Bigg Boss 5 Telugu: అరె ఏంట్రా టార్చర్... ఆడండ్రా..జనాలతో ఆడుకోకండ్రా...
ఓ మై ఫ్రెండ్ అని మొదలెట్టారు. కలసి నడుద్దాం అని డిసైడ్ చేసుకున్నారు. ఇప్పుడేమో అంతకుమించి అనేలా తయారయ్యారు. ఇంకా చెప్పాలంటే వారి ప్రవర్తన చూడలేకపోతున్నారు.
చూపులు హగ్గుల వరకూ వెళ్లాయి...ఇప్పుడు హద్దులు దాటి ముద్దుల వరకూ వెళ్లింది. చూస్తుంటే పరిస్థితి ఇంకా శ్రుతిమించేట్టే ఉంది. రోజు రోజుకీ బిగ్ బాస్ హౌజ్ లో సిరి-షణ్ముక్ ని చూసి ప్రేక్షకులు విసిగిపోతున్నారు. వాళ్లు స్నేహితులో, ప్రేమికులో, పరిచయస్తులో, శత్రువులో లేదా అంతకుమించో అనేది అర్థంకావడం లేదు. అప్పుడే వాదించుకుంటారు, అంతలో అలుగుతారు, మళ్లీ ఒకర్నొకరు పట్టుకుని ఏడుస్తారు, ఓదార్చుకుంటారు. ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో, అసలేంటో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు ప్రేక్షకులు. ఆమె గేమ్ ఆమెని ఆడనివ్వడు, షణ్ను ఆడడు. సిరి ఎవ్వరితోనైనా నవ్వుతూ మాట్లాడితే భరించలేడు. పోనీ తనైనా నవ్వుతాడా అంటే ఎప్పుడూ ముఖం ముడుచుకునే ఉంటాడు. ముఖ్యంగా స్క్రీన్ పై వీళ్లని చూడగానే ఏంట్రా ఈ టార్చర్ అంటున్నారు.
వారం వారం ఇంటినుంచి వెళ్లిపోతున్న సభ్యులంతా వీళ్లిద్దరూ కలసి ఆడుతున్నారని అంటుంటే షణ్ను-సిరి ఫైరైపోయారు. ఒకరికో ఇద్దరికో ఈ ఫీలింగ్ వచ్చిందంటే సరే అనుకోవచ్చు కానీ ఇంటి సభ్యులది, ప్రేక్షకులదీ సేమ్ ఫీలింగ్. నాలుగైదు వారాలుగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. కారణం లేకుండా మాట్లాడుకోవడం మానేస్తారు. నేనేం చేశా నేనేం చేశా అని డిస్కషన్ పెట్టుకుంటారు. అలకలు పీక్స్ కి చేరి రెండు రోజుల క్రితం బాత్ రూమ్ లోకి వెళ్లి తలుపేసేసుకుని హడావుడి చేసింది సిరి. అంతలోనే మళ్లీ ఓదార్పు మొదలెడతారు. హగ్గులు, బుగ్గపై ముద్దుల పరిధి దాటి ఏకంగా లిప్ లాక్ ఇచ్చుకున్నారా అని ప్రేక్షకులకు అనిపించడంతో వామ్మో ఏందీ గోల అంటున్నారు. సింగిల్ గా ఆడదాం అని, ఒకే బెడ్ పై పడుకోవద్దని షణ్ను చెబితే చాలు సిరి హర్టైపోతోంది. పోనీ ఇద్దరి మధ్యా ఎవరైనా ఇన్వాల్స్ అయి పంచాయితీ సెటిల్ చేద్దాం అనుకుంటే ఆ ఛాన్స్ కూడా ఇవ్వరు. ఎట్టకేలకు హౌస్ లో అమ్మలక్క, నారదుడు అని బిరుదులు అందుకున్న రవి ఈ విషయంపై ఇద్దరితో మాట్లాడాడు. అప్పుడు కూడా క్లారిటీ ఇవ్వాల్సింది పోయి మరింత కన్ఫ్యూజన్లో పడేశారు. బయట ఇద్దరం వేర్వేరు రిలేషన్లలో ఉన్నాం కానీ ఇప్పుడు ఏమోషనల్ గా కనెక్ట్ అయిపోతున్నాం అన్నాడు. అటు సిరి కూడా ఇదే విషయంపై అడిగితే ఓ నవ్వు నవ్వి ఊరుకుంది. దీంతో అరె ఏంట్రా ఇది అంటున్నారు బిగ్ బాస్ అభిమానులు. ఇద్దరిలో ఒకరు బయటకు వెళ్లిపోతే కానీ హౌస్ లో ఆట బాగుపడేట్టు లేదంటున్నారు.
Also Read: ‘3 రోజెస్’లో మంచు లక్ష్మికి పంచ్.. నేటి నుంచి అన్ని ఎపిసోడ్స్.. ఇదిగో ట్రైలర్!
Also Read: ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ సాంగ్.. ఎవడ్రా.. ఎవడ్రా నువ్వు.. అస్సలు తగ్గని బన్నీ
Also Read: ఆహా... బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్'కు గెస్ట్‌గా ఆ స్టార్ హీరో!
Also Read: షన్నుకు సిరి లిప్ లాక్? వీళ్ల రిలేషన్ ఎక్కడికెళ్తోంది బిగ్‌బాస్? అసలు ఏం జరిగిందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి