౌర్... ఆయన్ను కలిసి!
Also Read: ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో రౌడీ హీరో.. హిట్ అందుకుంటాడా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి