Naga Chaitanya: 'నా జీవితానికి ఇదే గ్రీన్ సిగ్నల్..' చైతు పోస్ట్ వైరల్..
సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని.. చైతు తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
టాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అక్కినేని నాగచైతన్య. వివాహబంధం నుంచి విడిపోయిన తరువాత చైతు సినిమాల జోరు పెంచారు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే 'లవ్ స్టోరీ' సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న నాగచైతన్య నాలుగైదు సినిమాలు లైన్లో పెట్టారు. ఓ పక్క సమంత 'మామ్ సెడ్' అంటూ పలు రకాల కొటేషన్స్ పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంటే.. చైతు మాత్రం బ్రేకప్ తరువాత సైలెంట్ అయిపోయారు.
Also Read: హౌస్ మేట్స్ కి షాక్ ఇవ్వనున్న బిగ్ బాస్.. డబుల్ ఎలిమినేషన్ తప్పదా..?
సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని.. చైతు తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్న చైతు.. మాథ్యూ మాక్కోనాగై అనే రచయిత రాసిన 'గ్రీన్ లైట్స్' పుస్తకాన్ని చదివాడు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన చైతు.. 'జీవితానికి ఇదొక ప్రేమలేఖ.. మీ ప్రయాణాన్ని పంచుకున్నందుకు మాథ్యూకి కృతజ్ఞతలు. ఈ పుస్తకం నా జీవితానికి ఒక గ్రీన్ సిగ్నల్ లాంటిది' అంటూ రాసుకొచ్చారు.
దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైతు చేసిన ఈ పోస్ట్ కి అర్ధం ఏంటనే దానిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం చైతు 'థాంక్యూ', 'బంగార్రాజు' అనే సినిమాల్లో నటిస్తున్నాడు. అలానే బాలీవుడ్ లో కూడా ఓ సినిమాలో నటిస్తున్నాడు. వీటితో పాటు అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న ఓ వెబ్ సిరీస్ లో కూడా చైతు నటిస్తున్నారు.
View this post on Instagram
Also Read: హాస్పిటల్ లో సీనియర్ నటుడు.. పరిస్థితి విషమం..
Also Read: సల్మాన్‌తో రాజమౌళి మీటింగ్... సినిమా చేస్తున్నారా? 'ఆర్ఆర్ఆర్'కి ఇన్వైట్ చేశారా?
Also Read: బాలీవుడ్‌కు నాగచైతన్య పరిచయమయ్యేది ఆ రోజే... లాల్ సింగ్ చద్దా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి