Michael: సందీప్ కిషన్ - విజయ్ సేతుపతి పాన్ ఇండియా సినిమాలో విలన్‌గా ఫేమస్ తమిళ దర్శకుడు
సందీప్ కిషన్, విజయ్ సేతుపతి హీరోలుగా ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అందులో విలన్‌గా ప్రముఖ తమిళ దర్శకుడిని ఎంపిక చేశారు.
దర్శకుడు గౌతమ్ మీనన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన సినిమాలు తెలుగులోనూ విజయాలు సాధించాయి. వెంకటేష్ హీరోగా 'ఘర్షణ'... నాగచైతన్య, సమంత జంటగా 'ఏ మాయ చేసావె'... నాగచైతన్య హీరోగా 'సాహసం శ్వాసగా సాగిపో' తదితర స్ట్రెయిట్ తెలుగు సినిమాలు తీశారు. దర్శకుడిగా మాత్రమే కాదు, ఆయన నటుడిగానూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. దర్శకుడిగా తాను తీసిన సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించిన ఆయన... 'కనులు కనులు దోచాయంటే' సినిమాలో డీసీపీ పాత్రలో అద్భుతంగా నటించి, అందరికీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు ఓ పాన్ ఇండియా సినిమాలో విలన్ రోల్ చేయడానికి 'ఎస్' అన్నారు.
సందీప్ కిషన్ హీరోగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్పెషల్ యాక్షన్ పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'మైఖేల్'. సందీప్ కిషన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇందులో విలన్‌గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ నటించనున్నట్టు ఈ రోజు ప్రకటించారు. 'మైఖేల్ ప్రపంచంలోకి నా గురువు, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ గారిని ఆహ్వానించడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మీ నుంచి నేర్చుకోవడానికి మరోసారి ఎదురు చూస్తున్నాను" అని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు.
Take pleasure in welcoming my Guru & Ace Director @MenonGautham as the Antagonist in the world of@MichaelTheFilm
— Sundeep Kishan (@sundeepkishan) November 22, 2021
Looking forward to learning from you once again sir ❤️@VijaySethuOffl
A @jeranjit Film
@SVCLLP @KaranCoffl
మైఖేల్ மைக்கேல் माइकल ಮೈಕೆಲ್ മൈക്കിൾ #Michael pic.twitter.com/NWEQ4VTcuF
ఈ సినిమాకు రంజిత్ జయకొడి దర్శకత్వం వహిస్తున్నారు. దక్షిణాది భాషలు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీలో రూపొందుతోంది. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు.
Happy & Excited to work with you Sir @menongautham ❤️
— 𝐑𝐚𝐧𝐣𝐢𝐭 𝐉𝐞𝐲𝐚𝐤𝐨𝐝𝐢 (@jeranjit) November 22, 2021
Team #MICHAEL 👊 takes pleasure in welcoming the maverick GVM sir💥
⭐️ing @sundeepkishan &
MakkalSelvan @VijaySethuOffl
A @jeranjit Film🎬
Produced by @SVCLLP @KaranCoffl
మైఖేల్ மைக்கேல் माइकल ಮೈಕೆಲ್ മൈക്കിൾ @MichaelTheFilm pic.twitter.com/HDG6syjChc
Also Read: కైకాల ఆరోగ్య పరిస్థితి.. ఇప్పటికీ విషమంగానే..
Also Read: ఫైనల్ వర్క్స్‌లో బాలకృష్ణ 'అఖండ'... ఫినిషింగ్ టచ్ ఇస్తున్న తమన్!
Also Read: సిరిని ఆటపట్టించిన రాజ్ తరుణ్.. యానీ, ప్రియాంకలలో ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?
Also Read:రవిపై దారుణమైన ట్రోలింగ్.. ఫ్యామిలీను కూడా లాగుతూ..
Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి