News
News
X

Rakul Preet Singh: ప్రేమ విషయాన్ని బయటపెట్టింది.. కానీ పెళ్లి మాత్రం.. 

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తన పెళ్లి సంగతులను అభిమానులతో పంచుకుంది. 

FOLLOW US: 

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయింది రకుల్ ప్రీత్ సింగ్. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలతో ఆడిపాడింది. ఒకానొక దశలో రకుల్ డేట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు ఆ క్రేజ్ కాస్త తగ్గింది. ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ తక్కువనే సంగతి తెలిసిందే. కొత్త నీరు రావడంతో రకుల్ డిమాండ్ తగ్గిపోయింది. తెలుగులో ఆమె చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం బిజీ హీరోయిన్ గా మారింది. 

Also Read:'శ్యామ్ సింగ రాయ్' హిందీ రైట్స్‌ అమ్మేశారు! ఎంత వచ్చిందో తెలుసా?

దాదాపు అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తోంది రకుల్. అందులో 'థాంక్ గాడ్' అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోలుగా నటించారు. హీరోయిన్ గా ఈ సినిమా రకుల్ రోల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందట. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది రకుల్. ఓ సందర్భంలో తన పెళ్లి విషయాలను బయటపెట్టింది ఈ బ్యూటీ. 

మొన్నామధ్య రకుల్ తన 31వ పుట్టినరోజు నాడు.. తన ప్రేమ గురించి వెల్లడించింది. బాలీవుడ్ కి చెందిన నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని రకుల్ ప్రేమిస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని.. అందుకే రకుల్ అనౌన్స్మెంట్ ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. కానీ రకుల్ మాత్రం ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని తేల్చి చెప్పింది.

తన ప్రేమ సంగతి అందరికీ చెప్పడానికి కారణం.. అదొక అందమైన అనుభూతి అని, అందరితో షేర్ చేసుకోవాలనిపించి.. సోషల్ మీడియా వేదికగా విషయాన్ని వెల్లడించానని తెలిపింది. అయితే పెళ్లికి తొందర లేదని.. ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి పెట్టానని వెల్లడించింది. రకుల్ మాటలను బట్టి ఇప్పట్లో ఆమె పెళ్లి చేసుకునే ఛాన్స్ లేదనిపిస్తోంది. పెళ్లి ఆలోచన ఉంటే మాత్రం కచ్చితంగా అభిమానులతో పంచుకుంటానని తెలిపింది. 

Also Read: సందీప్ కిషన్ - విజయ్ సేతుపతి పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా ఫేమస్ తమిళ దర్శకుడు

Also Read: కైకాల ఆరోగ్య పరిస్థితి.. ఇప్పటికీ విషమంగానే..

Also Read: ఫైనల్ వ‌ర్క్స్‌లో బాలకృష్ణ 'అఖండ'... ఫినిషింగ్ టచ్ ఇస్తున్న తమన్!

Also Read:రవిపై దారుణమైన ట్రోలింగ్.. ఫ్యామిలీను కూడా లాగుతూ..

Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 22 Nov 2021 03:25 PM (IST) Tags: rakul preet singh Rakul Preet marriage plans Jackky Bhagnani thank god movie thank god bollywood promotions

సంబంధిత కథనాలు

Guppedantha Manasu ఆగస్టు 17 ఎపిసోడ్: నేను గెలిచాను వసుధార అన్న ఈగోమాస్టర్, జగతికి బంపర్ ఆఫర్ ఇచ్చిన రిషి

Guppedantha Manasu ఆగస్టు 17 ఎపిసోడ్: నేను గెలిచాను వసుధార అన్న ఈగోమాస్టర్, జగతికి బంపర్ ఆఫర్ ఇచ్చిన రిషి

Lucifer 2 Empuraan Movie : మెగాస్టార్ రీమేక్ సినిమాకు మాలీవుడ్‌లో సీక్వెల్ షురూ

Lucifer 2 Empuraan Movie : మెగాస్టార్ రీమేక్ సినిమాకు మాలీవుడ్‌లో సీక్వెల్ షురూ

Gruhalakshmi August 17th Update: సామ్రాట్ కాలర్ పట్టుకున్న నందు, నిజం బట్టబయలు- సముద్రంలో కొట్టుకుపోయిన తులసి?

Gruhalakshmi August 17th Update: సామ్రాట్ కాలర్ పట్టుకున్న నందు, నిజం బట్టబయలు- సముద్రంలో కొట్టుకుపోయిన తులసి?

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

బాలీవుడ్‌ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!

NBK107 Update : బాలకృష్ణ ఒక్కసారి డిసైడ్ అయ్యాక తిరుగుంటుందా?

NBK107 Update : బాలకృష్ణ ఒక్కసారి డిసైడ్ అయ్యాక తిరుగుంటుందా?

టాప్ స్టోరీస్

Desam Aduguthondhi: అమృతోత్సవ వేళ - రాజకీయాలేల ! నేతలు ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు !

Desam Aduguthondhi: అమృతోత్సవ వేళ - రాజకీయాలేల ! నేతలు ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు !

V Srinivas Goud: తెలంగాణ మంత్రిపై NHRC లో ఫిర్యాదు, కఠిన చర్యలకు డిమాండ్

V Srinivas Goud: తెలంగాణ మంత్రిపై NHRC లో ఫిర్యాదు, కఠిన చర్యలకు డిమాండ్

Bigg Boss Sunny Biography : యముడికి హాయ్ చెప్పి వచ్చినోడు - 'బిగ్ బాస్' కప్ కొట్టినోడు

Bigg Boss Sunny Biography : యముడికి హాయ్ చెప్పి వచ్చినోడు - 'బిగ్ బాస్' కప్ కొట్టినోడు

Munugode Bypoll: మునుగోడులో కాంగ్రెస్ కీలక ప్లాన్, ఆయన మద్దతు కోసం తహతహ - మరి ఆ వ్యక్తి ఒప్పుకుంటారా?

Munugode Bypoll: మునుగోడులో కాంగ్రెస్ కీలక ప్లాన్, ఆయన మద్దతు కోసం తహతహ - మరి ఆ వ్యక్తి ఒప్పుకుంటారా?