అన్వేషించండి

Bigg Boss 5 Telugu: షణ్నుతో ఆ ఫీలింగ్‌ తప్పని తెలిసినా చేస్తున్నా.. ప్రియాంక వీడియో చూపించి మానస్‌కు షాకిచ్చిన నాగ్

ఫైర్ ఇంజన్ లో ఉన్న మానస్-కాజల్ ఒక మాట మీదకు రాకపోవడంతో సిరి-యానీ ఇద్దరి ఫొటోలను కాల్చేశారు. ఫైనల్ గా సన్నీ ఫొటో మాత్రమే మిగిలి ఉండడంతో అతడికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ దొరికింది. 

నిన్న బిగ్ బాస్ ఇచ్చిన 'నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా..' టాస్క్ ఈరోజు కంటిన్యూ అయింది. ఫైర్ ఇంజన్ లో ఉన్న మానస్-కాజల్ ఒక మాట మీదకు రాకపోవడంతో సిరి-యానీ ఇద్దరి ఫొటోలను కాల్చేశారు. ఫైనల్ గా సన్నీ ఫొటో మాత్రమే మిగిలి ఉండడంతో అతడికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ దొరికింది. 

'నీ మాట విని మోసపోయా..' అంటూ ప్రియాంకపై అరిచింది యానీ మాస్టర్. 'తొండి గేమ్ ఆడారంటూ..' ఓ రేంజ్ లో మండిపడింది. 
ఇప్పుడు ఆడోళ్లను అడ్డం పెట్టుకొని ఎవర్రా గేమ్ ఆడుతున్నారని షణ్ముఖ్-సిరిలతో అన్నాడు రవి. ఆ తరువాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ సన్నీకి వచ్చిందని బిగ్ బాస్ అనౌన్స్ చేయగానే.. రవి వెళ్లి సన్నీని హగ్ చేసుకున్నాడు. అందరూ భయం, భయంగా ఆడుతున్నారని.. ఎప్పుడు వెళ్లిపోతామో అని అందరూ టెన్షన్ పడుతున్నారని మానస్ అండ్ కో ని ఉద్దేశిస్తూ.. షణ్ముఖ్ తన బ్యాచ్ తో చెప్పాడు.

గోల్డ్ అండ్ కోల్.. 

ఆ తరువాత హౌస్ మేట్స్ మాట్లాడిన నాగార్జున రవికి ఒక టాస్క్ ఇచ్చారు. 'బాగా ఆడినవారికి గోల్డ్ ఇవ్వాలి.. వరస్ట్ పెర్ఫార్మన్స్ కి కోల్ ఇవ్వాలి.. ఎందుకో చెప్పాలని' సూచించారు. ముందుగా రవి.. ప్రియాంకకు గోల్డ్ ఇచ్చాడు. కోల్ ని సన్నీకి ఇచ్చాడు. 'స్విమ్మింగ్ టాస్క్ లో నువ్ సన్నీ మీద పగ తీర్చుకున్నావా..?' అని రవిని ప్రశ్నించారు నాగార్జున. 'లేదు సార్.. ఐ వజ్ వెరీ ఓపెన్ అండ్ క్లియర్' అని చెప్పాడు రవి. 'ఏ విధంగా ఓపెన్' అని అడిగారు నాగ్. దానికి రవి.. 'నేను సరిగ్గా సరిగ్గా సరిగ్గా అని చెప్తూనే ఉన్నాను. టీషర్ట్ సరిగ్గా వేసుకోవాలని' అని అనగా.. 'నువ్ ముందే చెప్పి ఉంటే బాగుండేది కదా' అని అన్నారు నాగ్. ఆ తరువాత సన్నీ.. రూల్ బుక్ లో పూర్తిగా అని ఉందని.. సరిగ్గా అని లేదని అనగా.. 'మరి మానస్ మొదటి నుంచి ఎలా కరెక్ట్ గా వేసుకున్నాడు..?' అని నాగ్ ప్రశ్నించారు. దానికి సన్నీ సైలెంట్ గా ఉండిపోయాడు. కరెక్ట్ గా ఆడాలని చెబుతూనే.. సన్నీ ఆట తీరుని పొగిడారు నాగార్జున. 

ఆ తరువాత కాజల్ కి కోల్ ఇస్తూ.. గేమ్ లో సైలెంట్ అయిపోయిందని రవి అన్నాడు. దానికి నాగార్జున.. కాజల్ ని ఆటపట్టించారు. యానీ మాస్టర్ కి గోల్డ్ ఇస్తూ.. 'గేమ్ లో చాలా బాగా ఆడిందని.. కష్టపడిందని.. ఫైటింగ్ స్పిరిట్ చూపించిందని' చెప్పుకొచ్చాడు. షణ్ముఖ్ కి కోల్ ఇచ్చి.. 'అయోమయం' అని కామెంట్ చేశాడు రవి. శ్రీరామ్ కి గోల్డ్ ఇస్తూ.. 'సెల్ఫ్ లెస్ పర్సన్' అని రవి చెప్పగా.. పవర్ టూల్ గేమ్ బాగా ఆడావని.. అది చదువుకున్న తరువాత రవి ఎక్స్ ప్రెషన్ ప్రైస్ లెస్ అని శ్రీరామ్ తో అన్నారు నాగార్జున. రవికి ఇంతకముందు రకరకాల పేర్లు పెట్టారని.. అవన్నీ తీసేసి 'బకరా' రవి అని పేరు పెట్టారు నాగార్జున. 

తప్పని తెలిసినా.. చేస్తున్నా.. 

ఆ తరువాత సిరికి క్లాస్ పీకారు. 'నిన్ను నువ్ హర్ట్ చేసుకుంటున్నావా..? ఇలాంటి పరిస్థితి హౌస్ లో అవసరమా..? ఎందుకు చేశావ్..? ఏం జరుగుతుంది..?' అంటూ నాగార్జున సిరిని ప్రశ్నించారు. 

దానికి ఆమె 'ఏమో సార్ నాక్కూడా క్లారిటీ లేదు' అని చెప్పగా.. 'కోట్ల మంది నిన్ను చూసి ఎలా ఉండాలో నేర్చుకోవాలి. అయ్యో ఇలా ఉండకూడదని అనుకోకూడదు కదా..' అని నాగ్ అనగా.. 'నా స్టోరీ నాకు తెలుసు.. బయట నేనేంటి అనేది నాకు తెలుసు. అయినా ఎందుకో కనెక్షన్ వస్తుంది.. నాకు తెలియట్లేదు. ఇది తప్పా రైటా..? అని కూడా తెలియడం లేదు. తప్పు అని తెలిసినా నాకు అనిపించిందని చేస్తున్నా..' అని చెప్పింది. తల మీద కొట్టుకోవడం, బాదుకోవడం వంటివి చేస్తే హౌస్ నుంచి పంపిచేస్తా అని.. అలా చేయనని ప్రామిస్ చేయమని అడిగారు నాగార్జున. 

ఆ తరువాత షణ్ముఖ్ తో మాట్లాడుతూ.. 'అసలేం జరుగుతుందని' ప్రశ్నించారు నాగ్. దానికి షణ్ముఖ్.. 'మెంటల్ గా బాగా వీక్ అయిపోయా సార్' అని చెప్పాడు. వెంటనే నాగ్.. 'అంత మిస్ అవుతున్నావా దీప్తిని..?' అని అడిగారు. చాలా మిస్ అవుతున్నానని చెప్పాడు షణ్ముఖ్. ఆ తరువాత బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ చేయమని చెప్పిన నాగ్.. 'నీ కోసం గేట్స్ ఓపెన్ అయ్యాయి.. దీప్తిని మిస్ అవుతుంటే ఈ క్షణమే వెళ్లిపో' అని షాకిచ్చారు నాగ్. 'ఇంకెప్పుడు ఇది రిపీట్ చేయనని' చెప్పాడు నాగార్జున. 

షాక్ లో మానస్.. 

మానస్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన నాగార్జున.. ప్రియాంక గురించి మాట్లాడారు. తన మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుందని.. ఎక్కువ ఫీలింగ్స్ పెంచుకుంటుందని మానస్ చెప్పాడు. ఏమైనా చెప్తే.. రాంగ్ డెసిషన్ ఏమైనా తీసుకుంటుందేమో.. ఫిజికల్ గా ఏమైనా చేసుకుంటుందేమో అని భయం ఉందని మానస్ చెప్పాడు. అయితే మానస్ మీద ప్రియాంక ఎలాంటి ఫీలింగ్స్ పెంచుకుందో ఓ వీడియోను చూపించారు నాగార్జున. అందులో ప్రియాంక.. మానస్ గురించి కాజల్ కి చెప్తూ ఎమోషనల్ అయింది. ఇష్టం ఉంటే మానస్ అనే మాటలన్నీ పడాలా అంటూ ఏడ్చేసింది. ఆ వీడియో చూసాక మానస్ సైలెంట్ అయిపోయాడు. ఆట బాగానే ఆడుతున్నావ్.. ఈ పరిస్థితిని కూడా హ్యాండిల్ చేసుకుంటావ్ అని అనుకుంటున్నా అంటూ చెప్పారు నాగార్జున. 

ఆ తరువాత యానీ మాస్టర్ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి.. కాజల్ విషయంలో లైన్ క్రాస్ అవుతున్నావ్ అని చెప్పారు నాగార్జున. కంట్రోల్ చేసుకుంటానని యానీ చెప్పింది. 

శ్రీరామచంద్ర సేఫ్..

నామినేషన్ లో ఉన్న ఎనిమిది మందికి కొన్ని ఎన్విలాప్స్ ఇచ్చి అందులో ఏముందో చదవమని చెప్పారు. వాటిల్లో శ్రీరామచంద్రకి సేఫ్ అని వచ్చింది. 

సన్నీ సేఫ్.. 

ఆ నామినేషన్ లో ఉన్న ఏడుగురిని నిలబడమని చెప్పిన నాగార్జున.. వారి ముందు సూట్ కేస్ పెట్టారు. అందులో షర్ట్ ఉంటుందని.. దానిపై సేవ్ అయ్యేవారి ఫోటో ఉంటుందని చెప్పారు. అది ఓపెన్ చేయగా.. దానిపై సన్నీ ఫోటో ఉంది. దీంతో అతడు సేవ్ అయ్యాడు. 

Also Read: హాస్పిటల్ లో సీనియర్ నటుడు.. పరిస్థితి విషమం..

Also Read: 'నా జీవితానికి ఇదే గ్రీన్ సిగ్నల్..' చైతు పోస్ట్ వైరల్..

Also Read: అరె ఏంట్రా టార్చర్... ఆడండ్రా..జనాలతో ఆడుకోకండ్రా...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget