Allu Arjun's Pushpa: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'పుష్ప'. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా 'పుష్ప: ద రైజ్'. 'ఆర్య', 'ఆర్య 2' సినిమాల తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌లో అల్లు అర్జున్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ చెబుతున్నారు. "పుష్ప: ద రైజ్'డబ్బింగ్ కార్యక్రమాలు ఫుల్ స్వింగులో జరుగుతున్నాయి. తన లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్‌తో పుష్పరాజ్ (అల్లు అర్జున్జ్) మిమ్మల్ని థ్రిల్ చేస్తాడు" అని చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో ఆల్రెడీ రిలీజైన టీజర్‌లో హుక్ డైలాగ్ 'తగ్గేదే లే'ను యాడ్ చేశారు. దాంతో వీడియో ఎండ్ చేశారు.
The Dubbing formalities of #PushpaTheRise in full swing 🔥#PushpaRaj will thrill you on screens with his language and body language 😎#ThaggedheLe 🤙#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @ThisIsDSP @adityamusic pic.twitter.com/U09WhFXFMz
— Mythri Movie Makers (@MythriOfficial) November 21, 2021
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న 'పుష్ప'లో రష్మికా మందన్నా హీరోయిన్. ఆల్రెడీ విడుదలైన పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. సినిమా ఎంత మాసీగా ఉంటుందనేది టీజర్, దేవి శ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ చూపించాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా సినిమా ఇది. మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, సునీల్, ధనుంజయ విలన్లుగా నటించారు. అనసూయ కీలక పాత్రలో నటించారు. డిసెంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది.
Also Read: 'అఖండ' సినిమా సెన్సార్ పూర్తి... బాలకృష్ణ సినిమాకు ఏం సర్టిఫికెట్ వచ్చిందంటే?
Also Read: వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా అల్లు అర్హ... రాయ్ చెస్ అకాడమీలో నోబెల్ వరల్డ్ రికార్డ్
Also Read: కైకాలను ఫోనులో పలకరించాను... కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగింది - చిరంజీవి
Also Read: ఓ ఇంటివాడైన యువ హీరో కార్తికేయ... పెళ్లికి హాజరైన మెగాస్టార్
Also Read: సోనుసూద్ సింప్లిసిటీ.. చిన్నారికి జడలు వేస్తూ.. రోటీలు చేస్తూ.. బిజీబిజీ
Also Read: ‘మానస్ నుంచి ఏం కోరుకుంటున్నావ్.. ఆనీ నీకు బుర్ర లేదా?’ ఇంటి నుంచి ఔట్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి