అన్వేషించండి
Advertisement
Vijay Deverakonda: ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో రౌడీ హీరో.. హిట్ అందుకుంటాడా..?
విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమా తరువాత ఎవరితో కలిసి పని చేయనున్నాడనే విషయంపై క్లారిటీ వచ్చింది.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా ఈయనకు అభిమానులు ఉన్నారు. సెలబ్రిటీల్లో సైతం విజయ్ దేవరకొండకి ఫ్యాన్స్ ఉన్నారు. కొందరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు విజయ్ తో కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'లైగర్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే అమెరికాకు వెళ్లింది టీమ్. అక్కడ మైక్ టైసన్, విజయ్ దేవరకొండలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
కొన్ని రోజుల్లో ఈ షెడ్యూల్ ని పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెడతారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడనే విషయంలో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా 'నిన్ను కోరి' ఫేమ్ దర్శకుడు శివ నిర్వాణ పేరు బలంగా వినిపించింది. కానీ ఆయన డైరెక్ట్ చేసిన 'టక్ జగదీష్' సినిమా ఫ్లాప్ అవ్వడంతో విజయ్ తో సినిమా క్యాన్సిల్ అయిందని వార్తలు వచ్చాయి.
కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండ ఈ సినిమాకి సంబంధించిన అగ్రిమెంట్ పై సైన్ చేసినట్లు సమాచారం. అమెరికాకు వెళ్లడానికి ముందు విజయ్.. శివ నిర్వాణ ఫైనల్ డ్రాఫ్ట్ ను విన్నాడట. అది నచ్చడంతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.
Also Read: బాలయ్యతో రొమాన్స్.. ఛాన్స్ లేదంటున్న శృతి..
Also Read: నాగ్ పంచ్‌కు చైతూ కౌంటర్.. ‘లేడిస్ ఫస్ట్’ అంటూ కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!
Also Read: అరె ఏంట్రా టార్చర్... ఆడండ్రా..జనాలతో ఆడుకోకండ్రా...
Also Read: వారి ఇబ్బందులు నా మనసును కలచివేస్తున్నాయి.. చిరంజీవి ట్వీట్
Also Read: ‘3 రోజెస్’లో మంచు లక్ష్మికి పంచ్.. నేటి నుంచి అన్ని ఎపిసోడ్స్.. ఇదిగో ట్రైలర్!
Also Read: ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ సాంగ్.. ఎవడ్రా.. ఎవడ్రా నువ్వు.. అస్సలు తగ్గని బన్నీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion