Top Selling Hatchback: నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
నవంబర్ 2025లో మారుతి సుజుకి స్విఫ్ట్ అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్ బ్యాక్ కారు. మారుతి వాగన్ఆర్ అమ్మకాలు కూడా పెరిగాయి. హ్యుందాయ్ టాటా టియాగో అమ్మకాలను చూద్దాం.

భారతదేశంలో హ్యాచ్‌బ్యాక్ కార్లకు డిమాండ్ ఇంకా కొనసాగుతోంది. SUVలు, సెడాన్‌ల మధ్య బడ్జెట్ ధర కారును కోరుకునే వారికి, హ్యాచ్‌బ్యాక్‌లు ఉత్తమ ఎంపికగా పరిగణిస్తారు. కారు వెనుక భాగంలో పైకి తెరుచుకునే పెద్ద డోర్ (హ్యాచ్) ఉండే కారు హ్యాచ్‌బ్యాక్ అంటానేజ దాని బాడీ స్టైల్, ఇది ప్రయాణీకుల కంపార్ట్‌మెంట్‌ను కార్గో స్పేస్‌తో కలుపుతుంది. దాంతో లగేజీ పెట్టె (boot) నుండి వేరుగా ఉంటుంది. వీటిలో ఎక్కువ సౌకర్యవంతమైన లోడింగ్ స్పేస్ ఉంటుంది నగరంలో నడపడానికి సులభంగా ఉండటం, మంచి మైలేజ్ ఇవ్వడం, తక్కువ నిర్వహణ ఖర్చుల కారణంగా ఈ కార్లు అందరు కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. నవంబర్ 2025లో కూడా హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మంచి అమ్మకాలు నమోదయ్యాయి. మారుతి స్విఫ్ట్ నుంచి టాటా టియాగో వరకు అమ్మకాల నివేదికలను పరిశీలిద్దాం.
హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచిన మారుతి స్విఫ్ట్ నంబర్-1
నవంబర్ 2025లో మారుతి సుజుకి స్విఫ్ట్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన హ్యాచ్‌బ్యాక్ కారుగా నిలిచింది. ఈ నెలలో మొత్తం 19,733 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం నవంబర్ 2024తో పోలిస్తే, ఈ అమ్మకాలు సుమారు 34 శాతం పెరిగాయి. మంచి మైలేజ్, స్టైలిష్ లుక్, నమ్మకమైన పనితీరు కారణంగా స్విఫ్ట్ యువతతో పాటు ఫ్యామిలీ జర్నీ కోరుకునే వారికి సైతం ఇష్టమైనదిగా మారింది.
వాగన్ఆర్ అమ్మకాలలో నిరంతర వృద్ధి
రెండవ స్థానంలో మారుతి సుజుకి చెందిన వాగన్ఆర్ నిలిచింది. నవంబర్‌లో వాగన్ ఆర్ 14,619 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఇందులో దాదాపు 5 శాతం వృద్ధి కనిపించింది. ఎక్కువ హెడ్‌రూమ్, సౌకర్యవంతమైన సీటింగ్, తక్కువ ఖర్చు కారణంగా వాగన్ఆర్ మధ్యతరగతి కుటుంబాలలో బాగా ప్రాచుర్యం పొందింది.
బలేనో అమ్మకాలలో స్వల్ప తగ్గుదల
మారుతి సుజుకి బలేనో ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. నవంబర్ 2025లో మారుతి బలెనో 13,784 యూనిట్లు అమ్ముడయ్యాయి. తొలి మూడు స్థానాల్లో మారుతి కంపెనీకి చెందిన హ్యాచ్ బ్యాక్‌లే ఉన్నాయి. అయితే గత సంవత్సరంతో పోలిస్తే మారుతి బలెనో అమ్మకాలు సుమారు 15 శాతం తగ్గాయి. అయినప్పటికీ, దీని ప్రీమియం లుక్, సౌకర్యవంతమైన డ్రైవ్ బలెనోను కస్టమర్లకు ఇష్టమైనదిగా మార్చాయి.
ఆల్టో, టియాగో బలమైన పట్టు
మారుతి సుజుకి ఆల్టో అమ్మకాలలో అద్భుతమైన పెరుగుదల కనిపించింది. నవంబర్ 2025లో దీని 10,600 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరం కంటే సుమారు 42 శాతం ఎక్కువ. మరోవైపు, టాటా టియాగోకు 5,988 కొత్త కస్టమర్లు లభించారు. దీని అమ్మకాలు 13 శాతం పెరిగాయి. వీటితో పాటు టయోటా గ్లాంజా, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్, హ్యుందాయ్ i20, టాటా ఆల్ట్రోజ్, మారుతి ఇగ్నిస్ అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి.






















