అన్వేషించండి

170hp పవర్‌తో Tata Harrier, Safari పెట్రోల్‌ వేరియంట్లు ఎంట్రీ - కొత్త ఫీచర్లతో అల్లాడిస్తున్నాయిగా!

టాటా మోటార్స్‌.. హారియర్‌, సఫారి పెట్రోల్‌ వెర్షన్ల స్పెసిఫికేషన్స్‌, వేరియంట్లను వెల్లడించింది. 170hp ఇంజిన్‌, కొత్త అల్ట్రా ట్రిమ్స్‌, అదనపు ఫీచర్ల పూర్తి వివరాలు తెలుసుకోండి.

Tata SUV petrol variants: మన SUV మార్కెట్‌లో తమదైన గుర్తింపు సంపాదించుకున్న టాటా హారియర్‌, టాటా సఫారి.. ఇప్పుడు మరో కీలక అడుగు వేసాయి. ఇప్పటివరకు డీజిల్‌ ఇంజిన్‌తో మాత్రమే లభించిన ఈ రెండు SUVలను పెట్రోల్‌ ఇంజిన్‌ ఆప్షన్‌లో కూడా అందించనున్నట్లు టాటా మోటార్స్‌ అధికారికంగా వెల్లడించింది. ఈ పెట్రోల్‌ వెర్షన్లు ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న డీజిల్‌ మోడళ్లతో పాటు విక్రయిస్తారు.

ధరలపై ఇంకా స్పష్టత ఇవ్వకపోయినా, పెట్రోల్‌ హారియర్‌, సఫారీల కోసం కొత్త ‘Ultra’ టాప్‌ ట్రిమ్స్‌ తీసుకురావడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

హారియర్‌, సఫారి పెట్రోల్‌ ఇంజిన్‌ వివరాలు

టాటా హారియర్‌, సఫారి పెట్రోల్‌ వెర్షన్లలో 1.5 లీటర్‌ హైపీరియన్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ అందిస్తున్నారు. ఈ ఇంజిన్‌ను టాటా మోటార్స్‌ స్వయంగా అభివృద్ధి చేసింది. ఇదే ఇంజిన్‌ తొలిసారిగా టాటా సియెర్రాలో కనిపించింది.

హారియర్‌, సఫారి పరిమాణంలో పెద్దవి, బరువు ఎక్కువ కావడంతో ఈ ఇంజిన్‌ను ప్రత్యేకంగా ట్యూన్‌ చేశారు. ఫలితంగా ఇది 170hp పవర్‌, 280Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

సియెర్రాతో పోలిస్తే ఇది 10hp, 25Nm ఎక్కువ పవర్‌ ఇస్తుంది. ఆసక్తికరంగా, పెట్రోల్‌ వెర్షన్ల పవర్‌ డీజిల్‌ వేరియంట్లతో సమానంగా ఉంది.

టాటా హారియర్‌ పెట్రోల్‌ వేరియంట్లు

పెట్రోల్‌ హారియర్‌ను టాటా ఏడు వేరియంట్లలో అందిస్తోంది: అవి Smart, Pure X, Adventure X, Adventure X+, Fearless X, Fearless X+ & కొత్తగా Fearless Ultra.

పెట్రోల్‌కు ప్రత్యేకమైన Fearless Ultra టాప్‌ ట్రిమ్‌లో ఎన్నో కొత్త ఫీచర్లు ఉన్నాయి.

  • Samsung 14 ఇంచ్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌
  • Dolby Atmos ఆడియో
  • డిజిటల్‌ IRVMతో ఇన్‌బిల్ట్‌ డ్యాష్‌ క్యామ్‌
  • వైట్‌, బ్రౌన్‌ డ్యూయల్‌ టోన్‌ ఇంటీరియర్‌
  • ఆన్‌బోర్డ్‌ నావిగేషన్‌
  • ORVM మెమరీ ఫంక్షన్‌
  • రివర్సింగ్‌ కెమెరాలకు వాష్‌ ఫంక్షన్‌
  • 65W టైప్‌-C ఛార్జింగ్‌ పోర్ట్‌

హారియర్‌ Dark, Stealth, Red Dark ఎడిషన్లలో కూడా లభిస్తుంది. కొన్ని డార్క్‌, స్టెల్త్‌ వేరియంట్లలో 19 ఇంచ్‌ అలాయ్‌ వీల్స్‌ అందిస్తున్నారు.

టాటా సఫారి పెట్రోల్‌ వేరియంట్లు

సఫారి పెట్రోల్‌ను Smart, Pure X, Adventure X, Adventure X+, Accomplished X, Accomplished X+ & కొత్తగా Accomplished Ultra వేరియంట్‌లో విక్రయిస్తారు.

Accomplished Ultraలో హారియర్‌ Fearless Ultraలో ఉన్న ఫీచర్లన్నీ ఉంటాయి. అయితే సఫారీలో గోల్డ్‌, వైట్‌ డ్యూయల్‌ టోన్‌ ఇంటీరియర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సఫారి ఇప్పటికే 19 ఇంచ్‌ అలాయ్‌ వీల్స్‌తో వస్తుంది. ఇది కూడా Dark, Stealth, Red Dark ఎడిషన్లలో అందుబాటులో ఉంటుంది.

మొత్తం మీద

టాటా హారియర్‌, సఫారి పెట్రోల్‌ వెర్షన్లతో SUV మార్కెట్‌లో టాటా తన పరిధిని మరింత విస్తరించింది. పెట్రోల్‌ ఇంజిన్‌, అల్ట్రా ట్రిమ్స్‌, ప్రీమియం ఫీచర్లతో... ఈ రెండు SUVలు డీజిల్‌ను మాత్రమే కాకుండా, పెట్రోల్‌ను కోరుకునే వినియోగదారులకు కూడా బలమైన ఎంపికగా మారనున్నాయి. ధరలు వెల్లడైన తర్వాత మార్కెట్‌లో వీటి ప్రభావం మరింత స్పష్టంగా కనిపించనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Embed widget