News
News
X

3 Roses: ‘3 రోజెస్’లో మంచు లక్ష్మికి పంచ్.. నేటి నుంచి అన్ని ఎపిసోడ్స్.. ఇదిగో ట్రైలర్!

‘3 రోజెస్’లో ఇప్పటి వరకు నాలుగు ఎపిసోడ్స్ మాత్రమే స్ట్రీమింగ్ అయ్యాయి. ఈ రోజు నుంచి మిగతా ఎపిసోడ్స్ కూడా టెలికాస్ట్ కానున్నట్లు ‘ఆహ’ ప్రకటించింది.

FOLLOW US: 
 
షా రెబ్బా, పాయల్ రాజ్‌పుత్, పూర్ణ కీలక పాత్రల్లో నటించిన ‘3 రోజెస్’ వెబ్‌‌సీరిస్ ఇటీవలే ‘ఆహా’లో రిలీజ్ అయ్యింది. అయితే, కేవలం నాలుగు ఎపిసోడ్స్ మాత్రమే టెలికాస్ట్ చేశారు. ఈ రోజు (నవంబరు 19) నుంచి మిగతా ఎపిసోడ్స్‌ ప్రసారమవుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఆహా’ మరో ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ వెబ్ సీరిస్‌లో నటిస్తున్న ఇషా, పాయల్, పూర్ణలు చాలా బోల్డ్‌గా కనిపించడమే కాదు.. వారి మాటలు కూడా చాలా బోల్డ్‌గా ఉన్నాయి. ప్రేమ.. పెళ్లి.. మోహంలో ఏది సరైన దారో తెలియక తికతికమక పడుతున్న ఈ ముగ్గురు భామలు నేటి సమజాన్ని పచ్చి బూతులతో తిట్టేస్తున్నారు. ఇప్పటివరకు ప్రసారమైన ఎపిసోడ్స్‌లో ఇషా రెబ్బాకు వైవా హర్షాతో పెళ్లి కుదరడం.. పాయల్ రాజ్‌పుత్ పెళ్లి చూపుల్లో ప్రేమించిన వ్యక్తి చేతిలో మోసపోవడం.. పూర్ణ పెళ్లి కోసం ఆరాపడటం వంటి సీన్లతో వారి పాత్రలను మాత్రమే పరిచయం చేశారు. దీంతో అసలు కథ ఇంకా మొదలు కాలేదనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో ఉంది. ఈ నేపథ్యంలో తర్వాతి ఎపిసోడ్స్‌లో విషయంలోకి వెళ్తారని ఎదురు చూస్తున్నారు. 

News Reels

ఇప్పుడు ప్రసారం కాబోయే ఎపిసోడ్స్ మరింత వినోదాత్మకంగా ఉంటాయనిపిస్తోంది. వైవా హర్షాతో ఇషా పడే పాట్లు.. పాయల్, ప్రిన్స్ రొమాన్స్.. పూర్ణ వరుడి వేట.. ఇలా బోలెడంత వినోదాన్ని అందించినున్నట్లు ఈ ట్రైలర్ వీడియో ద్వారా తెలుస్తోంది. చివర్లో ఇషా ‘రివేంజ్’ పదాన్ని ‘ఆర్ షుడ్ బీ రోల్’ అంటూ మంచు లక్ష్మికి పంచ్‌లా వాడేశారు. ‘మారుతీ షో’ పేరుతో దర్శకుడు మారుతీ సమర్పిస్తున్న ‘3 రోజెస్’కు మగ్గీ దర్శకత్వం వహించారు. నిర్మాత ఎస్‌కేఎన్. సన్నీ ఎం.ఆర్. సంగీతం సమకూర్చారు. ఈ వెబ్‌సీరిస్ ఈ నెల (నవంబరు) 12 నుంచి స్ట్రీమింగ్  అవుతోంది.  

‘3 రోజెస్’ ఆల్ ఎపిసోడ్స్ వీడియోను ఇక్కడ చూడండి:

Also Read: నాగ్ పంచ్‌కు చైతూ కౌంటర్.. ‘లేడిస్ ఫస్ట్’ అంటూ కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!

Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 19 Nov 2021 01:01 PM (IST) Tags: Eesha Rebba Payal rajput 3 roses 3 Roses in Aha Purnaa 3 రోజెస్ పాయల్ రాజ్‌పుత్ 3 Roses All Episodes

సంబంధిత కథనాలు

SDT 15 Title : కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్న సాయి తేజ్ - థ్రిల్లర్ వరల్డ్ టైటిల్ రెడీ 

SDT 15 Title : కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్న సాయి తేజ్ - థ్రిల్లర్ వరల్డ్ టైటిల్ రెడీ 

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Baba New Trailer: రజినీకాంత్ ‘బాబా’ మూవీ రి-రిలీజ్, కొత్త ట్రైలర్ చూశారా?

Baba New Trailer: రజినీకాంత్ ‘బాబా’ మూవీ రి-రిలీజ్, కొత్త ట్రైలర్ చూశారా?

Keerthy Suresh New Movie : కీర్తి సురేష్‌తో 'కేజీఎఫ్', 'కాంతార' నిర్మాత సినిమా - 'రఘు తాత'

Keerthy Suresh New Movie : కీర్తి సురేష్‌తో 'కేజీఎఫ్', 'కాంతార' నిర్మాత సినిమా - 'రఘు తాత'

Pawan Kalyan Next Movie : పవన్‌తో హరీష్ శంకర్ సినిమా ఆగలేదు - వచ్చే వారమే పూజ, సంక్రాంతి తర్వాత

Pawan Kalyan Next Movie : పవన్‌తో హరీష్ శంకర్ సినిమా ఆగలేదు - వచ్చే వారమే పూజ, సంక్రాంతి తర్వాత

టాప్ స్టోరీస్

Minister Jogi Ramesh: చంద్రబాబు, లోకేష్ కూడా జైలుకి పోవటం ఖాయం: మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh: చంద్రబాబు, లోకేష్ కూడా జైలుకి పోవటం ఖాయం: మంత్రి జోగి రమేష్

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

YS Sharmila: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గూండాల నుంచి ప్రాణహాని ఉందంటూ షర్మిల సంచలన ఆరోపణలు

YS Sharmila: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గూండాల నుంచి ప్రాణహాని ఉందంటూ షర్మిల సంచలన ఆరోపణలు

Hyderabad Trail Fest: ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకీ అడవిలో దివ్యాంగుల ట్రయల్ ఫెస్ట్

Hyderabad Trail Fest: ప్రపంచంలోనే అతిపెద్ద మియావాకీ అడవిలో దివ్యాంగుల ట్రయల్ ఫెస్ట్