Etela & Poonam Kaur: ఈటెల రాజేందర్‌ది ధర్మ పోరాటం అంటున్న పూనమ్ కౌర్... ఆయన్ను కలిసి!
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ను పూనమ్ కౌర్ కలిశారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈటెల రాజేంద్రర్ ఓ సంచలనం. ప్రస్తుతం తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఆయన బయటకు రావడం, ఆ తర్వాత బీజేపీలో చేరి ఉప ఎన్నికకు వెళ్లడం, హుజురాబాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించడం తెలిసిన విషయాలే. తాజాగా ఆయన్ను నటి పూనమ్ కౌర్ కలిశారు. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
View this post on Instagram
ఇన్‌స్టాగ్రామ్‌లో పూనమ్ కౌర్ చేసిన పోస్టులను గమనిస్తే... గురు నానక్ జయంతి సందర్భంగా ఈటెలను ఆమె కలిశారు. ఏక్ ఓంకార్ ఫొటోను ఈటెల దంపతులకు అందించారు. "అంకిత భావం, చిత్తశుద్ధి, కరుణ గల ప్రజలను బాబా నానక్ ఎల్లప్పుడూ దీవిస్తారు. బాబా నానక్ ను నేనెప్పుడూ చూడలేదు. కానీ, ఆయన ఉన్నట్టు ఫీలయ్యాను. కష్టం వచ్చిన ప్రతిసారీ నా నమ్మకం మరింత బలపడింది" అని పూనమ్ కౌర్ పేర్కొన్నారు. అందులో ఎటువంటి సంచలనం, వివాదాస్పద అంశం ఏదీ లేదు. అయితే... 'ధర్మ పోరాటం ఎప్పుడూ గెలుస్తుంది' అని చేసిన వ్యాఖ్య మాత్రం టీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులకు కాస్త కోపం తెప్పించేదే.
View this post on Instagram
ప్రస్తుతం సినిమాల కంటే ఇతర అంశాలతో పూనమ్ కౌర్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో కూడా పూనమ్ చేసిన ట్వీట్లు హాట్ టాపిక్ అయ్యాయి.
Also Read: రాజును మోకాళ్ల మీద కూర్చోబెట్టారన్న ప్రకాష్ రాజ్... మోడీకి సోనూ సూద్ థాంక్స్
Also Read: చట్టాలు రోడ్లపైకొచ్చిన జనం రూపొందిస్తుంటే.. మనది కూడా జిహాదీ దేశమే, కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు
Also Read: 'జై విఠలాచార్య'... జానపద బ్రహ్మపై పుస్తకం ఫస్ట్ లుక్ విడుదల చేసిన కృష్ణ
Also Read: వారి ఇబ్బందులు నా మనసును కలచివేస్తున్నాయి.. చిరంజీవి ట్వీట్
Also Read: 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' రివ్యూ: పప్పుచారు అంత టేస్టీగా... నవ్విస్తుంది!
Also Read: ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ సాంగ్.. ఎవడ్రా.. ఎవడ్రా నువ్వు.. అస్సలు తగ్గని బన్నీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి