అన్వేషించండి

భవిష్యత్‌ కార్లలో నేచురల్‌ ఫైబర్‌ హవా: కార్బన్‌ ఫైబర్‌ను పక్కన పెట్టనున్న ప్రముఖ కంపెనీ

Natural Fibre Technology In Car Parts: భవిష్యత్తు కార్లలో కార్బన్‌ ఫైబర్‌ బదులు ఫ్లాక్స్‌ ఆధారిత నేచురల్‌ ఫైబర్‌ కాంపోజిట్స్‌ వినియోగించనున్నారు. దీంతో బరువు, కార్బన్‌ ఉద్గారాలు భారీగా తగ్గనున్నాయి.

BMW Natural Fibre Technology: కార్ల తయారీలో ఇప్పటివరకు కార్బన్‌ ఫైబర్‌ అంటే అత్యాధునిక మెటీరియల్‌గా భావించేవారు. తక్కువ బరువు, ఎక్కువ బలం కారణంగా గల్జరీ కార్లు, స్పోర్ట్స్‌ కార్లలో దీనిని విస్తృతంగా వాడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ దిశలో పెద్ద మార్పు రాబోతోంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ BMW, భవిష్యత్తు ప్రొడక్షన్‌ మోడళ్లలో కార్బన్‌ ఫైబర్‌కు బదులుగా నేచురల్‌ ఫైబర్‌ కాంపోజిట్స్‌ను ఉపయోగించనున్నట్టు ప్రకటించింది.

అవిసె మొక్క ఆధారంగా రూపకల్పన
ఈ నేచురల్‌ ఫైబర్‌ కాంపోజిట్స్‌ ఫ్లాక్స్‌ (అవిసె మొక్క) ఆధారంగా తయారవుతాయి. ఈ మెటీరియల్‌ను స్విట్జర్లాండ్‌కు చెందిన Bcomp అనే సంస్థ అభివృద్ధి చేసింది. BMW ఇప్పటికే చాలా సంవత్సరాలుగా మోటార్‌ స్పోర్ట్స్‌లో ఈ మెటీరియల్‌ను ఉపయోగిస్తూ పరీక్షలు చేసింది. ఆ అనుభవంతోనే ఇప్పుడు దీన్ని సాధారణ కార్లలో కూడా ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.

తగ్గనున్న కర్బన ఉద్గారాలు
పరీక్షల ప్రకారం, ఈ ఫ్లాక్స్‌ ఫైబర్‌ కాంపోజిట్స్‌ కేవలం లోపలి భాగాలకే కాకుండా, బయట కనిపించే ప్యానెల్స్‌, స్ట్రక్చరల్‌ పార్ట్స్‌ తయారీకీ కూడా సరిపోతాయని BMW చెబుతోంది. ఉదాహరణకు, భవిష్యత్తు కార్లలో రూఫ్‌ ప్యానెల్స్‌ తయారీలో ఈ మెటీరియల్‌ వాడితే, తయారీ దశలోనే సుమారు 40 శాతం CO2 ఉద్గారాలు తగ్గుతాయి. అంతేకాదు, వాహనం జీవితకాలం పూర్తయ్యాక రీసైక్లింగ్‌ పరంగా కూడా ఇది మేలు చేస్తుంది.

BMWకి చెందిన వెంచర్‌ క్యాపిటల్‌ విభాగం i Ventures, Bcomp సంస్థలో పెట్టుబడి పెట్టింది. Bcomp సంస్థను 2011లో స్థాపించారు. మొదటగా ఇది ఫ్లాక్స్‌ ఫైబర్లతో హై-పర్ఫార్మెన్స్‌ స్కీస్‌ తయారు చేసేది. 2022లో Bcomp అధికారికంగా BMW మోటార్‌ స్పోర్ట్‌ పార్ట్నర్‌గా మారింది.

Bcomp తయారు చేసిన ప్రత్యేకంగా నేసిన ఫాబ్రిక్‌ను Amplitex అంటారు. ఇది యూరప్‌లో పండించే ఫ్లాక్స్‌ మొక్కల నుంచి తీసిన ఫైబర్లతో తయారవుతుంది. అవసరాన్ని బట్టి వేర్వేరు నేసే విధానాలు ఉపయోగిస్తారు. దీంతో డిజైన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ఫాబ్రిక్‌ను నేరుగా వాడవచ్చు లేదా థర్మోప్లాస్టిక్‌ రెసిన్‌తో కలిపి ప్రీప్రెగ్‌ రూపంలో కూడా ఉపయోగిస్తారు.

స్ట్రక్చరల్‌ బలాన్ని పెంచేందుకు Powerribs అనే గ్రిడ్‌ లాంటి మెష్‌ను వాడతారు. ఇది కూడా ఫ్లాక్స్‌ ఫైబర్లతోనే తయారవుతుంది. ఇది ప్యానెల్స్‌కు బలం ఇచ్చి, బరువును తగ్గిస్తుంది.

BMW తొలిసారి ఈ నేచురల్‌ ఫైబర్‌ మెటీరియల్‌ను 2019 ఫార్ములా E కార్లలో ఉపయోగించింది. ఆ తర్వాత M4 DTM, M4 GT4 మోడళ్లలో కార్బన్‌ ఫైబర్‌ భాగాల స్థానంలో దీన్ని అమర్చారు. ముఖ్యంగా నుర్బుర్గ్‌ 24 అవర్స్‌ రేస్‌లో పాల్గొన్న M4 GT4లో ఈ భాగాలు విజయవంతంగా పనిచేశాయి.

Bcomp చెబుతున్నదేమిటంటే, ఉపయోగాన్ని బట్టి ఈ మెటీరియల్‌ 85 శాతం వరకు తక్కువ CO2 ఫుట్‌ప్రింట్‌ కలిగి ఉంటుంది. కొన్ని భాగాలు 50 శాతం వరకు తక్కువ బరువు ఉండగా, ప్లాస్టిక్‌ వినియోగాన్ని 70 శాతం వరకు తగ్గిస్తాయి.

ఇతర చాలా బ్రాండ్స్‌ కూడా...
BMW ఒక్కటే కాదు. Cupra, Kia, Polestar, Volvo, Porsche వంటి బ్రాండ్లు కూడా ఇప్పటికే ఈ నేచురల్‌ మెటీరియల్స్‌ను వేర్వేరు మోడళ్లలో ఉపయోగిస్తున్నాయి. దీని ద్వారా ఆటోమొబైల్‌ పరిశ్రమలో పర్యావరణ అనుకూల టెక్నాలజీ దిశగా పెద్ద మార్పు మొదలైనట్టే కనిపిస్తోంది.

దీనిని బట్టి, భవిష్యత్‌ కార్లు కేవలం శక్తిమంతమైనవే కాదు, ప్రకృతికి మేలు చేసేలా కూడా మారబోతున్నాయని మనం అర్ధం చేసుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Best Mileage Car: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
Maruti Fronx కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చిన Brezza Turbo.. సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై మీద ఎంత ఇచ్చిందంటే?
మారుతి బ్రెజ్జా టర్బో నిజమైన మైలేజ్ ఎంత? రియల్ వరల్డ్‌ టెస్ట్‌ ఫలితాలు ఇవిగో
సొంతంగా టాక్సీ నడిపేవాళ్లకు గొప్ప అవకాశం.. 320km రేంజ్‌ ఇచ్చే ఎలక్ట్రిక్‌ కారు.. రూ.4.5 లక్షలే!
టాక్సీ డ్రైవర్ల కోసం కొత్త ఎలక్ట్రిక్ కారు.. కేవలం రూ.4.5 లక్షలే.. సింగిల్‌ ఛార్జ్‌తో 320km!
Bayon vs Creta: క్రెటా కంటే బేయాన్ ధర తక్కువ.. ఏ కారులో ఫీచర్లు ఎక్కువ? కొనే ముందే ఈ తేడాలు తెలుసుకోండి!
హ్యుందాయ్ బేయాన్ vs హ్యుందాయ్ క్రెటా.. ఏది బెస్ట్ SUV?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Daughter Marriage: కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
కుమార్తె వివాహ వేదికను మార్చుతున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడి.. ఆవేదనతో పోస్ట్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - వ్యక్తిగత జీవితాలపై రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
తెలంగాణ రాజకీయాల్లో పరాకాష్ఠకు సైబర్ దాడి - రాజకీయాలు -వ్యక్తిత్వ హననం ఆయుధమా?
Embed widget