Laal Singh Chaddha: బాలీవుడ్‌కు నాగచైతన్య పరిచయమయ్యేది ఆ రోజే... లాల్ సింగ్ చద్దా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది!
'లాల్ సింగ్ చద్దా' సినిమాతో అక్కినేని నాగచైతన్య హిందీ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఎప్పుడు విడుదల కానుందంటే...
ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న హిందీ సినిమా 'లాల్ సింగ్ చద్దా'. హాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్ ఇది. భారతీయ నేటివిటీకి తగ్గట్టు కథలో మార్పులు చేశారు. లుక్ పరంగా ఆమిర్ ఖాన్ డిఫరెన్స్ చూపించారు. ఈ సినిమాలో కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్. టాలీవుడ్ హీరో, అక్కినేని వారసుడు నాగచైతన్య ఈ సినిమాతో హిందీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్న సంగతి తెలిసిందే. 'లాలా సింగ్ చద్దా'లో ఆయన ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.
We are happy to share our new poster and our new release date :) #LaalSinghOnBaisakhi#AamirKhan #KareenaKapoorKhan #AdvaitChandan @atul_kulkarni @ipritamofficial @OfficialAMITABH #KiranRao @Viacom18Studios @chay_akkineni #MonaSingh #ManavVij #SatyajitPande #HemantiSarkar pic.twitter.com/VOz3RBjHZz
— Aamir Khan Productions (@AKPPL_Official) November 20, 2021
అన్నీ కుదిరితే ఈపాటికి 'లాలా సింగ్ చద్దా' ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కరోనా వల్ల తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో గత ఏడాది విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. ఆ తర్వాత ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ఆ తేదీకి కూడా రావడం కుదరని చెప్పారు. ఇప్పుడు వచ్చే ఏడాది వైశాఖి పండగ సందర్భంగా ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. పంజాబ్ రాష్ట్రంలో ప్రజలు వైశాఖిని ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటారు. సినిమాలో ఆమిర్ ఖాన్ కూడా సింగ్ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు వయాకామ్ 18 స్టూడియోస్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.
తెలుగుకు వస్తే... నాగచైతన్య 'థాంక్యూ', 'బంగార్రాజు' సినిమాలు చేస్తున్నారు. 'మనం' తర్వాత మరోసారి విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమా 'థాంక్యూ'. ఈ సినిమా కాకుండా మరో వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. 'బంగార్రాజు'లో తండ్రి నాగార్జునతో కలిసి నటిస్తున్నారు.
Also Read: సల్మాన్‌తో రాజమౌళి మీటింగ్... సినిమా చేస్తున్నారా? 'ఆర్ఆర్ఆర్'కి ఇన్వైట్ చేశారా?
Also Read: అనాగరికం... సాటి మనుషులపై క్రూరత్వం... నీచ సంస్కృతికి దిగజారకండి - వైసీపీ తీరుపై నాగబాబు హాట్ కామెంట్స్
Also Read: రాజును మోకాళ్ల మీద కూర్చోబెట్టారన్న ప్రకాష్ రాజ్... మోడీకి సోనూ సూద్ థాంక్స్
Also Read: ఈటెల రాజేందర్‌ది ధర్మ పోరాటం అంటున్న పూనమ్ కౌర్... ఆయన్ను కలిసి!
Also Read: ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తో రౌడీ హీరో.. హిట్ అందుకుంటాడా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి