Shruti Haasan: బాలయ్య సినిమాకి శృతి ఎంత అడిగిందో తెలుసా..?
బాలయ్య సినిమా ఒప్పుకునే ముందు శృతిహాసన్ కొన్ని షరతులు పెట్టిందట. అవేంటంటే.. రెమ్యునరేషన్ గా రెండు కోట్లు డిమాండ్ చేసింది.
నందమూరి బాలకృష్ణ హీరో దర్శకుడు గోపీచంద్ మలినేని ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరిగాయి. హీరోగా బాలకృష్ణకు 107వ సినిమా ఇది. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ ను ఎంపిక చేసుకున్నారు. నిజానికి ఆమె కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంది. ప్రభాస్ తో 'సలార్' సినిమా చేస్తోంది. ఇలాంటి సమయంలో ఆమె సీనియర్ హీరో బాలయ్యకు జోడీగా నటించడానికి ఒప్పుకొని షాకిచ్చింది. అయితే దానికి కారణం దర్శకుడు గోపీచంద్ మలినేని అని తెలుస్తోంది.
Also Read: 'బంగార్రాజు'తో మాస్ స్టెప్పులు.. 'జాతిరత్నాలు' బ్యూటీకి క్రేజీ ఛాన్స్..
ఇంతకు ముందు ఆయన తెరకెక్కిన 'బలుపు', 'క్రాక్' సినిమాల్లో శృతి హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు మరోసారి తన సినిమాలో నటించమని అడగడంతో శృతి కాదనలేకపోయింది. కానీ ఈ సినిమా ఒప్పుకునే ముందు ఆమె ఒక కండీషన్ పెట్టిందట. అదేంటంటే.. రెమ్యునరేషన్ గా రెండు కోట్లు డిమాండ్ చేసింది. ఆమె అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకోవడంతో ఆమె అగ్రిమెంట్ పై సైన్ చేసిందని తెలుస్తోంది.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. వందేళ్ల కాలం నుంచి వేటపాలెంకు సంబంధించిన వార్తా పత్రికలన్నీ తిరగేసి ఈ సినిమా కథను సిద్ధం చేసుకున్నారు దర్శకుడు గోపీచంద్. కథ ప్రకారం.. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్‌గా, ఫ్యాక్షనిస్ట్ గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి 'జై బాలయ్య' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read: నాగ్ పంచ్‌కు చైతూ కౌంటర్.. ‘లేడిస్ ఫస్ట్’ అంటూ కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!
Also Read: అరె ఏంట్రా టార్చర్... ఆడండ్రా..జనాలతో ఆడుకోకండ్రా...
Also Read: వారి ఇబ్బందులు నా మనసును కలచివేస్తున్నాయి.. చిరంజీవి ట్వీట్
Also Read: ‘3 రోజెస్’లో మంచు లక్ష్మికి పంచ్.. నేటి నుంచి అన్ని ఎపిసోడ్స్.. ఇదిగో ట్రైలర్!
Also Read: ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ సాంగ్.. ఎవడ్రా.. ఎవడ్రా నువ్వు.. అస్సలు తగ్గని బన్నీ
Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి